తెల్ల రేషన్ కార్డ్ అనేది ప్రతి కుటుంబానికి గుండె లాంటిది ఎందుకంటే రేషన్ కార్డు లేకుండా ఏ కుటుంబము మనుగడ సాగించడం కష్టం. మొదటగా మనం రేషన్ కార్డు యొక్క ఉపయోగాలు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం వినియోగదారుల కోసం రెండు రకాల రేషన్ కార్డులను అందజేస్తుంది. అవి
1 . తెల్ల రేషన్ కార్డ్
2 . పింక్ రేషన్ కార్డ్
వీటిలో ముఖ్యంగా తెల్లరేషన్ కార్డు కలిగి ఉన్నవారు ప్రభుత్వ రేషన్ షాపుల నుండి బియ్యం, పప్పు ధాన్యాలు, మరియు చింతపండు, గోధుమ పిండి వంటి నిత్య అవసరాలను చాలా తక్కువ ధరకు పొందడానికి అర్హత కలిగి ఉంటారు. ఇంకా రేషన్ కార్డ్ అనేది ఒక కుటుంబానికి అంతటికీ గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది.
Table of Contents
new ration card status ap 2020
రేషన్ కార్డు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ గా కూడా చెల్లుబాటు అవుతుంది. అందుకే కొత్తగా పెళ్లైన జంట కూడా కొత్త తెల్ల రేషన్ కార్డు కు దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. ప్రతి కుటుంబానికి ఇంత ముఖ్య అవసరమైన తెల్లరేషన్ కార్డు ను పోగొట్టుకున్న వారు తెల్ల రేషన్ కార్డు పొందడం ఎలా?
లేదా కొత్తగా రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారు, వారి కార్డ్ పరిస్థితి తెలుసుకోవడం ఎలా?
మొబైల్ ద్వారా తెల్ల రేషన్ కార్డు వివరాలు తెలుసుకోవడం ఎలా?
తెల్ల రేషన్ కార్డు ను మొబైల్ లో డౌన్లోడ్ చేయడం ఎలా?
పై ప్రశ్నలన్నింటికీ సమాధానాలు క్రింద స్టెప్ బై స్టెప్ తెలియజేయడం జరిగింది.
how to download ration card ap
డూప్లికేట్ AP రేషన్ కార్డు డౌన్లోడ్ చేయడం : ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్సైట్ epdsap.ap.gov.in లింక్ ను మొదట క్లిక్ చేయాలి.
- ఇక్కడ తెలుపు మరియు పింక్ రేషన్కార్డులను చూపిస్తుంది.
- తెల్ల రేషన్ కార్డు ను ఎంపిక చేయాలి.
- తర్వాత Print ration card అనే పేజీని ఓపెన్ చేయాలి.
- ఇప్పుడు రేషన్ కార్డు నెంబర్ RCN వివరాలు ఎంటర్ చేయాలి.
- స్క్రీన్ మీద రేషన్ కార్డు చూపించబడుతుంది, వెంటనే ప్రింట్ మీద క్లిక్ చేయగానే ఏపీ AP రేషన్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
how to apply for new ration card in ap
- మొదట ప్రజా సాధికార సర్వే లో కుటుంబపు వివరాలన్నీ నమోదు చేయించుకోవాలి.
- తర్వాత ఎవరి పేరు మీద అయితే అప్లై చేశారో, ఆ లబ్ధిదారుడు అతని మొబైల్ నుండి 1100 helpline కు ఫోన్ చేసి మొదట వివరాలు చెప్పాలి.
- ఆన్లైన్ డేటాబేస్ ప్రక్రియతో అప్లై చేసుకున్న వ్యక్తి ఆధార్ నెంబర్ ను కన్ఫామ్ చేసుకుంటారు.
- ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని దరఖాస్తుదారుని వివరాలు జాతీయ సమాచార కేంద్రానికి (NIC) పంపుతారు.
- NIC పూర్తి వివరాలను జిల్లా పౌర సరఫరా విభాగానికి పంపుతారు.
- రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వ్యక్తి ఆ కార్డును అందుకునే లోపు అతని మొబైల్ కి ఆ రేషన్ కార్డు నెంబరు మెసేజ్ రూపంలో చేర్చబడుతుంది.
how to check new ration card status in ap
కొత్త ఏపీ రేషన్ కార్డ్ పరిస్థితి తెలుసుకోవడం : ఆంధ్రప్రదేశ్ అధికారిక వెబ్సైట్ epdsap.ap.gov.in లింక్ ను క్లిక్ చేయాలి.
- స్క్రీన్ మీద MIS అని ఆప్షన్ ఉంటుంది.
- ఇందులో రేషన్ కార్డు / రైస్ కార్డు సెర్చ్ అని ఉంటుంది. అప్పుడు “అప్లికేషన్ నెంబర్ను” ఎంటర్ చేసి సెర్చ్ బటన్ మీద క్లిక్ చేయాలి.
- మన రేషన్ కార్డు పైన జరిగిన ప్రతి transaction తెలుస్తుంది.
- అలాగే మన ఫ్యామిలీ పూర్తి వివరాలను చూపిస్తుంది.
Good