how to check jagananna vasathi deevena payment status
24 జనవరి 2020 న విజయనగరంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం జగన్ అన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా పదవతరగతి దాటిన ప్రతి విద్యార్థికి వారి హాస్టల్ ఖర్చులకు సరిపడా డబ్బులు అందజేయనున్నారు. ఐటిఐ చదివే విద్యార్థులకు పదివేల రూపాయలు, డిప్లమా చదివే విద్యార్థులకు 15 వేల రూపాయలు అలాగే డిగ్రీ ఆ పైన చదివిన విద్యార్థులకు 20వేల రూపాయలు ప్రతి సంవత్సరం అందించనున్నారు.
ఈ మొత్తాన్ని రెండు విడతలుగా తల్లుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. మొదటి విడతగా ఫిబ్రవరి నెలలో సగం డబ్బులు జమ చేస్తారు అలాగే రెండవ విడతగా మిగతా సగం డబ్బులు జూలై – ఆగస్టు నెలల్లో బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతోంది. మరి ఈ సంవత్సరం ఫిబ్రవరి 24న డబ్బులు ఇవ్వడం జరిగింది.
ఎవరెవరికి ఈ అమౌంట్ పడిందో లేదో మెసేజ్ రూపంలో వివరాలను వారి ఫోన్ నెంబర్లకు అందించారు. మరి మీకు ఎంత అమౌంట్ పడిందో మీకు వచ్చిన ఒక చిన్న మెసేజ్ ద్వారా ఆన్లైన్లో మీరే చెక్ చేసుకోవచ్చు. అది ఏలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీకు వచ్చిన మెసేజ్ లో ట్రెజరీ అకౌంట్ బిల్ నెంబర్ ఉంటుంది, దాన్ని గుర్తు పెట్టుకోండి.
- ఫస్ట్ CFMS వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
- అక్కడ Expenditure Links అని ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి
- అందులో మొదటగా ఉన్న Bill Status పై క్లిక్ ఇవ్వండి
- ఇప్పుడు మీకు వేరే విండోలో మీ బిల్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఆప్షన్ కనబడుతుంది
- ఇక్కడ సంవత్సరం తర్వాత మీకు వచ్చిన బిల్ నెంబర్ ను ఎంటర్ చేయండి
- వెంటనే మీ బిల్లుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియ చేయబడతాయి. అంటే మీ అకౌంట్ ఏంటి, మీకు ఎంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు వచ్చింది ఇవన్నీ పూర్తిగా ఉంటాయి.
ఈ విధంగా జగన్ అన్న వసతి దీవెన పథకం సంబంధించి మీకు అమౌంట్ వచ్చిందో లేదో ఆన్ లైన్లో ఈజీగా మీ మొబైల్ లోనే చెక్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మెసేజ్ కానీ లేదా అమౌంట్ గాని రాకపోతే వెంటనే వారిని కలిసి ఈ ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అప్డేట్ చూపించండి. వచ్చే జులై లేదా ఆగస్టులో మీ పూర్తి అమౌంటు మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిఫెండర్ కామెంట్ చేసిన లో తెలియజేయండి.