తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం EPDS కొత్త రేషన్ కార్డులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డు సహాయంతో వారికి అవసరమైన ఆహారపు దినుసులు తక్కువ ఖర్చుతో లభిస్తాయి. ఇప్పుడు తెలంగాణ EPDS కు చెందిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రము ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల మాదిరిగా కాకుండా మూడు రకాలుగా రేషన్ కార్డులను విడుదల చేసింది.
అవి ::-
1.BPL RATION CARD : ఎవరైతే దారిద్ర రేఖకు దిగువన ఉన్నారో వారి కోసం మాత్రమే రూపొందించినది ఈ కార్డు. దీనినే తెల్ల రేషన్ కార్డు అని కూడా అంటారు.
ఈ రేషన్ కార్డు ఉన్నవారు కిరాణా సామగ్రిని రేషన్ షాప్ లో అతి తక్కువ ధరకే కొనవచ్చు.
2.APL RATION CARD : ఎవరైతే దారిద్ర రేఖకు ఎగువ స్థాయిలో ఉంటారో వారికి అందజేసే కార్డ్ ఇది.
ఈ కార్డు ఉన్నవారు బిపిఎల్ రేషన్ కార్డు ఉన్న వారి కంటే కొద్ది మాత్రం లబ్ధి పొందుతారు.
3.AAY RATION CARD : దారిద్ర రేఖకు దిగువన కాకుండా ఉన్నవారికి అందజేసే కార్డు ఇది. ఈ కార్డుదారులకు ఎరుపు లేత గులాబీ రంగులో ఉన్న కార్డులను ఇస్తారు.
Table of Contents
తెలంగాణ EPDS రేషన్ కార్డుల గురించి తెలుసుకోవడానికి (how to download ts ration card online )
1.తెలంగాణ అధికారిక వెబ్ సైట్ అయిన EPDS PORTAL అనే లింక్ మీద క్లిక్ చేయాలి.
2. తర్వాత FSC search ను క్లిక్ చేయాలి.
3. అప్పుడు FSC SEARCH FORM కనిపిస్తుంది, ఇందులో మీ FSC నెంబర్ లేదా రేషన్ కార్డు నెంబర్ లేదా ఓల్డ్ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
4. తర్వాత డిస్టిక్ ను సెలెక్ట్ చేయాలి.
5.ఇప్పుడు మీ రేషన్ కార్డు డీటెయిల్స్ చూపించబడతాయి.
6.ప్రింట్ బటన్ నొక్కగానే రేషన్ కార్డు డౌన్లోడ్ అవుతుంది.
Deepam application status in Telangana state
1. ఇందుకోసం అధికారిక వెబ్సైట్ EPDS PORTAL క్లిక్ చేయాలి.
2.తర్వాత దీపం సెర్చ్ పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
3. ఇప్పుడు మీ యొక్క FSC నెంబర్ను ఎంటర్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేస్తే దీపం అప్లికేషన్ యొక్క స్థితిని చూపిస్తుంది.
TS RATION CARD e-KYC status
1.ఇందుకోసం EPDS PORTAL ని క్లిక్ చేయాలి.
2. తర్వాత స్టేటస్ మీద క్లిక్ చేయాలి.
3.pulse survey మీద క్లిక్ చేయాలి.
4. తర్వాత పేజీ లో ఆధార్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేయాలి.
5. ఇప్పుడు మీ రేషన్ కార్డు యొక్క ఈ కేవైసీ స్టేటస్ ను చూపిస్తుంది.
TS RATION CARD లో మీ పేరు చెక్ చేసుకోవడం ఎలా ?
1. ఇందుకోసం EPDS PORTAL ను క్లిక్ చేయాలి.
2. మీయొక్క రేషన్ కార్డు నెంబర్ ను ఎంటర్ చేసి submit నొక్కాలి.
3. ఆ రేషన్ కార్డులో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లను చూపిస్తుంది.
FSC అంటే FOOD SECURITY CARD (ఆహారభద్రత కార్డు)