ఈ హెయిర్ ప్యాక్ మీరు గాని వేసుకొంటే జన్మలో కూడా ఉండమన్న కూడా ఉడదు మీ జుట్టు !

0
Proteins Hair Pack At Home

Proteins Hair Pack At Home :జుట్టు బ‌లంగా దృఢంగా ఉండాలంటే ప్రోటీన్ ఎంతో అవ‌స‌రం. జుట్టు ఊడ‌టం, ప‌ల్చ‌బ‌డ‌టం, చిట్ల‌డం వంటి స‌మ‌స్య‌ల‌కు ప్రోటీన్ కొర‌త కూడా ఒక కార‌ణం గా చెప్పుకోవచ్చు.

అందుకే రోజు వారిగా ప్రోటీన్లు పుష్క‌లంగా ఉండే ఫుడ్‌ను తీసుకుంటూ ఉండాలి. అలాగే వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు ఇప్పుడు చెప్పబోయే ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్‌ను ట్రై చేస్తూ ఉండాలి.

ఈ ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్ ను వేసుకోవ‌డం వ‌ల్ల జుట్టు కుదుళ్లు బ‌లోపేతం అవుతాయి. దాంతో జుట్టు ఊడ‌టం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ ప్రోటీన్ హెయిర్ ప్యాక్స్ ఏంటో వాటిని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకొందం.

తయారుచేసుకొనే విధానం :-

ముందుగా రెండు అవకడో పండుల్ల ను తీసుకొని లోపల ఉండే గుజ్జును స‌ప‌రేట్ చేసి మెత్త‌గా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అవ‌కాడో పేస్ట్‌లో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల కొబ్బ‌రి పాలు, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.

ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి, గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి. వారంలో ఒక్క‌సారిప్రోటీన్ ప్యాక్‌ను ట్రై చేస్తే జుట్టు ఊడ‌మ‌న్నా ఊడ‌దు.

అలాగే బౌల్‌లో ఒక ఫుల్ ఎగ్‌ను వేసుకుని విస్క‌ర్ సాయంతో బాగా క‌లుపుకోవాలి. ఆ త‌ర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, వ‌న్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఆపై ఈ మిశ్ర‌మాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేసి గంట అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి. ఈ ప్రోటీన్ ప్యాక్ కూడా హెయిర్ ఫాల్‌కు అడ్డుక‌ట్ట వేసి. జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరిగేందుకు స‌హాయ‌ప‌డుతుంది. ఈ విధంగా మీరు మీ జుట్టుకు ప్రోటిన్స్ ఉండేలాగా చేసుకోవచ్చు. ఈ ప్యాక్ చాల బాగా మీ జుట్టుకు పని చేస్తుంది.