Disco Raja Teaser రివ్యూ- రవితేజ ఇంత ఎనర్జీ ఎపుడు చూపలేదు

0

disco raja teaser review in telugu

టాలీవుడ్ అగ్రహీరో రవితేజ నటించిన డిస్కో రాజా మూవీ టీజర్ రివ్యూ : మాస్ మహారాజా రవితేజ హీరోగా విజయ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డిస్కోరాజా. పాయల్ రాజ్ పుత్ , నభ నటేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాబీ సింహా ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన రజని తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. అందుకే అప్పుడే ఈ సినిమా గురించి ప్రచారం చేయడం మొదలు జరుగుతున్నది. ముఖ్యంగా ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రంలో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్లో నటిస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక టీజర్ ఇంతకు ముందే రిలీజ్ అయినది .
ఇప్పుడు మరల మరొక టీజర్ రిలీజ్ చేశారు.

కాస్త గ్యాప్ ఇచ్చి సోల్జర్స్ బాంబింగ్,ఫైరింగులతో భయంకరమైన వైలెన్స్ చూసి ఆ తర్వాత రిటైర్డ్ అయి ఇంటికి వచ్చి నిశ్శబ్దంగా ఉంటున్నప్పుడు ఎలా ఉంటుందంటే అంతకంటే భయంకరమైన వైలెన్స్ గా ఉంటుందనే డైలాగ్తో ఈ టీజర్ మొదలవుతుంది. అలాగే ఫ్రీ కౌంట్ అంటూ కూల్ గా డాన్స్ చేస్తూ సాగే పాటలో ఒకరికి గన్ గురిపెట్టి ఐ లవ్ ఫ్రీకింగ్ ఫియర్ ఇన్ యువర్ ఐస్ అని పాట పాడుతాడు. మధ్యలో పవర్ఫుల్ విలన్ బాబీ సింహ ను ఒక సీన్లో చూపించారు.
మొదటిసారి రవితేజ డ్యూయల్ రోల్ లో సైంటిఫిక్ థ్రిల్లర్ చేస్తున్నందుకు ఈ చిత్రం మంచి విజయాలు సాధించాలని కోరుకుందాం.

Disco Raja Teaser 2.0 official teaser కింద చూడండి.

https://youtu.be/0ou0u8U5XuM