TS SSC MARKS MEMO DOWNLOAD చేయడం ఎలా ?

0

తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ మరియు SSC అకాడమీ పరీక్షల బోర్డ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో SSC బోర్డు పదవ తరగతికి చెందిన పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, SSC మార్కుల మెమోలు రూపొందించడం వంటి బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటుంది.

10th class mark list ఉపయోగాలు:

  • టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ విద్య అర్హతగా ఉపయోగపడుతుంది.
  • విద్యార్థి యొక్క పుట్టిన తేదీని నిరూపించడానికి ఇది ముఖ్యమైన సర్టిఫికెట్.
  • ఉన్నత చదువులు చదవాలి అంటే ప్రతి అప్లికేషన్కు కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ఇవ్వవలసి ఉంటుంది.
  • పై చదువులు చదవలేని వారు వివిధ ప్రభుత్వ శాఖలు ఇచ్చే రుణాల మంజూరు కోసం అంటే లోన్ల కోసం టెన్త్ క్లాస్ సర్టిఫికెట్ ను గ్యారెంటీగా ఉపయోగిస్తారు.

మరి ప్రతి విద్యార్థి జీవితంలో ఇంత ముఖ్యమైన టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పోగొట్టుకుంటే ఏం చేయాలి? అయితే ఏ విద్యార్థి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతి సులువుగా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో ను డౌన్లోడ్ చేసుకోవచ్చు!

how to download Telangana ssc marks memo 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డూప్లికేట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ ను 2016 విద్యాసంవత్సరం నుంచి డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది.అంటే 2016 లో పదవ తరగతి పాస్ అయిన వారి దగ్గరనుంచి ఇప్పటివరకు అని అర్థం.

  • ఇందుకోసం బోర్డ్ ఆఫ్ తెలంగాణ అధికారిక వెబ్సైట్ http://memos.bsetelangana.org/ ను క్లిక్ చేయండి.

  • తర్వాత విద్యార్థికి సంబంధించిన కొన్ని వివరాలను అడుగుతుంది.
  • విద్యార్థి పేరు, హాల్టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, పరీక్ష రాసిన సంవత్సరం మరియు విద్యార్థి రెగ్యులరా /ప్రైవేటా/ OSSC రెగ్యులర్/OSSC ప్రైవేట్ వంటి సమాచారాన్ని ఎంటర్ చేయాలి. అయితే ఈ వివరాలన్నీ తప్పులు లేకుండా సరిగ్గా అందజేయాలి.
  • తర్వాత స్క్రీన్ మీద టెస్ట్ బాక్స్ లో పేర్కొన్న CODE ఎంటర్ చేయాలి.
  • చివరగా SUBMIT పైన క్లిక్ చేయాలి.
  • అంతే TS SSC DUPLICATE MARKS LIST డౌన్లోడ్ అవుతుంది. విద్యార్థి భవిష్యత్తు అవసరాల కోసం కలర్ ప్రింట్ తీసుకొని భద్రపరచుకోవాలి.