వచ్చే సంక్రాంతికి రాబోయే రెండు భారీ సినిమాల విడుదల తేదీలు ఖరారు చేసుకున్నాయి. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నా సినిమా అల వైకుంఠ పురంబులో,మహేష్ బాబు,హీరోగా నటిస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ లను ఒకే రోజు ప్రకటించారు.
ఆ రెండు సినిమాలూ ఒకే రోజు, అంటే 2020 జనవరి12 న రిలీజ్ అవ్వడ పెద్ద ట్విస్ట్.శనివారం సాయంత్రం అల్లు అర్జున్ తన సినిమా డేట్ ప్రకటించారు. తర్వాత మహేష్ బాబు కూడా రంగంలోకి దిగారు.
అల్లు అర్జున్ సినిమా 12న ఫిక్స్ అయింది. కాబట్టి దానికంటే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తర్వాత మహేష్ బాబు సినిమా వస్తుందేమో అనుకున్నాము. కానీ మహేష్ బాబు కూడా 12నే తన సినిమా రిలీజ్ అవుతుందని ఆయన ప్రకటించారు.
మామూలుగా సినిమాలు అన్నిశుక్రవారం రిలీజ్ అవుతుంటాయి కానీ ఈ రెండు సినిమాల్ని ఆదివారం రిలీజ్ చేస్తుండడం పెద్ద షాకే.ఈ రెండు సినిమాల డేట్లమారుస్తారా అన్న విషయం గురించి ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య డిస్కషన్ నడుస్తున్నాయి.తరువాత ఏమైనా రాజీకి వచ్చి ఏదో ఒక సినిమా డేట్ మారుస్తారా లేదో వేచి చూడాలి.