ఆదార్ నెంబర్ తో పాన్ కార్డ్ ని ఒక్క రోజులోనే పొందడం ఎలా ?

0

how to apply pan card online with aadhar telugu 2020

PAN CARD అనగా PERMANENT ACCOUNT NUMBER (శాశ్వత ఖాతా సంఖ్య), ప్రతి ఆదాయ పన్ను చెల్లింపుదారునికి ఆదాయపు పన్ను (IT) విభాగం అందిస్తుంది. పాన్ కార్డ్ తప్పనిసరి ఉండాలి మరియు చాలా (Money transactions) ఆర్థిక లావాదేవీలు చేయడానికి ఇది అవసరం. మీ Bank account ను పాన్‌తో లింక్ చేయడం Income tax department విభాగం తప్పనిసరి చేసింది.

దీనికి ప్రధాన కారణం ఏమిటంటే, మీ Income tax return లను నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ కు జమ చేస్తుంది. మీ యొక్క Bank account , పాన్ ఖాతాpan account కు లింక్ కాకపోతే, మీరు తిరిగి వాపసు పొందలేరు. Savings, Current account, Cheque, Cash లేదా over draft – ఏ రకమైన account ను అయినా మీరు Pan account కు లింక్ చేయవచ్చు.

మరి ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ Pan Card ని ఇంట్లో ఉండే ఎలా అప్లై చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ఇంతకుముందు ఉన్న పెద్ద ప్రాసెస్ కాకుండా చాలా ఈజీ గ మన మొబైల్ లోనే పొందవచ్చు. దీనికి కేవలం మన AAdhaar నెంబర్ ఉంటె చాలు పాన్ కార్డు 5నిమిషాల్లో వచ్చేస్తుంది. మీరు వెంటనే వెళ్లి కలర్ ప్రింట్ తీసుకోవచ్చు.

అదెలాగంటే,

 1. ముందుగ మీరు e-filling వెబ్సైటు లోకి వెళ్ళాల్సి ఉంటుంది.
 2. అందులో Instant PAN through Aadhaar లింక్ పైన క్లిక్ చేయండి.
 3. నెక్స్ట్ వచ్చిన పేజి లో Get New Pan పై క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ కొత్త పాన్ కార్డు అప్లై చేసి ఉంటె Check Status/Download PAN పై క్లిక్ చేయడి. 
 4. ఇక్కడ మీ ఆధార కార్డు నెంబర్ తో పాటు కింద ఇచ్చిన captha code ని పూర్తి Generate Aadhaar OTP పై క్లిక్ చేయండి.
 5. మీ ఆదార్ కార్డు తో లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ కి OTP వస్తుంది. దాన్ని అలాగే ఎంటర్ చేసి, Validate Aadhaar OTP and Continue మిద క్లిక్ చేయండి.
 6. వచ్చిన పేజి లో మీ ఆదార్ కార్డు డీటెయిల్స్ వస్తాయి, అవి సరిగా ఉన్నవో లేవో చెక్ చేసుకొని I Accept that ని చెక్ చేసి Submit PAN Request ని క్లిక్ చేయండి.
 7. తరువాత మీ ఫోన్ నెంబర్ కు ఒక మెసేజ్ వస్తుంది, అది కూడా ఒక 10 నిమిషాల్లో PAN Card నెంబర్వ తో సహా వస్తుంది. అంతవరకు వేచి ఉండండి.
 8. ఇక తరువాత మల్లి e-filling వెబ్సైటు లోకి వెళ్ళాల్సి ఉంటుంది.
 9. అందులో Instant PAN through Aadhaar లింక్ పైన క్లిక్ చేయండి.
 10. ఇప్పుడు ఇక్కడ Check Status/ Download PAN పై క్లిక్ చేయండి.
 11. ఇక్కడ కూడా మీ ఆదార్ నంబర్ ఎంటర్ చేసి, OTP ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
 12. నెక్స్ట్ PAN allotted successful అని వస్తే మే పాన్ కార్డు రెడీ అయినట్టు. వెంటనే Download PAN పై క్లిక్ చేయండి.
 13. మీ పాన్ కార్డు pdf ఫార్మాట్ లో వస్తుంది.కానీ పాస్వర్డ్ అడుగుతుంది. మీరు మీ ఆదార్ కార్డ్ లో ఉన్న తేది ని ఎంటర్ చేసి PAN Card ని చూడవచ్చు.
 14. ఇక దగ్గరలో ఉన్న కంప్యూటర్ సెంటర్ కి వెళ్లి కలర్ ప్రింట్ తీసుకోండి, మీ ఒరిజినల్ PAN రెడీ.

సో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటె కింద కామెంట్ చేయండి, తప్పకుండ రిప్లై ఇస్తాను. థాంక్స్ ఫర్ visiting.