Best 40 Good Night Messages In Telugu
మనం ప్రతి రోజు వాట్సాప్ లో రాత్రి పడుకునే ముందు ఎవరో ఒకరు మనకు గుడ్ నైట్ చెప్పు ఉంటారు. మన ఫ్రెండ్స్ మనతో వారి ప్రతి నైట్ మనతో ఒక మంచి మెసేజ్ ద్వారా షేర్ చేసుకుంటారు. మరి మనమెందుకు వారితో గుడ్ నైట్ ని షేర్ చేస్కోకూడదు ?
అందుకే ఇక్కడ బెస్ట్ 30 గుడ్ నైట్ తెలుగు మెసేజెస్ ఇస్తున్నాము. అందులో మీకు నచ్చిన మెసేజ్ ని లేదా ఫోటో ని మీ ఫ్రెండ్స్ తో తప్పకుండా పంచుకోండి. ఇలాంటి మరిన్ని మెసేజెస్ కోసం మా తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్ సైట్ ని రోజు చూస్తూ ఉండండి.
1◆ కన్నులకు విశ్రాంతిని ఇస్తూ
స్వప్నలోకాలకు స్వాగతం పలుకుతూ
మనసుకు లాలిపాట పాడుతూ
హాయిగా నిద్దురపో నేస్తం!!
2◆ కన్నుల కలువలను నిద్రపుచ్చడానికి
వెన్నెల వింజామరతో విసురుతున్నా
కమ్మని కలల కౌగిలిలో ఒదిగిపో నేస్తం!!
3◆ అప్పుడెప్పుడో నువ్వొదిలేసిన కల
ఈరోజు నీకోసం ఎదురుచూస్తోందట
ఇక పనులన్నీ ఆపి నిద్రపో నేస్తం
4◆ కాలం నీడలో కొందరిని మర్చిపోతాం
కొందరి నీడలో కాలాన్నే మర్చిపోతాం
నిదురించే సమయంలో అన్ని ఆలోచనలు వదిలి నిద్రపో నేస్తం!!
5◆ చీకటంటే ఎప్పుడూ బయపడకు
చీకటిని చీల్చే మిణుగురులా ఆశాభావంతో ఉండు
శుభరాత్రి
6◆ చీకటిని కూడా అందంగా మార్చేసేది చందమామ అయితే
చందమామకు కథలు చెబుతూ నిద్రపుచ్చే నీకు శుభరాత్రి
7◆ కాలంతో పరుగులు పెట్టి
రోజంతా అలసిపోయి
రాత్రి ఊయలలో పాపాయిలా ఒదిగిపోయి నిద్రపో!!
8◆ తలపుల చిట్టా విప్పి చందమామ తలుపు ముందు దారబోశాను
వింటూనే వెన్నెలతో జతగా నిద్రపోతున్నాడు చూడు
నువ్వు కూడా నిద్రపో నేస్తం!!
9◆ చీకటి చెప్తుంది చిందులేసిన మనస్సు కి కొంచం విశ్రాంతిని అందించు అని
చల్లని గాలి చెప్తుంది కబుర్లు చాలు కునుకు తీయు అని
సరాగాల సంగీతంలో లీనమై
కమ్మని నిద్రలోకి జారిపో!!
10◆ అప్పుడప్పుడు ఆకాశం నవ్వుతుంది
నీకోసం చందమామను పంపుతుంది
కథనో కవితనో నీకోసం దాచిపెట్టి రాత్రవ్వగానే నిన్ను నిదురపుచ్చుతుంది
11◆ ఆలోచనల సుడిగుండాన్ని ఎంతదాకా లాక్కెళ్తావు నేస్తం
ఆశల రెక్కలు మనతోనే ఉన్నపుడు నిరాశకు లోనవ్వక నిద్రపో
12◆ ఈ రాత్రి నీకోసమే విరిసినట్టుంది
కలతలు అన్ని వదిలి కమ్మని కలల దుప్పట్లో వెచ్చగా నిద్రపో!!
