హైదరాబాద్;హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో లో బిజెపి.

0

హైదరాబాద్;హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో లో బిజెపి పార్టీ తమ అభ్యర్థిగా డాక్టర్  కోట రామారావును ప్రకటించింది.ఈ మేరకు బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం ప్రకటించారు.ఇప్పటికే టీఆర్ఎస్ పార్టి తమ అభ్యర్థిని ప్రకటించగా,తాజాగా బిజెపి  కూడా ఖరారు చేసింది.అయితే,బిజెపి పార్టీ లో రామారావుతో పాటు ఎన్నారై జైపాల్ రెడ్డి పేరు కూడా వినిపించింది.రామారావు గారు, బిసి వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో సామాజిక కోణంలో రామారావును బరిలోకి దించితే కలిసివస్తుందని బిజెపి భావించినట్లు తెలుస్తోంది.

ఒక ప్రభుత్వ  వైద్యుడిగా సేవలందించిన రామారావు,మూడు నెలల క్రితమే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన బిజెపి పార్టీలో చేరడం జరిగింది.ఈయన స్వస్థలం గరిడేపల్లి మండలం, గీత వారి గూడెం.కోటా రామారావు గారు మాట్లాడుతూ, ప్రస్తుతం యువత బిజెపి వైపు చూస్తున్నారని అన్నారు.టిఆర్ఎస్  ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఇంతకుముందు,ప్రభుత్వాల మాదిరిగానే, టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా అభివృద్ధిని మరిచిపోయిందని దుయ్యబట్టారు.టిఆర్ఎస్ ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న,అసంతృప్తే తనను గెలిపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ ఉప ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా ఆరేపల్లి శేఖర్ రావును ఆ పార్టీ ప్రకటించింది.అయితే సిపిఎం పార్టీ ఎన్నికల్లోమద్దతు కోసం సిపిఐ, టీజేఎస్ లతో,సంప్రదింపులు జరుగుతున్నాయని సిపిఎం పార్టీ ప్రకటించింది. కాకపోతే, సిపిఐ పార్టీ మాత్రం టిఆర్ఎస్ పార్టీకి, మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ఆ పార్టీ భావిస్తోంది.

హుజూర్ నగర్,ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఉత్తమ్ సతీమణి పద్మావతి పోటీ చేస్తున్నారు.టిఆర్ఎస్ పార్టీ తరఫున సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. సిపిఎం తరపున ఆరేపల్లి శేఖర్ రావు పోటీ చేస్తున్నారు. బిజెపి పార్టీ తరఫున కోట రామారావు పోటీ చేస్తున్నారు.వీరంతా తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు.ఈ ఉప ఎన్నికలను టిఆర్ఎస్ పార్టీ మాత్రం, ఎంతో ప్రతిష్టాత్మకంగా, తీసుకుంటోంది.అక్టోబర్ 21న ఎన్నికలు జరగనుండగా, 24న ఫలితాలు వెలువడతాయి.