AP SSC / 10 వ తరగతి మార్కుల మెమో SSC నకిలీ మార్క్ జాబితాను డౌన్‌లోడ్ చేయండి. ఇందుకోసం ఈ వెబ్ సైట్లోకి వెళ్లండి @ bseap.org. AP SSC / 10 వ తరగతి మార్కుల మెమో డౌన్‌లోడ్ వివరాలు క్రింద అందుబాటులో ఉన్నాయి:
Table of Contents
SSC marks memo download AP 2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SSC డూప్లికేట్ మార్క్స్ మెమోను BSEAP వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టేట్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ పరీక్ష తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ మెమోను జారీ చేస్తుంది. దురదృష్టవశాత్తు వారి అసలు సర్టిఫికేట్ కోల్పోయిన, ఒకవేళ పోగొట్టుకున్న మరియు అభ్యర్థి సర్టిఫికేట్ దెబ్బతిన్న ఏ అభ్యర్థి అయినా BSEAP (ఆంధ్రప్రదేశ్‌లోని బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) అధికారిక వెబ్‌సైట్ నుండి డూప్లికేట్ మార్క్స్ మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్ bseap.org నుండి లేదా ఈ పేజీలో క్రింద ఇవ్వబడిన ప్రత్యక్ష లింక్‌ల నుండి విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా SSC మార్కుల మెమోను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ (AP ssc marks memo 2021) గురించి తెలుసుకుందాం
పదవ తరగతి మార్కుల లిస్టులో పరీక్ష సమయంలో మనం పొందిన మార్కులు, పేరు, పుట్టినతేదీ వంటి వ్యక్తిగత వివరాలు ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యక్తికి తను చదివిన ssc marks card memo చాలా ముఖ్యమైనది.
టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉపయోగాలు 2021
ఇది ప్రతి విద్యార్థి జీవితంలో తనకు లభించే మొట్టమొదటి సర్టిఫికేట్. ముఖ్యంగా టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో రాండం అనేది ఏవైనా ప్రభుత్వానికి సంబంధించిన దరఖాస్తులకు ఇది ప్రాథమిక ధ్రువీకరణ పత్రం గా ఉపయోగపడుతుంది.
SSC Marks Memo 2021 హైస్కూల్ విద్య పూర్తి చేసినట్లుగా ఇది రుజువుగా పనిచేస్తుంది. అంతే కాకుండా విద్యార్థి పై చదువులు చదవడానికి ఇది చాలా అవసరం. ఈ ఎస్ ఎస్ సి సర్టిఫికెట్ మనకు అవసరమైన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్ పోర్ట్ మరియు ఇతర ప్రభుత్వ సేవల దరఖాస్తులకు పుట్టిన తేదీకి ఈ సర్టిఫికెట్ ప్రాథమిక రుజువుగా పనిచేస్తుంది.
ఈ సర్టిఫికెట్ ప్రాథమిక మరియు చాలా ముఖ్యమైన ప్రమాణపత్రం. మీరు AP SSC మార్కుల మెమోని ఆన్ లైన్ లో పొందవచ్చు. టెన్త్ క్లాస్ మార్క్స్ కార్డ్ పోగొట్టుకొనిపోతే అది చదువుకునే విద్యార్థులకు చాలా సమస్యలను సృష్టిస్తుంది. గతంలో తాము చదివిన చదువుల యొక్క మెమోలు లేకపోతే విద్యార్థులు తమ చదువులను కొనసాగించలేరు. అందుకే ఎస్ఎస్సి మార్క్ మెమోలు పోతే చాలా సమస్యలు మొదలవుతాయి.
టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ పోగొట్టుకునిపోతే ఏంచేయాలి ?
మార్క్ లిస్ట్ పోగొట్టుకున్న వ్యక్తి మొదట పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి. తర్వాత పోగొట్టుకున్న పత్రాలకు సంబంధించిన కేసు పెట్టాలి.నకిలీ ధ్రువీకరణ పత్రాల కోసం అప్లికేషన్ పెట్టుకునే సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కాపీని కూడా తీసుకోవాలి.మార్కుల పత్రం పోగొట్టుకున్న వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆన్లైన్లో దీన్ని సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
how to download duplicate ssc marks memo 2021 ?
డూప్లికేట్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ డౌన్లోడ్ చేయండి ఇలా..! AP 10TH CLASS MARK LIST డౌన్లోడ్ చేయడానికి క్రింద పేర్కొన్న విధానాలను అనుసరించాలి. ఈ ప్రాసెస్ అంతా స్క్రీన్ షాట్లతో క్రింద తెలపడమైనది.
స్టెప్ వన్: మొదటగా విద్యార్థి BSEAP సైట్ అంటే www.bseap.org యొక్క అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి.
స్టెప్ 2: హోమ్ పేజీ లోకి వెళ్ళిన తర్వాత హోం పేజీలో పైభాగాన “SSC Pass Student data year wise” అనేదాన్ని ఎంపికచేసి సెర్చ్ చేయాలి.
స్టెప్ 3: తర్వాత కొత్త పేజీ తెరుచుకుంటుంది. ఈ పేజీలో విద్యార్థి కి సంబంధించిన నిలువు వరుసల్లో మీ డేటాను నింపండి మరియు captcha కోడ్ ను ఎంటర్ చేసి సమర్పించండి. అంటే submit నొక్కండి.
స్టెప్4: తర్వాత మరొక పేజీలో హాల్టికెట్ నెంబర్ మరియు పుట్టిన తేదీ మొదలైనవాటిని చూపిస్తుంది. వాటిని సరిగ్గా submit అనే బటన్ మీద క్లిక్ చేయండి.
Step 5: ఇప్పుడు మీ పూర్తి వివరాలతో మీ టెన్త్ క్లాస్ డూప్లికేట్ మార్క్స్ మెమో మీ స్క్రీన్ పైన ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.
స్టెప్ 6: వెంటనే SSC marks memo download AP 2021 ను ప్రింట్ అవుట్ తీసుకోండి.
పై విధమైన దశలవారీగా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్లి అతి సులువుగా పోగొట్టుకున్న టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో ను పొందవచ్చు.