నిద్ర పట్టడనికి చిట్కాలు | Nidhra Pattaniki Chitkalu In Telugu
నిద్ర పట్టడనికి చిట్కాలు :– నిద్ర పట్టడానికి చాల మంది వివిధరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. మరికొందరు నిద్ర పట్టడానికి వైదుడిని సంప్రదిస్తారు. నిద్ర లేకపోతే హెల్త్ అనారోగ్యం గురి అవుతుంది.
అయితే మానవునికి కనీసం రోజుకు 8 గంటలు నిద్ర ఉండాలి. కానీ ప్రస్తుత కాలంలో మనిషి కాలం వెంట పరుగెడుతూ ఉన్నాడు. ఆఫీస్‌లో కంప్యూటర్ ముందు గంటలకొద్దీ గడిపి కూడా ఇంటికి వచ్చాకా టీవీ, మొబైల్ చూస్తూ బిజీ అయిపోతున్నారు. ఇలా చేయటం వలన వారికీ నిద్ర పట్టకపోవచ్చు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.
నిద్ర బాగా పట్టాలంటే ఏం చేయాలి | నిద్ర పట్టడానికి చిట్కాలు ఏమిటి
నిద్ర పట్టడానికి అనేక రకాల చిట్కాలు కలవు అవి ఏంటో తెలుసుకుందాం.
- నిద్ర బోయే ముందుగా ఓంకారం లేదా మృదువైన సంగీతం కొంతసేపు విని పడుకోవాలి.
 - పడుకొనే ముందుగా గసగసాలు లైట్ గా వేగించి వాటిని వాసనా కొంత సేపు పిల్చుకొని పాడుకోవాలి.
 - పడుకునే ముందుగా నాటు ఆవు నెయ్యి గోరు వెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి.
 - రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి.
 - పడుకొనే ముందుగా సుందర దృశ్యాలను ఊహించుకుంటూ పడుకోవాలి.
 - పడుకొనే ముందుగా అసలు మొబైల్ ని చూడరాదు.
 - టి.వి కూడా ఎక్కువ సేపు చూడరాదు.
 - పడుకొనే ముందుగా ఒక గ్లాస్ పాలు త్రాగి పడుకోవాలి.
 - రాత్రి పడుకునే ముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకొని పడుకోవాలి.
 - అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిది. ఇందులో అధికండా మెగ్నీషియం, పొటాషియం, సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల జీర్ణ శక్తి మెరుగు అవుతుంది. హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
 - నిద్ర బోయే ముందుగా రెండు బాదం తినడం ద్వారా నిద్ర తొందరగా పడుతుంది.
 - వారంలో రెండు సార్లు చేపలను తినడం ద్వారా నిద్ర హాయిగా పడడానికి సహయంచేస్తుంది.
 - బీన్స్‌లో సుఖ నిద్రకు ఉపయోగపడే ఎన్నో పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా.. ఇందులోని బి, బి 6, బి12 అనే విటిమన్లు నిద్రలేమి సమస్యలు దూరం చేస్తాయి.
 - పడుకొనే ముందుగా ఒక గ్లాస్ పాలు తీసుకొని అందులోకి ఒక చెంచ తేనె కలుపుకొని త్రాగడం వల్ల తొందరగా నిద్రపడుతుంది.
 - పడుకొనే ముందుగా కూల్ వాటర్ తీసుకోవడం వల్ల రాత్రిపూట నిద్ర పడుతుంది.
 - రాత్రి పడుకొనే ముందుగా తాజా పండ్లను తినడం ద్వారా కడుపులో చల్లగా చేసి తొందరగా నిద్ర వచ్చేల చేస్తుంది.
 - నిద్ర పోవటానికి అరగంట ముందు కోద్ది సేపు నడవాలి.
 - పడుకొనే ముందుగా భయంకరమైన దృశ్యాలను చూడరాదు.
 
నిద్ర పట్టకపోవడానికి కారణాలు | Nidra Pattaka Povadaniki Karanam In Telugu
ఇంత వరకు నిద్ర పట్టడానికి చిట్కాలు తెలుసుకొన్నారు కదా! ఇప్పుడు రాత్రి సమయంలో నిద్ర ఎందుకు పట్టదో తెలుసుకుందాం.
- పగలు పూట ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల రాత్రి పూట నిద్ర రాదు.
 - మొబైల్ చూడడం వల్ల నిద్ర రాదు.
 - టి.వి ఎక్కువ సమయం చూడడం వల్ల నిద్ర రాదు.
 - పగటిపూట ఎక్కువ సమయం పని చేయడం ద్వారా రాత్రి సమయంలో ఆ నొప్పులకి నిద్ర పట్టదు.
 
గమనిక :- పైన పేర్కొన్న సమాచారం కేవలం మీకు అవగాహనా కోసమే. మీకు రాత్రి సమయంలో నిద్ర పట్టకపోతే తప్పకుండ వైదుడిని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-









