బాక్సర్ గా కనిపించనున్న వరుణ్ తేజ్.

0

మెగా కుటుంబం నుంచి,వచ్చిన హీరోలలో రామ్ చరణ్ అల్లు అర్జున్ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న, హీరో మన వరుణ్ తేజ్. ముకుంద చిత్రంతో తెలుగు చలనచిత్ర సీమకు పరిచయం అయినా ఈయన తన చిత్రాలలో ఏదో ఒక వైవిధ్యం చూపిస్తూ వస్తున్నారు.ఇప్పుడున్న యువ హీరోలలో వరుణ్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఆయన ఇప్పటి వరకు 9 చిత్రాల్లో నటించగా రెండు మినహా ఇస్తే మిగతా చిత్రాలు అన్నీ హిట్ సినిమాలే,విక్టరీ వెంకటేష్ తో కలిసి వరుణ్ తేజ్ నటించిన చిత్రం. ఎఫ్ 2 ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో మనందరికీ తెలుసు. ఆ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ చిత్రం కూడా విజయం సాధించడంతో, వరుణ్ తేజ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది .

ఈ చిత్రం హిట్ తర్వాత వరుణ్ తేజ్ కూడా తన  పారితోషికాన్ని అమాంతం పెంచేశారు అని ఫిలింనగర్లో కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకుముందు సినిమాలకు మూడు కోట్ల నుండి నాలుగు కోట్ల వరకు పారితోషికం అందుకునేవారు.ఇక గద్దల కొండ గణేష్ చిత్రం తర్వాత ఆయన ఇప్పుడు 5 నుండి 8 కోట్ల వరకూ పారితోషికం తీసుకుంటున్నట్టు సమాచారం.

 నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. అల్లు వెంకటేష్, ముద్దా సిద్దు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.