Table of Contents
Hdfc బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ రకాలు, వాటి వివరాలు
Hdfc Bank Savings Account: మన దేశంలో ఉన్నటువంటి పెద్ద బ్యాంక్స్ లో hdfc బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకు తన కస్టమర్లకి చాలా రకాల అకౌంట్స్ ని ప్రోవైడ్ చేస్తుంది. వాటిలో సేవింగ్స్ ఖాతాల గురించి ఈ ఆర్టికల్ తెలుసుకుందాం.
HDFC Bank Savings Account Types In Telugu
ఫ్రెండ్స్ hdfc బ్యాంకు లో 11 రకాల సేవింగ్స్ అకౌంట్స్ ఉన్నాయి. అవి:
Regular Savings Account
- SavingsMax Account
Women’s Savings Account
- Digisave Youth Account
Senior Citizen’s Account
- Savings Farmer Account
- Super Kids Savings Account
- Kids Adavntage Account
- Institutional Savings Account
- Basic Savings Bank Deposit Account
- Government Scheme Beneficiary Savings Account
ఇప్పుడు మనం ఈ అకౌంట్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
1.Regular Savings Account In Telugu
hdfc సేవింగ్స్ అకౌంట్ లో రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. ఈ అకౌంట్ చాలా మంది వాడుతుంటారు. ఇందులో మనం పొదుపు చేసిన అమౌంట్ కి వడ్డీ కూడా ఎక్కువగానే వస్తుంది. hdfc బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో ఇది ఒక కమాన్ అకౌంట్.
Regular Savings Account Features In Telugu
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఈ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్ కి మినిమం బ్యాలెన్స్ ఒక ప్రాంతంలో ఒకోలా ఉంటుంది.
- మెట్రో లేదా అర్బన్ బ్రాంచ్ లలో 10,000 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
- సెమీ అర్బన్ బ్రాంచ్ లలో 5,000 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
- గ్రామీణ బ్రాంచ్ లలో 2,500 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
2.Transaction Limit
ఈ అకౌంట్ లో మనం ఒక నెలలో 3 నుంచి 5 ట్రాన్స్ యాక్షన్స్ చేసుకోవచ్చు.
3.HDFC ATM లలో నెలలో మొదటి 5 లావాదేవీలు ఫ్రీగా చేసుకోవచ్చు.
4.ఒక సంవత్సరానికి 25 చెక్ లీవ్‌లు ఫ్రీగా ఇస్తారు.
5. పాస్ బుక్ ని కూడా ఫ్రీగా పొందవచ్చు.
6. డెబిట్ కార్డు ను ఫ్రీగా పొందవచ్చు.
2.SavingsMax Account In Telugu
hdfc బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో సేవింగ్స్ మాక్స్ అకౌంట్ కూడా ఒకటి. ఈ అకౌంట్ కూడా కస్టమర్లకి మంచి ప్రిమియంలను ప్రోవైడ్ చేస్తుంది. ఈ క్రింద అకౌంట్ గురించి వివరంగా తెలుసుకుందాం.
SavingsMax Account Features In Telugu
ఇప్పుడు మనం ఈ అకౌంట్లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ లో మనం మినిమం బ్యాలెన్స్ 25,000 రూ.. ఉంచాలి. కొంచం ఎక్కువ అమౌంట్ అయిన కూడా మంచి ఆఫర్స్ ని అందిస్తుంది.
2.Transaction Limit
ఈ అకౌంట్ ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది బెస్ట్ ఫీచర్. ఎందుకంటే రోజుకి 75,000 రూ విత్ డ్రా చేసుకోవచ్చు. ఇంకా షాపింగ్ చేస్తే 1.75,000రూ వరకు ఖర్చు చేసుకోవచ్చు.
3.Insurance
- ఫ్రెండ్స్ మనం ప్రమాదవశాత్తు ఆసుపత్రిలో చేరితే ఒక సంవత్సరంకి 1 లక్ష వరకు భీమా క్రింద అమౌంట్ ఇస్తుంది.
- యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ కవర్ క్రింద సంవత్సరానికి 10 లక్షలు ప్రోవైడ్ చేస్తుంది.
4.లైఫ్ టైం ప్లాటినం డెబిట్ కార్డు ను కూడా పొందవచ్చు.
