నరాల బలహీనత తగ్గడానికి ఇలా చేస్తే జన్మలో ఇక రాదు

0
నరాల బలహీనత ఆయుర్వేద చిట్కాలు
నరాల బలహీనత ఆయుర్వేద చిట్కాలు

ప్రస్తుత రోజుల్లో 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సున్న వారు ఎక్కువగా బాధపడుతున్న సమస్య నరాల వీక్నెస్ సమస్య. నేటి రోజుల్లో అతి చిన్న వయసులోనే దీనితో ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా 90 సంవత్సరాల వయసులో రావాల్సిన నరాల వీక్నెస్ సమస్య అనేక కారణాల వల్ల 40 – 50 సంవత్సరాల మధ్యలోనే ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.

మన పూర్వీకులు ఉక్కు శరీరము కలిగి ఉండడం వల్ల ఎలాంటి కష్టమైన పనినైనా అవలీలగా చేసే వారు. అయితే నరాల వీక్నెస్ వల్ల నేటి యువత సరైన శరీర ధారుఢ్యం కలిగి ఉండలేక కష్టమైన పనులు చేయడానికి వీలు లేకుండా ఉంటున్నారు. నరాల వీక్నెస్ కి మందులు వాడడం సరైన సొల్యూషన్ కాదు.

నరాల వీక్నెస్ కి ప్రధాన కారణాలు

సాధారణంగా అందరూ చేస్తున్న తప్పు పాలిష్ పట్టిన వైట్ ఫుడ్ ప్రొడక్ట్స్ అధికంగా తీసుకోవడం. నరాల వీక్నెస్ రావడానికి పోషకాలు లేని ఆహారం తీసుకోవడం. ప్రధానంగా బి విటమిన్ మరియు బి కాంప్లెక్స్ విటమిన్ ఆహారంలో భాగంగా చేసుకోకపోవడం.

మనకు ఈ బీ కాంప్లెక్స్ విటమిన్లు గింజధాన్యాలు యొక్క పొట్టులో అధికంగా లభిస్తాయి. గింజలు మరియు ధాన్యాల యొక్క పై పొరలలో మాత్రమే బి కాంప్లెక్స్ విటమిన్ అధిక శాతంలో లభిస్తుంది. అయితే ఆధునిక సమాజంలో పాలిష్ పట్టి తెల్లగా నిగనిగలాడే ఫుడ్ ప్రొడక్ట్స్ ని అందరూ ఇష్ట పడుతూ ఉండటం వల్ల బీ కాంప్లెక్స్ లేని ఆహారాన్ని మనం ఆహారంలో భాగంగా చేసుకుంటున్నాం. దీని వల్లనే నేటి సమాజంలో అతి చిన్న వయసులోనే నరాల వీక్నెస్ సమస్యతో బాధపడుతున్నాము.

ఇది కూడా చదవండి :-  పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు ని కాకర కాయ తో ఇలా కరిగించండి

బలమైన ఆహారం అంటే కూరగాయలు ఆకుకూరలు మరియు దుంపలు ఇవి మాత్రమే కాదు. ధాన్యాలు విత్తనాలను కూడా ప్రధాన ఆహార భాగాలుగా మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. ఈ ధాన్యాలు మరియు విత్తనాలలో మాంసకృత్తుల తో పాటు శరీరానికి కావలసిన విటమిన్లు శాతము అధికంగా ఉంటుంది. అయితే వీటిని పాలిష్ పట్టి తినడం వల్ల మనకు అందాల్సిన పోషకాలు పదార్థాలన్నింటినీ మనం కోల్పోతున్నాం.

నరాల వీక్నెస్ కు ప్రధాన కారణాలుగా తెల్లటి పిండి మైదా తెల్లటి పాలిష్ పట్టిన బియ్యం మరియు తెల్లటి ఆహార పదార్థాలు అని చెప్పవచ్చు. శాస్త్రవేత్తలు నరాల వీక్నెస్ కు ప్రధాన కారణము బాగా పాలిష్ పట్టిన వాటిని తినడం అని నిర్ధారణ చేశారు. అందుకే పాలిష్ పట్టిన వాటిని తినడం వీలైనంత త్వరగా మానివేయాలి.

మన తాతముత్తాతలు ప్రతిరోజు గుడ్లు, పాలు, బి కాంప్లెక్స్ విటమిన్లు లాంటివేమీ వాడకుండానే ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా కష్టపడి పని చేసేవారు. ఆ రోజుల్లో 60 – 70 వయసులో కూడా దాదాపు 50 కేజీల బస్తాలు మోయగలిగారు అంటే వారందరూ కూడా ముడి బియ్యాన్ని మరియు పాలిష్ పట్టని ధాన్యాన్ని ఆహారంగా తీసుకోవడమే అని శాస్త్రవేత్తలు నిరూపించడం జరిగింది.

