illa pattalu status in andhra pradesh
ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల పంపిణీ ఏదో ఒక కారణంగా ప్రతిసారి వాయిదా పడుతున్న విషయం అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు ఇలాంటి మరొక అంశం తెరపైకి వస్తోంది. మన రాష్ట్ర ప్రభుత్వం లో ఏపీ టిడ్కో ఆధ్వర్యంలో లో నిర్మించిన పక్కా ఇళ్లను ఈనెల 20వ తేదీన ఆక్రమించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆ పార్టీ కార్యదర్శులకు పిలుపునిచ్చారు.
తన పార్టీ కార్య వర్గ శ్రేణులతో జూమ్ అప్ లో మీటింగ్ పెట్టి మరీ ఈ ఆక్రమణకు తెరలేపారు. ఈ విషయాన్నీ ఆయన పత్రిక ముఖంగా నిన్న ఇళ్ళను ఖచ్చితంగా ఆక్రమిస్తామని చెప్పారు. అర్హులైన పేదలచే ఈ కార్యక్రమం ఉంటుందని వివరించారు. ఈ మీటింగ్ లో సిపిఐ జాతీయ కార్యదర్శి డా.కే. నారాయణ తదితరులు పాలు పంచుకున్నారు.
అమరావతి లో జరుగుతున్న ఆమరణ దీక్ష 300వ రోజుకు చేరిన సందర్భంగా ఈనెల 12 న రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇళ్ళ ని వాటి లబ్దిదారులతో కలిసి ఆక్రమణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
READ :- Ap illa sthalalu list 2020 లో పేరు వచ్చిందా ? ఇక్కడ చెక్ చేయండి.