5.ఈ అకౌంట్ లో వడ్డీ రేటు సంవత్సరానికి 4% ఉంటుంది.
3.Women’s Savings Account In Telugu
hdfc బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో ఇది చాలా ముఖ్యమైన అకౌంట్. మహిళలకు కావలిసిన బ్యాంకింగ్ సేవలను అందిచడమే ఈ అకౌంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ అకౌంట్ మహిళలకి లోన్స్ కూడా ఇస్తుంది.
Women’s Savings Account Features In Telugu
ఫ్రెండ్స్ క్రింద మనం ఈ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఈ సేవింగ్స్ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఒకో చోట ఒకోలాగా ఉంటుంది. అవి :
- మెట్రో అర్బన్ ప్రాంతంలో 10,000 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
- సెమి అర్బన్, రూరల్ బ్రాంచ్ లలో 5,000 రూ..మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
2.Transaction Limit
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో 1 లక్ష వరకు ట్రాన్స్ యాక్షన్ చేసుకోవచ్చు.
3.Insurance
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ లో మనం ఇన్సురెన్స్ కవర్ కూడా పొందవచ్చు. అవి :
- యక్షిడెంట్ డెత్ క్రింద 10 లక్షల వరకు ఇన్సురెన్స్ ప్రోవైడ్ చేస్తుంది.
- యక్షిడెంట్ హాస్పెటలైజేషన్ కవర్ లో 1 లక్ష ఇన్సురెన్స్ ప్రోవైడ్ చేస్తుంది.
4. ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మహిళలు లోన్ గనుక తీసుకుంటే అంటే నార్మల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటులో 2% తగ్గుతుంది. అదే టువిల్లర్ లోన్ తీసుకుంటే 50% డిస్కౌంట్ వస్తుంది.
4.Digisave Youth Account in Telugu
HDFC బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో Digisave youth అకౌంట్ ఒకటి. యువత మరియు విద్యార్థుల కోసం ఈ అకౌంట్ ని ఏర్పాటు చేశారు. ఈ అకౌంట్ యువతకు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
Digisave Youth Account Features in Telugu
ఇప్పుడు మనం ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
- ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మెట్రో & అర్బన్ బ్రాంచ్ లలో 5,000 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
- సెమీ అర్బన్, రూరల్ బ్రాంచ్ లలో 2,500 మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
2.Transaction Limit
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ లో ఒక నెలలో 1,25,000 రూ. విత్ డ్రా చేసుకోవచ్చు.
3. ఫ్రీగా డెబిట్ కార్డు ని పొందవచ్చు.
4.ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో ఎడ్యుకేషన్ సంభందించి లోన్స్ తీసుకుంటే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది.
5. మనం గనుక smartybuy.hdfcbank.com వంటి వాటిలో షాపింగ్ చేస్తే డిస్కౌంట్ కూడా వస్తుంది.
5. Senior Citizen’s Account In Telugu
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ కేవలం సీనియర్ సిటిజెన్స్ కి బ్యాంకింగ్ సేవలను అందిచడం కోసం ఏర్పాటు చేశారు. ఈ క్రింద మనం ఈ అకౌంట్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Senior Citizen’s Account Features In Telugu
ఈ సేవింగ్స్ అకౌంట్ ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ సేవింగ్ అకౌంట్ లో మనం 5,000 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి.
2.Transaction Limit
ఈ అకౌంట్ లో మనం ఒక నెలలో 4 క్యాష్ ట్రాన్స్ యాక్షన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఒక నెలలో 2 లక్షల వరకు ట్రాన్స్ యాక్షన్స్ చేసుకోవచ్చు.
3.Insurance Cover
ఈ సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ అకౌంట్ కి ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్.
- ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి ఆసుపత్రిలో చేరితే సంవత్సరానికి 50,000 రూ.. భీమా ప్రోవైడ్ చేస్తుంది.
- ఇంకా నార్మల్ డెత్ భీమా 5 లక్షల వరకు ప్రోవైడ్ చేస్తుంది.
4.Reward Points
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో రివార్డ్ పాయింట్స్ కూడా పొందవచ్చు. ఒక నెలలో మనం డెబిట్ కార్డు ని USE చేస్తే 2000 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. వీటి వలన మనం ఏదైనా కొనుగోలు చేసినప్పుడు 5% అమౌంట్ తగ్గుతుంది.
