Table of Contents
నిఫా వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు, తీసుకోవాల్సిన చికిత్స తెలుగులో
నిఫా వైరస్ : ఫ్రెండ్స్ ప్రస్తుత కాలంలో ఈ నిఫా వైరస్ గురించి తెలియనివారు అంటూ ఎవరులేరు. ఈ నిఫా వైరస్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీనిని మొట్టమొదట 1998లో కనుగొన్నారు. ఇది మలేషియా, సింగపూర్ ప్రాంతంలో పందులు, ప్రజల్లో వ్యాప్తి చెందడం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే గబ్బిలాలు, పందుల నుంచి మనిషికి సోకుతుంది. ఈ వైరస్ కూడా కోవిడ్ లాగానే ఉంటుంది.
ఈ వైరస్ మన దేశంలో కేరళలో మొదట వచ్చింది. ఈ ఆర్టికల్ లో మనం ఈ నిఫా వైరస్ యొక్క లక్షణాలు, వైరస్ వస్తే చేపించుకోవాల్సిన చికిత్స గురించి వివరంగా తెలుసుకుందాం.

నిఫా వైరస్ లక్షణాలు:
మనం ఈ క్రింద ఈ నిఫా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ వైరస్ లక్షణాలు 4 నుంచి 14 రోజులలో కనిపిస్తాయి. అవి:

- తలనొప్పి
 - జ్వరం
 - వాంతులు
 - శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
 - దగ్గు
 - మూర్చ
 - అతిసారం
 - కండరాల నొప్పి
 - తీవ్రమైన బలహీనత
 - మనిషికి దిక్కుతోచని స్థితి
 
Note: పైన తెలిపిన వాటిలో ఏవైనా లక్షణాలు మిలో కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించండి.
నిఫా వైరస్ కు చికిత్స:
ఫ్రెండ్స్ ఈ నిఫా వైరస్ కు టీకాలు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు.ఐసీయూలో పెట్టి చికిత్స మాత్రమే అందిస్తారు. డాక్టర్స్ వ్యాధి వలన కలిగే లక్షణాలను అనుసరించి చికిత్స చేయాలి. ప్రస్తుతానికి ఈ వైరస్‌కు ప్రత్యేకించి ఎలాంటి చికిత్స లేదు.
నిఫా వైరస్ ఎలా వ్యాపిస్తుంది:
ఈ వైరస్ కూడా కోవిడ్ లాంటి భయంకరమైన వైరస్. ఇది ఎలా సోకుతుందో క్రింద వివరంగా తెలుసుకుందాం.
- ఇంట్లో పెంపుడు జంతువులు అనారోగ్యంతో ఉంటే తగిన జాగ్రత్తలు తీసుకోండి మరియు వాటిని జాగ్రత్తగా చూసుకోండి.
 - జంతువులు కాటుక తిన్నప్పుడు నిఫా వైరస్ సోకుతుంది. అంటే ఈ వైరస్ సోకిన జంతువులు కొరికిన పండ్లను మనం తినటం వలన వ్యాపిస్తుంది.
 - కాబట్టి గబ్బిలాలు కుట్టిన పండ్లు మరియు కూరగాయలను తినవద్దు.
 
నిఫా వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
ఫ్రెండ్స్ ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు కాబట్టి కోన్ని జాగ్రత్తలను తీసుకొని ఈ వైరస్ సోకకుండా జాగ్రత్త పడవచ్చు. అవి:
- అపస్మారక స్థితిలో ఉన్న జంతువును మీ చేతులతో తాకవద్దు.
 - చేతులను తరచుగా సబ్బుతో కడుక్కోవాలి.
 - పందులు, గబ్బిలాలకు దూరంగా ఉండాలి.
 - గాట్లు పెట్టినట్లున్న పచ్చి పండ్లను తినకూడదు.
 - పూర్తిగా ఉడికిన మాంసమే తినాలి.
 - ఇంటి చుట్టూ గబ్బిలాలు రాకుండా జాగ్రత్తపడాలి.
 - సోకిన వ్యక్తి యొక్క అవశేషాలు, రక్తం లేదా శరీర ద్రవాలను తాకకుండా జాగ్రత్త వహించండి.
 - వైరస్ సోకిన రోగులకు ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందించాలి.
 
గమనిక: పైన తెలిపిన సమాచారం మాకి ఇంటర్నెట్ లో దొరికినన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఇందులో ఏవైనా సందేహాలు ఉంటె వెంటనే మీ ఫ్యామిలి డాక్టర్ ని సంప్రదించండి.









