ఉన్నత చదువులు చదువుతున్న ఎంతోమంది విద్యార్థుల పెద్ద కల Passport. విదేశాలలో ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి, విదేశాలలో ఉద్యోగం చేసే వారికి, వైద్యపరమైన చికిత్సలు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలలో విదేశాలలో స్థిరపడిన తమ పిల్లలను చూడడానికి వెళ్లే తల్లిదండ్రులకు ఈ పాస్పోర్ట్ అనేది చాలా అవసరం.
మరి ఈ పాస్ పోర్ట్ కు అప్లై చేసుకోవడం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ అనే రెండు ప్రక్రియలు ఉన్నాయి.అయితే ఆఫ్లైన్ ప్రక్రియలో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఆన్లైన్ ప్రక్రియ గురించి చాలా మందికి అవగాహన లేదు. మరి ఆన్లైన్లో పాస్పోర్ట్ కోసం అప్లై చేయడం తెలుసుకుందామా!
విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రస్తుతం అన్నిరకాల పాస్పోర్ట్ దరఖాస్తులను ఆన్లైన్ చేసింది. అంటే ప్రస్తుతం మీ దగ్గర ఉన్న పాస్పోర్టును రెన్యువల్ చేయాలన్నా, కొత్తగా పాస్పోర్ట్ కోసం అప్లై చేయాలనుకున్నా మీరు తప్పనిసరిగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ద్వారానే వెళ్లాలి.
Table of Contents
(1) How to apply passport online
ఆన్లైన్లో అప్లై చేయాలి అనుకునే వారు కొన్ని స్టెప్స్ ను ఫాలో కావాలి. వీటి గురించి కింద పూర్తి వివరంగా తెలియజేశాం.
1. మొదటగా పాస్పోర్ట్ సేవా వెబ్సైట్లోకి లాగిన్ కావాలి.
2. Steps to Apply సెక్షన్ లో మీకు కావాల్సిన దాని మీద క్లిక్ చేయాలి.
3. మీరు ఇంతకు ముందే ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని ఉంటే మీ యొక్క యూసర్ ఐడి నెంబర్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
4. మీరు మొదటి సారిగా Apply చేస్తున్నవారైతే మీ వివరాలతో రిజిస్టర్ చేసుకుని తర్వాత New అకౌంట్ ఓపెన్ చేయాలి.
5. ఇందుకోసం New user tab లో register now ను క్లిక్ చేయాలి.
6. లాగ్ ఇన్ ఐడి నెంబరు మరియు పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి.
ఇప్పుడు ఏ type అప్లికేషన్ అనేది ఎంపిక చేసుకోవాలి.
(2) Select application type
# Ordinary Passport
# diplomatic passport/official passport
# Police Clearance Certificate (PCC)
# Identity Certificate
# Surrender Certificate
# Background Verification for GEP
# LoC Permit
(3) ఫిల్లింగ్ ది అప్లికేషన్ ఫామ్
అప్లికేషన్ను ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లో కూడా పూర్తి చేయవచ్చు.
ఆఫ్లైన్లో పూర్తిచేయుటకు,
1) అప్లికేషన్ ఫారమ్ ను సాఫ్ట్ కాపీ నుండి తీసుకోవడానికి “డౌన్లోడ్ అప్లికేషన్ “ను క్లిక్ చేయాలి.
2) మరికొన్ని ఫారాల కోసం “ఎలక్ట్రానిక్ కాపీ” ని క్లిక్ చేయాలి.
4) తర్వాత మనకు అవసరమైన అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేయాలి.
5) ఈ ఎలక్ట్రానిక్ అప్లికేషన్ ఫారం పూర్తి చేసిన తర్వాత “upload e-form” మీద క్లిక్ చేయాలి.
ఈ విధంగా అప్లికేషన్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఆన్లైన్లోనే అప్లోడ్ చేయవచ్చు.
*ఇక్కడ ఈ అప్లికేషన్ను కొద్దిభాగం పూరించి తర్వాత తేదీలలో మిగతా ప్రక్రియను పూర్తిచేసే అవకాశం కూడా ఉన్నది.
పూర్తిచేసిన అప్లికేషన్ ఫారం ను upload చేసే ముందు ఒకసారి verify చేయడం చాలా మంచిది.
(4) pay and book the appointment schedule
Passport application form online లో సబ్మిషన్ తర్వాత మీకు దగ్గరలో ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రం (PSK) లేదా దీనికి సంబంధించిన పాస్ పోర్ట్ అథారిటీ ఆఫీసులో అపాయింట్మెంట్ షెడ్యూల్ ప్రక్రియను చేయాలి.