6.Savings Farmer Account In Telugu
ఫ్రెండ్స్ hdfc బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లో సేవింగ్స్ ఫార్మర్ అకౌంట్ ఒకటి. దీనిని రైతుల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
Savings Farmer Account Features In Telugu
ఈ క్రింద సేవింగ్స్ ఫార్మర్ అకౌంట్ ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ లో మనం 2,500 రూ.. మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. మిగతా సేవింగ్స్ అకౌంట్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ.
2.Transaction Limit
ఈ సేవింగ్స్ అకౌంట్ లో మనం 10 లక్షల వరకు ట్రాన్స్ యాక్షన్ చేసుకోవచ్చు. ఈ అమౌంట్ పైనా మనం ఏదైనా ట్రాన్స్ యాక్షన్ చేస్తే చార్జెస్ అప్లై చేస్తారు.
3.CashBacks
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ కి ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఎందుకంటే మనం ఈ అకౌంట్ లో ప్రతి సంవత్సరం 3000 వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలాగే ఫ్యూయల్ పై ఖర్చు చేసే ప్రతి 100 రూ.పై 1% క్యాష్ బ్యాక్ పొందవచ్చు
4.మని బ్యాక్ క్రెడిట్ కార్డు ని ఫ్రీగా పొందవచ్చు.
5.24/7 బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి.
7.Super Kids Savings Account In Telugu
hdfc బ్యాంకు ప్రోవైడ్ చేసే సేవింగ్స్ అకౌంట్స్ లో సూపర్ కిడ్స్ సేవింగ్స్ అకౌంట్ ఒకటి. పిల్లలో మని అంటే డబ్బు విలువను తెలియచేయడానికి, పిల్లలలో మనీ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను పెంపొందించడమే ఈ అకౌంట్ యొక్క ముఖ్య లక్ష్యం.
Super Kids Savings Account Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ సేవింగ్ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ మిగతా సేవింగ్స్ అకౌంట్స్ పోలిస్తే ఈ అకౌంట్ కొంచం కాస్ట్లీ సేవింగ్స్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు. ఈ అకౌంట్ లో మనం 1 లక్ష మినిమం బ్యాలెన్స్ గా ఉంచాలి.
2.Transaction Limit
ఒక నెలలో 5 క్యాష్ ట్రాన్స్ యాక్షన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే ఒక నెలలో 2 లక్షల వరకు ట్రాన్స్ యాక్షన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు.
3. insurance cover
ఈ సూపర్ కిడ్స్ సేవింగ్స్ అకౌంట్ కి ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అకౌంట్ లో మనం ఫ్రీ గా 5 లక్షల వరకు ఎడుకేషన్ ఇన్సురెన్స్ కవర్ పొందవచ్చు.
4.రూపే కిడ్స్ డెబిట్ కార్డు ని ఫ్రీగా పొందవచ్చు.
5.ATM లలో ఆన్ లిమిటెడ్ ట్రాన్స్ యాక్షన్ చేసుకోవచ్చు.
8.Kids Adavntage Account In Telugu
ఫ్రెండ్స్ కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ లో పిల్లలు వారి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుని క్రింద అకౌంట్ ని కలిగి ఉంటారు. hdfc బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో ఈ అకౌంట్ కూడా ఒక బెస్ట్ సేవింగ్ అకౌంట్.
Kids Adavntage Account Features In Telugu
ఈ అకౌంట్ లో ఏ ఏ ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1.Minimum Balance
ఈ కిడ్స్ అడ్వాంటేజ్ అకౌంట్ లో మనం 5,000 రూ.. మినిమం బ్యాలెన్స్ గా ఉంచాలి. అమౌంట్ కొంచం ఎక్కువగా ఉన్న మంచి ఫీచర్స్ ని ప్రోవైడ్ చేస్తుంది.
2.Transaction Limit
ఫ్రెండ్స్ ఈ సేవింగ్స్ అకౌంట్ లో మనం 2 లక్షల వరకు ఫ్రీగా ట్రాన్స్ యాక్షన్స్ చేసుకోవచ్చు.
3. insurance cover
ఈ సేవింగ్స్ అకౌంట్ లో మనం ఉచిత విద్య బీమా కవరేజ్ క్రింద 1 లక్ష ఫ్రీగా పొందవచ్చు.
