పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు ని కాకరకాయతో ఇలా కరిగించండి

0
bitter gourd benefits in telugu
bitter gourd benefits in telugu

Bitter gourd benefits in telugu : కాకరకాయ చూడటానికి మాత్రమే వికారంగా కనిపిస్తుంది కానీ శరీరంలోని అనేక వికారాలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. సాధారణంగా కాకరకాయ చేదు గా ఉండడం వల్ల చాలామంది దీన్ని ఇష్టపడరు.

ఆరోగ్యకరంగా ఉండాలంటే కాకరకాయ ని ఎవరెవరు తినాలి? ఎలాంటి జబ్బులు తగ్గించుకోవచ్చు? ఇందులో ఉండే ఔషధ గుణాలు ఎన్ని? చేదు లేకుండా దీన్ని ఏవిధంగా వండుకుని తినవచ్చు?…. వంటి ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ ఆర్టికల్ లో మీకు లభిస్తాయి.

కాకరకాయ లో ఉండే పోషకాలు:

100 గ్రాముల కాకరకాయలో 90% నీటి శాతం ఉంటుంది 9 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మాంసకృత్తులు 1.4 గ్రామ్స్ ఉంటాయి కొవ్వు పదార్థాలు ఉండవు. ఇందులో ముఖ్యంగా పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి మరియు గర్భవతులకు ఎంతో ముఖ్యమైన ఫోలిక్యాసిడ్ ఇందులో లభిస్తుంది.

అన్నింటికంటే ప్రధానంగా కాకరకాయలు ఎక్కువశాతం నీటి పదార్థం కలిగి ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వాళ్ళు, షుగర్ తగ్గాలనుకునే వాళ్ళు కాకరకాయ ను క్రమం తప్పకుండా వాడటం అలవాటు చేసుకోవాలి.

షుగర్ కు కాకరకాయ కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?

కాకరకాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ రక్తంలో ఉండే చక్కెర ను శక్తి గా మార్చడానికి తోడ్పడుతున్నాయి. అందుకే షుగర్ వ్యాధిగ్రస్తులు ఒంట్లో ఉన్న చక్కెరను తగ్గించుకోవడానికి కాకరకాయలు వాడుతారు.

కాకరకాయలు ఆహారంలో తీసుకునేటప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథిలో ఉండే బీటా కణాలు ప్రేరణకు గురి కాబడి తగినంత ఇన్సులిన్ను అందిస్తాయి. ఈ విధంగా శరీరంలో షుగర్ పెరగకుండా కాకరకాయ సపోర్ట్ చేస్తుందని శాస్త్రీయంగా నిరూపించబడింది.

కాకరకాయ మీద పరిశోధన

2018 సంవత్సరంలో మెక్సికో దేశంలో 40 మందిని షుగర్ వ్యాధి గ్రస్తులను పరీక్షించి దీనిని నిరూపణ చేయడం జరిగింది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం రెండు గ్రాముల కాకరకాయ పొడి వీరికి అందజేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల వీరి శరీరంలో డయాబెటిస్ త్వరగా కంట్రోల్ లోకి రావడం శాస్త్రవేత్తలు గమనించారు.

వీరికి షుగర్ టెస్ట్ లో కూడా భారీగా మార్పులు రావడం శాస్త్రవేత్తలు కనిపెట్టడం జరిగింది.
కాబట్టి చాలామంది కాకరకాయ ను నేరుగా తినడానికి ఇష్టపడక పోతారు కాబట్టి పొడి రూపంలో తీసుకోవడం చాలా ఉత్తమమైన పని.

కాకరకాయను షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు మాత్రమే తినాలా??

కాకరకాయను ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల, కాకరకాయ లో ఉండే ఫ్లేవనాయిడ్స్ మరియు ఫైటోకెమికల్స్ వల్ల క్యాన్సర్ గడ్డల మీద ప్రభావం చూపుతుందని తైవాన్ యూనివర్సిటీలో పరిశోధన చేయడం జరిగింది. క్యాన్సర్ కణాలు నాశనం చేయడానికి కాకరకాయ లో ఉండే ఫైటోకెమికల్స్ పనిచేస్తాయని తైవాన్ శాస్త్రవేత్తలు తెలియజేశారు.

2012 సంవత్సరంలో తైవాన్లోని శాస్త్రవేత్తలు ముఖ్యంగా పురుషుల పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కణాలను మరియు కొవ్వు పదార్థాన్ని తగ్గించడానికి కాకరకాయ సమర్థవంతంగా పని చేస్తుందని శాస్త్రీయంగా రుజువు చేయడం జరిగింది. స్థూలకాయంతో బాధపడుతున్న కొంతమందిని వీళ్ళు ఎంపిక చేసి వారికి ప్రతిరోజూ ఉదయం మరియు సాయంత్రం 8 గ్రాముల కాకరకాయ పొడి ని ఆహారంలో భాగంగా అందించి, తర్వాత పరీక్ష చేయడం జరిగింది.

దీని ఫలితంగా వారి పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు భాగం బాగా కరిగి పోయినట్లుగా గుర్తించారు. ఈ విధంగా కాకరకాయను ప్రస్తుత రోజుల్లో అనేక రకాలుగా ఉపయోగించి ఎంతో మంది తమ శరీర బాధల్ని పోగొట్టుకుంటున్నారు.

ఇది కూడా చదవండి :-  నల్లగా మారిన మీ చేతులను ఈ చిట్కాతో మెరిసేట్లు చేయండి