ప్రపంచం మొత్తం కరోన వైరస్ తో బాధపడుతుంటే ఒక్కసారిగా నరాలు జివ్వుమనేలా మన SS Rajamouli గారు తన క్రేజీ ప్రాజెక్ట్ RRR కి సంబంధించిన మోషన్ పోస్టర్ ని ఈరోజు రిలీజ్ చేసారు. ఇంతకు ముందు ఎక్కడో విన్న విధంగానే పేరు ఉన్నప్పటికీ మోషన్ పోస్టర్ లో మన మాస్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ అదరగొట్టేసారు. ఒక్కసారి చుస్తే సరిపోదు అనేవిదంగే ఉంది ఈ పోస్టర్.
యూట్యుబ్ లో వచ్చిన గంటకే దాదాపు రెండు లక్షల లైక్స్ ని సొంతం చేసుకుందీ వీడియో. 1.15 నిమిషాల పాటు వచ్చే ఈ వీడియో లో మొదట రామ్ చరణ్ నిప్పు ని ప్రతిబింబిస్తూ పరిగెత్తడం చూస్తుంటే నా సామిరంగా ఫాన్స్ కి పూనాకలే. ఇక నీటిని ప్రతిబింబిస్తూ ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ వస్తుంటే అలాగే నరాలు నిక్కబొడుచుకుంటాయి. వీరిద్దరూ అలా వచ్చి చేతులు కలిపే లాగా ఉంటుంది ఈ వీడియో పోస్టర్. ఇక మధ్యలో 1920 లో జరిగే స్టొరీ ఇది అని క్లియర్ గ చెప్పారు రాజమౌళి గారు.
మొత్తానికి RRR అంటే రౌద్రం రణం రుధిరం అని పేరు పెట్టేసారు. పేరు కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ అందులో ఉన్న ఇంటేన్సిటి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇటు మెగా ఫ్యామిలీ ఫాన్స్ అలాగే ఎన్టీఆర్ ఫాన్స్ కి ఈ మోషన్ పోస్టర్ వీడియో ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.