HPCL లో భారీగా గవర్నమెంట్ జాబ్స్ | HPCL Notification 2025

0
hpcl notification 2025

HPCL:హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇది దీని యొక్క ఫుల్ ఫార్మ్.ఈ HPCL అనేది భారత ప్రభుత్వ రంగానికి చెందిన ఒక ప్రముఖ ఇంధన సంస్థ.ఇది పెట్రోల్, డీజిల్, గ్యాస్, లూబ్రికెంట్లు మరియు ఇతర పెట్రోలియం ఉత్పత్తుల శుద్ధి, తయారీ, పంపిణీ, విక్రయాల్లో నిమగ్నమైన సంస్థ. HPCL యొక్క  ప్రధాన కార్యాలయం ముంబయి,మహారాష్ట్రలో ఉంది.

ప్రస్తుతం HPCL లో 63 పోస్టులతో ఒక నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది.దాని గురించి ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

HPCL Notification 2025

ఫ్రెండ్స్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇంకా ఇతర పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.ఈ జాబ్స్ కి గ్రూప్ డిస్కషన్,స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ,రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.దీని గురించి ఇంకొంచెం వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఫ్రెండ్స్ పైన తెలిపినట్టు HPCL లో 63 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ఇంతకీ 63 పోస్టులు ఏవి?,వాటికి స్యాలరి ఎంత ఇస్తారు?,ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి?, రిజర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే వాటి గురించి కింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesQualificationSalary
1Junior Executive-
Mechanical
11Diploma in
Mechanical
Engineering
RS 30,000-1,20,000
2Junior Executive-
Electrical
17Diploma in
Electrical
Engineering
RS 30,000-1,20,000
3Junior Executive-
Instrumentation
6Diploma in
Instrumentation
Engineering
RS 30,000-1,20,000
4Junior Executive-
Chemical
1Diploma in
Chemical
Engineering
RS 30,000-1,20,000
5Junior Executive- Fire
& Safety
28Any Science
Graduate + Diploma
in Fire & Safety
RS 30,000-1,20,00
Total63

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ HPCL జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి. అవి ఏంటి అంటే:

  • వయస్సు 18- 25 మధ్య ఉండాలి.
  • SC,ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల వయా పరిమితి సడలింపు  ఉంటుంది.
  • ఎడ్యుకేషన్ క్యాలిఫికేషన్ పైన పట్టికలో తెలిపాము.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే  ఈ జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది డాక్యుమెంట్స్ ఉండాలి.

  •  ఆధార్ కార్డు. 
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • అప్లికేషన్ ఫారం.
  • స్టడీ సర్టిఫికేట్.

CCRH Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ HPCL జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు నెలకు 30,000/- 1,20,000 వరకు స్యాలరి ఇస్తారు.దీంతో పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఆన్లైన్ లో ఈ HPCL జాబ్స్ కి అప్లై చేసుకునే SC,ST,PWD అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.ఇంకా మిగిలిన అభ్యర్థులు 1180/- అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Important Dates  

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది26-3-2025
అప్లికేషన్ లాస్ట్ తేది30-4-2025

Job Selection Process

ఫ్రెండ్స్ ఈ హెచ్పీసీఎల్ జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు రాత పరీక్ష,గ్రూప్ డిస్కషన్ పర్సనల్ ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. వీటన్నిటిలోనూ అర్హత పొందిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది.

Apply Process

ఈ HPCL జాబ్స్  పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

HPCL Notification 2025

Notification pdf