4.ఈ అకౌంట్ ఆడపిల్ల కోసం సుకన్య సమృద్ధిని బండిల్ చేస్తుంది.
5.24/7 బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి.
9.Institutional Savings Account In Telugu
hdfc బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో ఇన్‌స్టిట్యూషనల్ సేవింగ్స్ ఒకటి. ఇన్‌స్టిట్యూషనల్ సేవింగ్స్ అకౌంట్ NGO సంస్థలకు సులభమైన బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తుంది. ఈ క్రింద మనం ఈ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
Institutional Savings Account Features In Telugu
ఇప్పుడు మనం ఈ అకౌంట్ లో ఏ ఫీచర్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
1.Minimum Balance
ఇన్‌స్టిట్యూషనల్ సేవింగ్స్ అకౌంట్ కి ఉన్నటువంటి ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్. ఎందుకంటే ఈ సేవింగ్ అకౌంట్ లో మనం మినిమం బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ 0.
2. చెక్ బుక్ ని ఫ్రీగా పొందవచ్చు.
3.నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఫోన్ బ్యాంకింగ్ బ్యాంకింగ్‌ను సులభతరం చేయడానికి ఈ అకౌంట్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీరు యుటిలిటీ బిల్లులను కూడా చెల్లించవచ్చు.
4.24/7 బ్యాంకు సేవలు అందుబాటులో ఉంటాయి.
10.Basic Savings Bank Deposit Account In Telugu
hdfc బ్యాంకు సేవింగ్స్ అకౌంట్స్ లో బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్ ఒకటి.ఈ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఈ అకౌంట్ కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ అందిస్తుంది.
Basic Savings Bank Deposit Account Features In Telugu
ఫ్రెండ్స్ ఈ క్రింద మనం ఈ బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ అకౌంట్ లో ఉన్నటువంటి ఫీచర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఈ అకౌంట్ ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్ కాబట్టి ఇందులో మినిమం బ్యాలెన్స్ 0.
2.Transaction Limit
ఈ సేవింగ్ అకౌంట్ లో మనం ఒక నెలలో 4 క్యాష్ ట్రాన్స్ యాక్షన్స్ ఫ్రీగా చేసుకోవచ్చు.
3. ఫ్రీగా పాస్ బుక్ ని పొందవచ్చు.
4. ఫ్రీగా రూపే డెబిట్ కార్డు ని పొందవచ్చు.
11.Government Scheme Beneficiary Savings Account In Telugu
hdfc బ్యాంకు సేవింగ్స్ అకౌంట్ లోGovernment Scheme Beneficiary సేవింగ్స్ అకౌంట్ కూడా ఒకటి. ఈ అకౌంట్ ని మిగతా అకౌంట్స్ తో పోలిస్తే బెస్ట్ గానే ఉంటుంది. ట్రాన్స్ యాక్షన్స్ లిమిట్ గానీ, బ్యాలెన్స్ గాని కొంచం ఎక్కువ గానే ఉంటుంది.
Government Scheme Beneficiary Savings Account Features In Telugu
ఇప్పుడు మనం ఈ అకౌంట్ లో ఉన్న ఫీచర్స్ గురించి తెలుసుకుందాం.
1.Minimum Balance
ఫ్రెండ్స్ ఇది ఒక జీరో బ్యాలెన్స్ అకౌంట్. కాబట్టి ఈ అకౌంట్ లో మనం మినిమం బ్యాలెన్స్ మెయిన్ టైన్ చేయాల్సిన అవసరం ఉండదు.
2.Transaction Limit
ఈ సేవింగ్స్ అకౌంట్ కి ఉన్న ఫీచర్స్ లో ఇది ఒక బెస్ట్ ఫీచర్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అకౌంట్ లో ఒక నెలలో మనం 4 క్యాష్ విత్ డ్రాలని ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే 10 లక్షల వరకు ఒక నెలలో ట్రాన్స్ యాక్షన్ చేసుకోవచ్చు.
3. ఫ్రీగా పాస్ బుక్ ని పొందవచ్చు.
4.డెబిట్ కార్డు ని కూడా ఫ్రీగా పొందవచ్చు.
5. యుటిలిటి బిల్లులను కూడా ఇందులో కట్టుకోవచ్చు.