ఈ ప్రక్రియను క్రింది విధంగా చేయాలి.
1. పాస్పోర్ట్ కోసం అప్లై చేసిన వ్యక్తి హోం పేజీలోకి వెళ్లి “save/submit application” మీద క్లిక్ చేయాలి.
మన అప్లికేషన్ ఫారం వివరాలు చూపించబడతాయి.
2. మన అప్లికేషన్ ఫారం యొక్క ARN ను సెలెక్ట్ చేయాలి.
3. Pay and schedule appointment మీద క్లిక్ చేయాలి.
4. చివరగా అమౌంట్ చెల్లించే విధానం సెలెక్ట్ చేయాలి, దీనికోసం ఆన్లైన్ పేమెంట్/చలాన్ పేమెంట్ లో ఒకటే ఎంపిక చేయాలి.
ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ అయితే వెంటనే చెల్లించవచ్చు. ఒకవేళ తత్కాల్ పద్ధతిలో చెల్లిస్తే ఆన్లైన్ ఫీజు కూడా సాధారణ పాస్పోర్ట్ ఫీజు తో సమానమే! దీని కోసం మిగిలిన ఫీజును అపాయింట్మెంట్ తేదీ రోజు PSK సెంటర్లో చెల్లించాలి.
చలాన్ పేమెంట్ అయితే SBI bank కు వెళ్లి పేమెంట్ చేయాలి. చలాన్ పేమెంట్ చెల్లించడానికి మూడు గంటల సమయం వేచి ఉండాల్సి ఉంటుంది, ఈ చలాన్ ఎనభై ఐదు రోజుల వరకు చెల్లుతుంది. బ్యాంకు నుండి చలాన్ కాఫీ తీసుకున్న తర్వాత అందులో ఉన్న ARN డీటెయిల్స్ కన్ఫామ్ చేయుటకు బ్యాంకు వారికి రెండు రోజులు టైం పడుతుంది.
తర్వాత ఈ ప్రక్రియ సక్సెస్ అయినట్లుగా వెబ్సైట్లో పోస్ట్ – వెరిఫికేషన్ లో చూపిస్తుంది. అంతేకాకుండా అప్లై చేసుకున్న వ్యక్తి payment status ను ట్రాక్ చేసే సదుపాయం కూడా ఉంది. మరియు ఈ సమాచారమంతా మన ఈ మెయిల్ ఐడి కి తెలియజేయబడుతుంది.
—————————————-
(5) Diplomatic passport/official passport
ఈ డిప్లమాటిక్ పాస్పోర్ట్ అనేది భారత ప్రభుత్వ అధికారిక విధుల్లో భాగంగా విదేశాలకు వెళ్లడానికి భారత ప్రభుత్వం నియమించిన వ్యక్తులకు ఇచ్చే పాస్ పోర్టు నే దౌత్య లేదా అధికారిక పాస్పోర్ట్ అని అంటారు. ఈ రకమైన పాస్పోర్టు వారికి ఒక చిరునామాగా మరియు గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. ఈ డిప్లమాటిక్ లేదా అఫీషియల్ పాస్పోర్ట్ కు కావలసిన అప్లికేషన్లు మామూలుగా
consular,
passport and visa division
Patiyala house,
New delhi లో మాత్రమే లభిస్తాయి.
ఈ పాస్ పోర్ట్ కు అప్లై చేసే వారు ఈ క్రింది విధంగా ఫాలో కావాలి.
1.పాస్పోర్ట్ సేవా కేంద్రం యొక్క అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
2. Register now అనే లింక్ మీద క్లిక్ చేయాలి.
3. ఇప్పుడు వారికి లాగిన్ ఐడి ఇవ్వబడుతుంది.
4. Apply to Diplomatic passport అనే లింక్ మీద క్లిక్ చేయాలి.
5. ఇప్పుడు అప్లికేషన్ను డౌన్లోడ్ చేసి నింపిన తర్వాత అవసరమైన ఐడెంటిటీ ప్రూఫ్ తో సహా సబ్మిట్ చేయాలి.
6. సబ్మిషన్ పూర్తి అయిన అప్లికేషన్ ఫారం లో ప్రింట్ తీసుకొని న్యూఢిల్లీలోని పాస్పోర్ట్ సేవా కేంద్రం ఆఫీసుకు అందజేయాల్సి ఉంటుంది.