ysr aarogyasri card status check (eligibility) using ration card number
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కార్డు గురించి ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకుంటే వెంటనే ఆన్లైన్లో చెక్ చేసుకోండి.
డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ కేర్ ట్రస్ట్ అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా aarogyasri cards విడుదల చేస్తున్నది. ఈ aarogyasri card లో కొత్త ప్రభుత్వం కొత్త రంగులతో ఆకర్షణీయంగా ముద్రించి విడుదల చేస్తున్నది.ఆరోగ్యశ్రీ కార్డు చూసినట్లయితే దీనికి క్రింది వైపున ఆరోగ్యశ్రీ కార్డు కు సంబంధించి ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నారో వారి పూర్తి వివరాలు తెలియ పరిచారు.
ఈ ఆరోగ్యశ్రీ కార్డు లో ఆ కుటుంబంలో ఉండే సభ్యుల ఫోటోలు కూడా ముద్రించి ఉంటాయి. ఆరోగ్యశ్రీ కార్డు వెనుకల వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సేవా ట్రస్ట్ కు సంబంధించి పూర్తి నేమ్స్ ముద్రించబడి ఉంటాయి. రేషన్ కార్డు అప్లై చేసుకున్నప్పుడు ఫోటోనే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కార్డు లో కూడా అదే ఫోటో ముద్రితమై ఉన్నది. మీరందరూ కూడా వెంటనే ఆన్లైన్లో ఆరోగ్యశ్రీ కార్డు వివరాలు తెలుసుకొని అందులో ని స్టేటస్ వివరాలు మొదటగా తెలుసుకోవాల్సిందే తప్పనిసరిగా !
ఎందుకంటే ఆరోగ్యశ్రీ కార్డు స్టేటస్ లో ఆ కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్య వారి, ఫోటోలు పూర్తి వివరాలు అన్నీ కూడా ఉంటాయి అందుకే ఒకసారి చెక్ చేసుకుని పరిశీలించవలసిందిగా తెలియజేస్తున్నాం.
ఒకవేళ ఆరోగ్యశ్రీ కార్డు లో ఈ స్టేటస్ లో ఆ కుటుంబంలో ఎవరైనా ఒకరు సభ్యులు నమోదు కాకపోయినట్లయితే ఆ నమోదు కాకపోతే కాకుండా ఉన్నటువంటి సభ్యులకు ఆరోగ్యశ్రీ వర్తించదు.
ysr aarogyasri card status లో పేరు లేకుంటే ?
ఫోటో లేని కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య పని మీద ఏ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు అతనికి ఆరోగ్యశ్రీ అనేది వర్తించదు. ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు లో ఏవైనా ముద్రిత పొరపాట్లు ఉంటే కనుక వెంటనే మీ గ్రామ వాలంటీర్ లేదా మీ గ్రామ సచివాలయ సిబ్బంది ని కలిసి వారికి ఆ సమస్యను తెలియజేయాలి . అలా చేసినట్లయితే వాళ్ళు వెరిఫై చేసుకుని తప్పుగా ముద్రితమైన విషయాన్ని సరి చేయడానికి అవకాశం కలదు.
ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జనవరి నెలాఖరు లోపు అందుబాటులోకి రానున్నాయి కాబట్టి వీలైనంత త్వరగా అందరూ కూడా చెక్ చేసుకుని ఉండాలి. కాబట్టి కార్డులు బయటకు రావడాన్ని కంటే ముందే మీ యొక్క కుటుంబ స్టేటస్ చెక్ చేసుకుని వీలైనంత త్వరగా కార్డులో ఉన్న లోపాలు ఏవైనా ఉంటే ఇప్పుడే చెక్ చేసుకోవలసిందిగా తెలియజేస్తున్నాం.
నవశకం లో భాగంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేరు ఉందో లేదో అర్హత ఉందో లేదో ఒక్క క్లిక్ తో క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మీయొక్క ప్రస్తుత రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేసి తెలుసుకోండి.