స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా పోస్టర్స్ విడుదల

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8 అంటే నిన్న తన పుట్టినరోజు సందర్భంగా ఒకటి కాదు రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. అల్లుఅర్జున్ ఎంతగానో ఇష్టపడే దర్శకులలో సుకుమార్ ఒకడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమా తెరకెక్కుతున్నది ఈ చిత్రం పేరే “పుష్ప”. ఈ పుష్ప సినిమాకు సంబంధించి పోస్టర్స్ అల్లు అర్జున్ బర్త్ డే రోజున విడుదల చేశారు. ఇది ఒక విశేషం.

మరి రెండో విశేషం ఏమంటారా, అల్లు అర్జున్ నటిస్తున్న మరో కొత్త చిత్రం ఐకాన్. ఈ ఐకాన్ సినిమాకు సంబంధించిన పోస్టర్లు కూడా తన బర్త్ డే రోజున విడుదల చేశారు. నాపేరు సూర్య సినిమా తర్వాత అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకేసారి 3 కొత్త సినిమా ప్రాజెక్టులకు లైన్ క్లియర్ చేశాడు. కానీ అనుకోకుండా అల వైకుంఠ పురం లో చిత్రం పూర్తయి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక మిగిలిన రెండు ప్రాజెక్టులలో సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది.

ఇక మూడవ ప్రాజెక్టు చిత్రమే ఐకాన్.కానీ ఈ ఐకాన్ చిత్రానికి సంబంధించి చాలావరకు పుకార్లు వచ్చాయి. అవి ఏమనగా ఐకాన్ చిత్ర దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన ఫుల్ బిజీ అయిపోయాడు. అంతే ఇక అల్లు అర్జున్ అభిమానులు అందరూ ఐకాన్ చిత్రం అటకెక్కినట్లేనా అని అనుకున్నారు. అయితే సినీరంగానికి ఆశ్చర్యం కలిగించే విధంగా తన బర్త్ డే రోజునే 2 సినిమా పోస్టర్లు విడుదల చేసి అందరికీ షాక్ కొట్టించేలా చేశాడు. అల్లు అర్జున్ బర్త్ డే రోజున ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ దిల్ రాజు కు సంబంధించిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ వారు ఈ సినిమా పోస్టర్లను విడుదల చేశారు. ఈ కొత్త సినిమా పేరు ఐకాన్. ఈ ఐకాన్ పేరు కింద “కనబడుట లేదు” అనే క్యాప్షన్ కూడా ఉంటుంది. ఈ సినిమా టైటిల్ కింద సిలౌట్ తరహాలో అల్లు అర్జున్ ఓ బుల్లెట్ బైక్ నడుపుతున్నట్లు గా చూపించారు.

ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సాగుతున్న పుష్ప సినిమా చిత్రం షూటింగ్ పూర్తయ్యాక ఈ ఐకాన్ చిత్రం మొదలవుతుందని సినీవర్గాలు తెలియజేస్తున్నారు. మొత్తానికి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన అభిమానులందరికీ ఈ విధంగా ఓ మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.