విశాఖపట్టణం; విశాఖ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ నిర్ధేశించిన 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా తడబడుతోంది.ఆదివారం చివరి రోజు దక్షిణాఫ్రికా59 పరుగులకే కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.ఇప్పటికే 8 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున ఉంది.చివరి రోజు లంచ్ సమయానికి దక్షిణాఫ్రికా 8 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది.
ఆదివారం 11/1 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను కొనసాగించిన సఫారీ జట్టు రెండవ ఓవర్లోనే డిబ్రుయీనీ [10] మన స్పిన్నర్ ఆర్ అశ్విన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లోనే మొహమ్మద్ షమీ,,తెoబ బువుమా [o]ను పెవిలియన్ చేర్చాడు. మరింత రెచ్చిపోయిన మహమ్మద్ షమీ, 40 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు తీసి సఫారీ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. డు ప్లేసెస్[ 13], డి కాక్[0] లను కూడా పెవిలియన్ చేర్చాడు.
మహమ్మద్ షమీ కి రవీంద్ర జడేజా తోడవడంతో, సఫారీ జట్టు కోలుకోలేక పోయింది. 10 పరుగుల వ్యవధిలో ఓపెనర్ మార్కారామ్ [39], ఫిలిండర్[0] మహారాజ్[0],లను జడేజా బోల్తా కొట్టించాడు.అయితే సేనురాను ముత్తు సామి,డేనీ పిడ్డి,ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఇరువురు ధాటిగా ఆడుతూ 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.ఈ జోడీని విడగొట్టేందుకు భారత బౌలర్లు కష్టపడుతున్నారు.
టీమిండియా విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉంది. ఇంకా సఫారీ జట్టు 278 పరుగులు వెనుకబడి ఉండటంతో భారత్ విజయం సాధించడం లాంఛనమే.ఇంతకుముందు సఫారీ జట్టు టీమిండియాకు నిర్దేశించిన భారీ లక్ష్యం 395 పరుగులు,ఈ భారీ లక్ష్యాన్ని టీమిండియా అలవోకగా చేధించింది.రోహిత్ శర్మ[ 127; 149 బంతుల్లో 10 ఫోర్లు, 7 సిక్సర్లు] సెంచరీలతో చెలరేగగా, చటేశ్వర్ పుజారా[ 81;148బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు] హాఫ్ సెంచరీతో రాణించాడు .