13◆ నక్షత్రాలు కిందకి రావాలి
ఆకాశం దుప్పటిలా మారాలి
ప్రపంచం ప్రశాంతంగా ఉండాలి
ఎందుకంటే నువ్వు హాయిగా నిద్రపోవాలి మరి!!
14◆ గమనించావా చీకటి పడగానే నీడ కూడా నిద్రపోయింది
నువ్వు మాత్రం అలసిపోతూ అవతలి తీరాన్ని చూస్తున్నావు
ఇకనైనా నిద్రపో నేస్తం!!
15◆ చిరుగాలి నీకు జోల పాడుతుంటే
వాలిపోయే నీ కనురెప్పల మాటున
కోటి కలలు ఉదయించాలని
అవన్నీ జీవితంలో నిజమవ్వాలని కోరుకుంటూ శుభరాత్రి నేస్తం!!
16◆ కళ్ళకు కలలు కనడం వచ్చు
కలలకు కథలు చెప్పడం వచ్చు
ఆ కథలు వింటూ అన్ని మరచిపోయి
నిద్రలో లీనమైపో నేస్తం!!
17◆ జీవితమంతా అశాంతిగా ఉందని దిగులు పడకు
అశాంతి మొత్తం నీ మనసులోనే ఉందని తెలుసుకో
చీకటితో దాన్ని వదిలేసి చిరుదివ్వెలా నవ్వుతూ నిద్రపో!!
18◆ జీవితం మీద ఆశ పెరుగుతూ
అహంకారం పాళ్లు కరుగుతూ
రేపటి ఆత్మవిశ్వాసపు దారిలో నడవడానికి ఇప్పుడు విశ్రాంతి తీసుకుని నిద్రపో
19◆ అద్దం కూడా మనం ఎదురుగా ఉంచేదే చూపెడుతుంది
అలాంటిది ఎవరో నీ మనసును స్పష్టంగా ఎలా అర్థం చేసుకోగలరు
అందుకే కలతలు మరిచి కన్నులకు విశ్రాంతినివ్వు
20◆ ఆహ్లాదకరమైన నిద్రకు కావలసింది పట్టు పాన్పులు, పన్నీటి సువాసనలు కాదు
చింత లేని మనసు
సంతోషంగా ఉన్నామనే తృప్తి
అందుకే తృప్తిగా నిద్రపో నేస్తం!!
21◆ కళ్ళలోని కన్నీళ్లు విలువైనవి
పెదాలలోని పదాలు పదునైనవి
ప్రేమగల హృదయం అందమైనది
అందమైన నీ హృదయానికి శుభరాత్రి నేస్తం!!
22◆ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు
నువ్వు ఉంటే నీతో కలసి నడుస్తుంది
నువ్వు లేకపోతే ఇంకొకరితో కలసి సాగిపోతుంది
అందుకే కాలంతో కలసి సాగిపో
ఈ రాత్రితో కలసి నిద్రపో
23◆ మనసును నొప్పించే ఎందరో చుట్టూ ఉన్నా
నా మనసుకు అయిన గాయానికి మాటల మందు పూసే నా నేస్తానికి శుభరాత్రి!!
24◆ నీ కలలను ఆకాశం తన ఒంటిమీద పచ్చబొట్టులా మార్చుకుంటుంది
కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకో
ప్రతిరాత్రి నీకు అది ఒక కొత్త కలలా కనిపిస్తూనే ఉంటుంది
25◆ చీకటిని ఎప్పుడూ నిందించకు
అది వెలుగు విలువను చూపెడుతుంది
మన శ్రమకు విరామం ఇస్తుంది
కాలాన్ని ముందుకు తీసుకెళ్తుంది
శుభరాత్రి
26◆ ఆకాశాన్ని అడిగాను
చుక్కలకు కబురు పెట్టాను
చందమామకు ఉత్తరం రాశాను
మేఘాలను రమ్మని చెప్పాను
నువ్వు నిద్దురపోతే కలలో మేఘాల పల్లకిపై ఆకాశవీధిలో రాజహంసలా తిప్పమని
శుభరాత్రి మరి!!
