డిగ్రీ ఉంటే చాలు జాబ్ పక్కా వస్తుంది |NMDFC Notification 2025

0
NMDFC Notification 2025

NMDFC Notification 2025:ఫ్రెండ్స్, NMDFC అంటే National Minorities Development and Finance Corporation అని అర్థం. ఇది భారత ప్రభుత్వానికి చెందిన ఒక ప్రభుత్వ రంగ సంస్థ.NMDFC ని 1994లో స్థాపించారు.

ఈ సంస్థ ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు మరియు పార్సీలు వంటి మైనారిటీ వర్గాలకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు అందిస్తుంది.అలాగే వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తోంది.

ప్రస్తుతం ఈ NMDFC లో కొన్ని ఉద్యోగాలకు సంభందించి NMDFC Notification 2025 ని విడుదల చేసింది దాని గురించి ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.

NMDFC Notification 2025

నేషనల్ మైనారిటీస్ డెవలప్‌మెంట్ అండ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 10 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారి చేసింది.ఇంతకి ఆ 10 జాబ్స్ ఏవి?వాటి గురించి వివరంగా క్రింద తెలుసుకుందాం.

Post Details

ఫ్రెండ్స్ NMDFC డిప్యూటీ మేనేజర్,అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ వంటి పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఇంతకీ  ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలంటే అర్హత ఏమి ఉండాలి?, జాబ్స్ లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి? వీటికి సాలరీ ఎంత ఇస్తారు?వాటి గురించి క్రింద పట్టికలో వివరంగా తెలుసుకుందాం.

S.NOPost NameNumber Of VacanciesReservationEducational QualificationSalaryAge Limit
1Deputy Manager1UR-1Degree40,000-
1,40,000/-
32
2Assistant
Manager
2UR-1,OBC-1PG degree in arts/ Science/ Commerce/Agricultural30,000-
1,20,000/-
30
3Assistant
Manager, E-0
(Finance and
Accounts)
1SC-1PG degree in Commerce30,000-
1,20,000/-
30
4Assistant
Manager, E-0
(HRM and Admin)
1UR-1PG Degree in Personnel Management30,000-
1,20,000/-
30
5Executive
Assistant
5UR-2,OBC-1,
EWS-01,
SC-01
Degree25,000-
95,000/-
27
Total10

Eligibility

ఫ్రెండ్స్ మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.అవి ఏంటి అంటే:

  • వయస్సు 18-32 మధ్య ఉండాలి.
  • ఎడుకేషన్ క్వాలిఫికేషన్ గురించి పైన పట్టికలో తెలిపాము.
  • కంప్యూటర్ పై అవగాహనా ఉండాలి.
  • రిజర్వేషన్ ఉన్నటువంటి అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు కూడా ఉంటుంది.

Documents

మనం ఏ ఉద్యోగంకి అయిన అప్లై చేయాలంటే డాక్యుమెంట్స్ అనేవి మన వద్ద తప్పనిసరిగా ఉండాలి.

అలాగే ఈ NMDFC Notification 2025 జాబ్స్ కి మనం అప్లై చేసుకోవాలంటే మన వద్ద ఈ క్రింది తెలిపిన డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి.అవి:

  •  ఫోటోలు
  • ఆధార్ కార్డు. 
  • రేషన్ కార్డు.
  • ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్.
  • క్యాస్ట్ సర్టిఫికేట్.
  • స్టడీ సర్టిఫికేట్స్.
  • డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్.
  • ఎక్స్ పిరియన్స్ ఉంటె ఎక్స్ పిరియన్స్ సర్టిఫికేట్.

MED Notification 2025

Salary Details

ఫ్రెండ్స్ ఈ NMDFC Notification 2025 జాబ్స్ కి ఎంపికైన అభ్యర్థులకు పైన పట్టికలో తేలినట్లు ఒక్కో జాబ్ కి ఒక్కో రకమైన స్యాలరిని అందిస్తారు.వీరికి స్యాలరితో  పాటు ఇతర అలవెన్స్ లు కూడా ఇస్తారు.

Application Fees

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే OBC అభ్యర్థులకు 600/- ఫీజు ఉంటుంది.మిగతావారికి అంటే రిజర్వేషన్ ఉన్నటువంటి SC,ST,PWBD అభ్యర్థులకు 300/- ఫీజు ఉంటుంది.

Important Dates  

ఫ్రెండ్స్ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ క్రింద తెలిపిన తేదీలు చాలా ముఖ్యమైనవి.

అప్లికేషన్ స్టార్టింగ్ తేది3-5-2025
అప్లికేషన్ లాస్ట్ తేది2-6-2025

Job Selection Process

ఈ NMDFC Notification 2025 జాబ్స్ కి అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులకు మొదట రాత పరీక్ష నిర్వహించి అందులో అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు ఇంటర్వ్యూ,డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి  జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది.

NOTE:ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు క్రింది తెలిపిన వాటి నుంచి క్వశ్చన్స్  అడుగుతారు.

  • జనరల్ ఇంటలిజెన్స్ & రిసనింగ్
  • ఇంగ్లీష్ లాంగ్వేజ్
  • జనరల్ అవేర్నెస్
  • ప్రొఫెషనల్ నాలెడ్జ్

Apply Process

ఫ్రెండ్స్ ఈ జాబ్స్ పై ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకు ద్వారా అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకుని ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

NMDFC Notification 2025 PDF

NMDFC WEBSITE