పులిచింతల ప్రాజెక్టుకు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇ విగ్రహం ఏర్పాటు.

0

ప్రాజెక్టుకు  దివంగత మహానేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్నిఏర్పాటు చేయాలని ప్రభుత్వం పరిశీలిస్తోంది.ఏపీ ముఖ్యమంత్రి జగన్ విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన అంశాల పర్యవేక్షణ బాధ్యత లను మంత్రులు అనిల్ కుపులిచింతల మార్ యాదవ్ తో  పాటుగా నాని కి అప్పగించారు. ఈ విషయంపై అనిల్ కుమార్ యాదవ్ గారూ నాని గారు పులిచింతల వద్ద పరిసర ప్రాంతాలను పరిశీలించారు.ప్రాజెక్టును నిర్మించిన తర్వాత పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం తో మంత్రులు అక్కడ పులిచింతల జల హారతి నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగానే మంత్రులు  కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరలను, సమర్పించారు.రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పులిచింతల ప్రాజెక్టు వద్ద దివంగత  మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు .మంత్రి వర్యులు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ హయాంలో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. 

ఆ మహానేత కుమారుడైన జగన్ హయాములో ఈ ప్రాజెక్టు తొలిసారిగా నిండు కుండలా మారుతుందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వద్ద 45 అడుగుల వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వైయస్సార్ విగ్రహం తో పాటు డాక్టర్ కె.ఎల్.రావు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 

రోడ్లు భవనాల తోపాటు , నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాలను,కలుపుతూ వంతెన నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు.వచ్చే జూలై 8 నాటికి వైయస్సార్ జన్మదినం సందర్భంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని,ప్రభుత్వం భావిస్తోంది.వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకుప్రాజెక్టు వద్ద స్థలాన్ని పరిశీలించినటు మంత్రి వెల్లడించారు.మరో ఇరవై ఏళ్ల పాటు  ఆంధ్రప్రదేశ్ లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ ప్రాజెక్టు విషయంపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేస్తున్నారు.