కరోనా టెస్ట్ రిజల్ట్ కేవలం ఇక పది నిమిషాల లోపే!

0

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే వైరస్ సోకిన వ్యక్తులలో పరీక్షలు తప్పనిసరి చేసింది. అనుమానితుడైన రోగికి కరోనా నిర్ధారణ అయిందా లేదా అని కనిపెట్టడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష Covid ర్యాపిడ్ కిట్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక విమానంలో ఈ కిట్లను తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ కిట్లను లాంఛనంగా తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించాడు. ఈ రాపిడ్ కిట్టు కేవలం పది నిమిషాల లోపే వ్యాధినిర్ధారణ రిజల్ట్ ను బయటకు తెలుపుతుంది. ఈ కొత్త కిట్లు అందుబాటులోకి రావడంతో ఇక పరీక్షలను వేగవంతం చేయనున్నారు.

కోవిడ్19 రాపిడ్ కిట్ ఉపయోగం:-

కరోనా ను అడ్డుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన తెలియజేశాడు. ఇక కరోనా పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఐదవ స్థానంలో ఉన్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ ప్రిన్సిపుల్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు తెలియజేశారు. త్వరలోనే ర్యాపిడ్ కిట్లను అన్ని జిల్లాలకు పంపనున్నట్లు తెలిపారు.వ్యాది సోకిన అనుమానితులను ఎక్కువ సంఖ్యలో ఈ కిట్ల ద్వారా టెస్టింగ్ చేసి రిజల్ట్ ను అతి సులువుగా, అతి తక్కువ సమయంలో రాబట్టడానికి అవకాశాలు చాలా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ముఖ్యంగా ఈ రాపిడ్ టిక్కెట్ల ద్వారా వ్యాధి వైరస్ సోకినదా లేదా అని తెలుసుకోవచ్చు. రెండవది వైరస్ సోకిన తర్వాత అతనిలో వ్యాధి తగ్గుదల ఎలా ఉంది అనేది కూడా కనిపెట్టవచ్చు అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి త్వరలోనే ర్యాపిడ్ కిట్టు అందరికీ వినియోగంలోకి వచ్చేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని కరోనాను అరికట్టాలని ఆశిద్దాం. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయండి.