బాలీవుడ్ లో బయోపిక్ ల జోరు,మరో క్రీడా రంగానికి చెందిన,బయోపిక్ స్టొరీ తో వస్తున్న పరిణీతి చోప్రా. ఈమె నటించబోయే ఈ బయోపిక్ స్టోరీ మన తెలుగు రాష్ట్రానికి చెందిన సైనా నెహ్వాల్ జీవిత కథ.బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అయినా సైనా నెహ్వాల్ మన రాష్ట్రానికి కాకుండా దేశానికి కూడా ఎన్నో పథకాలను అందించింది.
14 అంతర్జాతీయ టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్.ప్రపంచ క్రీడా చరిత్రలో ప్రతి క్రీడాకారుడు ప్రతి క్రీడాకారిణి ఒక్కసారైనా ఒలంపిక్ పథకాన్ని గెలవాలని అని అనుకుంటారు. అలాంటి ఒలింపిక్ పతకాన్నిమన సైనానెహ్వాల్ లండన్ ఒలంపిక్ లో తన 25 సంవత్సరాల వయసులోనే గెలుచుకుంది.దిగ్గజ ఆటగాడు ప్రకాష్ పదుకొనే 1980లో లో నెంబర్ వన్ గా నిలిచారు. ఆ తర్వాత మన భారతదేశం తరఫునుండి బ్యాడ్మింటన్ లో నెంబర్ వన్ గా నిలిచిన ఏకైక క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కావడం, మన భారతదేశానికి ఎంతో గర్వకారణం.బ్యాడ్మింటన్ క్రీడా గురించి ఎవరు మాట్లాడినా వారు చెప్పే దేశం మాత్రం చైనా.
అలాంటి చైనాలోనే నిర్వహించిన ఒక టోర్నమెంటులో పథకం నెగ్గిన సైనా నెహ్వాల్.ఇలాంటి క్రీడాకారిని గురించి చాలా రోజులుగా బయోపిక్ తీయాలి అని చాలామంది ఇది అనుకున్నారు. కానీ ఆ అదృష్టం మన ప్రియాంక చోప్రా అయినా, చెల్లిలి కి దక్కింది. ఈ బయోపిక్ సినిమా కోసం చాలా బొద్దుగా ఉండే పరిణతి చోప్రా,ఎంతో నాజూకుగా తన శరీరాన్ని తయారు చేసుకుంది.