27◆ ఆకాశ పువ్వు అందంగా ముస్తాబయ్యి
నువ్వు చెప్పే కబుర్ల కోసం వేచి చూస్తోంది
తొందరగా నిద్రపుచ్చి నువ్వు నిద్రపో!!
28◆ కలలన్నీ ఆశలను పెంచుతాయి
అలలన్ని పాఠాలను నేర్పుతాయి
కలలు అలలు కలసిన సముద్రంలాంటి జీవితంలో
శరీరానికి విశ్రాంతి అవసరం
శుభరాత్రి నేస్తమా!!
29◆ ఆకాశంతోనూ
చుక్కలతోనూ
కబుర్లు చెప్పడం మాని
బుద్దిగా నిద్రపో నేస్తం!!
30◆ ఉదయాలు, రాత్రులు శాశ్వతమైనవి కాదు
అలాగే
కష్టాలు, సుఖాలు కూడా శాశ్వతం కాదు
ఓర్పుగా కాలంతో సాగిపోవాలి
శుభరాత్రి!!
31.నోరు జారిన మాట,చేయిజారిన అవకశం, ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలం తిరిగి రావు. శుభరాత్రి
32. ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు.శుభరాత్రి..!
33. ఈ రోజుల్లో ఏ బంధం గొప్పది కాదు. మనతో అవసరాలు ఉన్నంత వరకే బంధాలైన బంధుత్వాలైన అవసరం తిరిపోతే ఏ బంధమైన భారమే. శుభరాత్రి
34.మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చిన బంధమే గొప్పది. శుభరాత్రి మిత్రమా!
35.శుభరాత్రి.మాట జారిపోతే మనసు క్షమించవచ్చును కానీ,నమ్మకం జారిపోతే నీడ కూడా శత్రువై నిన్ను బాధిస్తుంది .
36.ధనం ఉన్నవారితో కాదు.. గుణం ఉన్నవారితో స్నేహం చేయ్ బాధపడే రోజు ఎప్పుడు రాదు.. రానివ్వరు.శుభరాత్రి
37.నిన్ను నిన్నుగా… నమ్మేవారికి ప్రాణమిచ్చెయ్…! నిన్ను వదిలి పోయేవారికి… దారి ఇచ్చెయ్…! శుభ రాత్రి మిత్రమా…
38.మంచి అనేది మనసులో ఉండాలి, చేసే పనిలో ఉండాలి.ఊరికే చెప్పే మాటల్లో కాదు.శుభరాత్రి
39.పరిచయం అందరూ అవుతారు.కానీ కొందరు మాత్రమే మనసులో నిలిచిపోతారు మిత్రమా..! శుభరాత్రి
40.ఓపిక చాల విలువైనది.అది ఎంత ఎక్కువగా ఉంటె జీవితంలో అంత ఎక్కువ నేర్చుకుంటావు.శుభరాత్రి మిత్రమా..!
41.గుడ్ నైట్ పొట్టి
42.ఎంతగా బాధ ఉండనీ ఎన్ని కష్టాలు రానీ కడుపు నిండా ఆకలి కంటి నిండా నిద్ర వచ్చినవాళ్లే నిజమైన అదృష్టవంతులు
43.రూపం అందమైనది,మనసు స్వచ్ఛమైనది,మాట మధురమైనది,స్నేహంమరువలేనిది.కానీ “నిద్ర” ఆగలేనిది..అందుకే చెపుతున్న గుడ్ నైట్
44.బాధ అనేది మనిషిని బలవంతుడిగా చేస్తుంది, అలాగే వైఫల్యము వివేకాని నేర్పిస్తుంది. శుభరాత్రి.
45.దేవుడు ఒకరి వలన మన ఆనందాలను దూరంచేస్తే మరొకరి వలన తప్పక ఆనందాలను మన దరికి చేరుస్తాడు. Good night.
ఇది కూడా చదవండి :-