తల్లి కి మించిన దైవం ఏది లేదు అని అంటారు కదా, అయ్యితే ఇక్కడ కూడా తండ్రికి కి మించిన దైవం లేదు అని నిరుపించుకొన్నారు ఒక వ్యక్తి. ప్రపంచంలో తల్లి చుసుకోనేంత ప్రేమగా మరెవరు చూసుకోరు అoటారు కదా, కానీ ఒక గ్రామంలో ఒక తండ్రి తన కొడుకు కోసం ఇంటింటికి వెళ్లి భిక్షo ఎత్తుకొన్నారు ఆ సంగతి ఏంటో చూదం.
బిహార్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుండెలు పిండేసే ఘటన చోటుచేసుకుంది. మార్చూరీలో మృతదేహాన్ని ఇచ్చేందుకు ఆస్పత్రి సిబ్బంది భారీ లంచం డిమాండ్ చేసింది. అంత డబ్బు ఇచ్చుకోలేని తల్లిదండ్రులు భిక్షాటన చేశారు.
సమస్తిపూర్ తాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన మహేష్ ఠాగూర్ దంపతులకు సంజీవ్ అనే కుమారుడు ఉన్నాడు. మానసిక వికలాంగుడైన సంజీవ్ అదృశ్యమయ్యాడు.
అయితే జూన్ 6న కొడుకు మృతదేహం సమస్తిపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. దీంతో కొడుకు మృతదేహాన్ని చూసేందుకు ఆస్పత్రికి వెళ్లారు, మృతదేహం తమ కొడుకుదే అని నిర్ధారించుకొని ఇంటికి తీసుకెళ్లేందుకు అధికారులను సంప్రదించారు. అయితే పోస్టుమార్టం సిబ్బంది నాగేంద్ర మల్లిక్ అనే వ్యక్తి మృతదేహాన్ని అప్పగించడానికి రూ. 50 వేలు డిమాండ్ చేశారు.
అంత డబ్బులు వృద్ద జంట వద్ద లేకపోవడంతో బిక్షాటన ఎత్తుకోవటం ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ జోలెపట్టి అడుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు, ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సమస్తిపూర్ సదార్ హాస్పిటల్ ఉన్నతాధికారులకు ఈ విషయం చేరింది.
దీంతో తక్షణమే యువకుడి డెడ్‌బాడీని అతని ఇంటికి పంపించేశారు. ఈ వీడియోను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా ట్విటర్‌లో షేర్ చేశారు. మానవత్వానికి సిగ్గుచేటు నితీష్ కుమార్ ప్రభుత్వ పాలను ఇది నిదర్శనమంటూ మండిపడ్డారు.