మీరు విన్నది నిజమే ఇది సినిమా పేరు కాదు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తీసుకున్న సంచలన నిర్ణయం. ఏప్రిల్ 1నే అందరికీ పెన్షన్లు. సీఎం ఆదేశాలతో అధికారుల తక్షణ చర్యలు. కరోనా వైరస్ కారణంగా చేతుల్లో డబ్బు లేక,తీవ్ర ఇబ్బందుల పరిస్థితి లోనూ రాష్ట్ర ప్రభుత్వం విశేష చర్య. సీఎం ప్రకటించిన విధంగా ఏప్రిల్ 4న ప్రతి నిరుపేద కుటుంబానికీ రూ.1000ల చొప్పున ఇంటి దగ్గరే పంపిణీ చేయనున్న వాలంటీర్లు
కరోనా వైరస్ విపత్తులో నిరుపేద కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసా. ఆదివారం (మార్చి 29) డీలర్ నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పు ఉచితం ఏప్రిల్ 15న మరోసారి ఉచిత రేషన్, అప్పుడు కూడా ఉచితంగా కేజీ కందిపప్పు ఇవ్వనున్నారు ఏప్రిల్ 29న మూడోసారి ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పు పంపిణీ చేయనున్నారు.ప్రత్యేక కార్డుల కు కూడా వర్తింపు. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకంలో లేని కార్డులకూ ఇవ్వనున్న రాష్ట్రం
CM ఆదేశాలమేరకు అదనపు ఖర్చును భరించనున్న రాష్ట్రం. కరోనా సమయంలో పేదలెవ్వరికీ ఇబ్బంది రాకుండా, పంపిణీకి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ –19 వైరస్ కారణంగా తీవ్రం గా రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్న నిరుపేద కుటుంబాలకు AP సీఎం శ్రీ వైయస్.జగన్ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరందరికి బాసటగా నిలుస్తోంది.
రేపటి నుంచి ఉచితంగా బియ్యం, కేజీ కంది పప్పును పంపిణీచేయనుంది. ఇది కాక ఏప్రిల్ నెలలో 15వ తేదీన, 29వ తేదీన మరో రెండు సార్లు ఉచితంగా బియ్యం, కంది పప్పును ఇచ్చే విధంగా సన్నద్ధమవుతోంది. క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో AP CM శ్రీ వైయస్.జగన్ సమావేశమయ్యారు. పేదలకు ఆహార భద్రతలో ఎలాంటి ఇబ్బంది రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు.
కరోనా వైరస్ కారణంగా రాష్ట్రంలోని పేదకుటుంబాల ఆహార భద్రతకు ముప్పురాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదివరకే ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ మార్చి 29నే ఉచితంగా బియ్యం, కేజీ కందిపప్పును అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం (మార్చి 29,2020) నుంచి ఈ రేషన్‌ను డీలర్ల కు చేరవేసి అక్కడ నుంచి అందరికీ అందిస్తారు.
దీంతోపాటు ఏప్రిల్ 15న మరోసారి కూడా రేషన్‌ను పంపిణీచేయనున్నారు. అప్పుడు కూడా నిర్దేశించిన బియ్యంతోపాటు, కిలో కందిపప్పును ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అలాగే ఏప్రిల్ 29న మూడోసారి రేషన్‌ను అందించనున్నారు. బియ్యంతోపాటు, కేజీ కందిపప్పును ప్రతి పేదకుటుంబానికీ ఇవ్వాలని నిర్ణయించారు.
కేంద్ర ప్రభుత్వం అదనంగా ఉచిత రేషన్ ఇస్తున్నట్టు ప్రకటించినా, కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రతా పథకం కొన్ని కుటుంబాలకే వర్తిస్తోంది. కాని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కుటుంబాలకూ ఉచిత రేషన్, కేజీ కందిపప్పును అందించి అవసరం మేరకు అదనపు భారాన్ని మోయాలని నిర్ణయించింది.
అంతేకాక ఎప్పటిలానే ఏప్రిల్ ఒకటోతేదీనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా లబ్ధిదారులందరికీ పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్లను ఈ ఏప్రిల్ నుంచి డోర్‌డెలివరీ చేయనున్నారు.
వీటితోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ ప్రకటించిన విధంగా ప్రతి నిరుపేద కుటుంబానికీ రూ.1000ల చొప్పున ఏప్రిల్ 4వ తేదీన ఆర్థిక సహాయం చేయనున్నారు. గ్రామ వాలంటీర్ల నేరుగా డోర్‌డెలివరీ చేయనున్నారు.
లాక్‌డౌన్ సందర్భంగా వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు, కొనుగోళ్లు నిలిచిపోయినా, రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయినప్పటికీ, పెన్షనర్లను, పేదకుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం శ్రీ వైయస్.జగన్ ఇలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.ఇందుకోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూ ఉండండి తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్సైటు .