పాలిష్ పట్టని బియ్యము తో అన్నము, రాగి సంగటి, జొన్న సంగటి ని ప్రధాన ఆహారంగా తీసుకున్నారు. ఈ గింజ ధాన్యాలలో పైపొర లో అధిక శాతంలో బీ-కాంప్లెక్స్ విటమిన్లు ఉండటం వల్ల ఇవి శరీరానికి ముఖ్యంగా నరాలకు బాగా ఉపయోగపడే విధంగా బలం అందించేవి.

పాలిష్ పెట్టడం వల్ల గింజ ధాన్యాలపై పొట్టుల్లో ఉండే పనికివచ్చే విటమిన్లు అన్నీ మనం కోల్పోతాం. తర్వాత వాటిని అధికంగా ఉడికించి తీసుకోవడం వల్ల మరింత నష్టాన్ని పొందుతాం. అందుకే నేటి రోజుల్లో ఈ పాలిష్ పట్టిన పదార్థాలన్నింటినీ వైట్ పాయిజన్స్ అని అంటారు.

ఈ వైట్ పాయిజన్స్ అన్నీ మనుషుల మీద స్లో పాయిజన్ లాగా పనిచేసి ప్రమాదానికి గురి చేస్తాయి. అందుకే ఈ వైట్ ఫుడ్ ప్రొడక్ట్స్ అన్నింటినీ కూడా పాలిష్ పట్టకుండా తినడం అలవాటు చేసుకోవడం చాలా మంచిది. ముడి ధాన్యాలు పిండి చేసుకుని నేరుగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు సక్రమంగా లభిస్తాయి. దీని ద్వారా నరాల వీక్నెస్ సమస్యను తొలగించుకోవచ్చు.

ప్రధానంగా గింజధాన్యాలు పొట్టు తీయకుండా ఆహారంలో వాడుకోవడం అలవాటు చేసుకుంటే ఈ నరాల జబ్బులు మన దగ్గరకు చేరనే చేరవు. దీనికోసం మీరు ప్రతి గింజ మరియు ధాన్యాన్ని పొట్టు తీయకుండా ఆహార పదార్థంగా వాడుకోవాలి.

అంటే బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జలు, రాగులు, పెసలు కందులు మరియు మినుములు మొదలగు వాటి నన్నింటిని వీలైనంతవరకు పొట్టు తీయకుండానే రవ్వ మరియు పిండి చేసుకుని ఆహారంలో ప్రతిరోజు వినియోగించినట్లు అయితే మీయొక్క శరీరాన్ని బలంగా తయారు చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఎలాంటి నరాల బలహీనత మీకు కలగదు.

ఇలా చేయడం వల్ల నరాల వీక్నెస్ సమస్యకు ఎలాంటి మందులు ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. ప్రధానంగా ఎదుగుతున్న పిల్లలకు వీటిని అలవాటు చేయడం వల్ల వారందరూ మంచి దేహ దారుఢ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

మీరు నరాల వీక్నెస్ సమస్యతో అధికంగా బాధపడుతున్నారా?

అయితే ఇక ఆలస్యం చేయకుండా తౌడు ను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. పశువులు తీసుకునే తవుడును ఆహారంగా తీసుకోవాలంటున్నారు అని ఆశ్చర్యపోతున్నారా? గింజలు, ధాన్యాలు మరియు విత్తనాలు యొక్క పై పొరలో ఉండేటువంటి బలమైన పోషకపదార్థాలు అన్నింటినీ మనము పాలిష్ పట్టించి వాటన్నిటిని తౌడు రూపంలో కోల్పోతున్నాం.

అందుకే ఎంతో బలవర్ధకమైన ఈ తవుడు ను నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఆహారంగా తీసుకోవాలి. ఈ తవుడు రైస్ మిల్లులో లభిస్తుంది. ఈ తౌడు ను వారానికి సరిపోయేంతగా తెచ్చుకుని మీరు వీలైనంతవరకూ నేరుగా తినడం అలవాటు చేసుకోవాలి.

మొదట్లో తినడానికి ఇబ్బంది పడేవారు కొన్ని ఖర్జూరపు ముక్కలను చిన్న బెల్లం ముక్క లను లేదా తేనె మరియు అతి తక్కువ శాతంలో నెయ్యి కూడా కలుపుకుని రోజూ ఆహారంలో భాగంగా మీరు తీసుకుంటే అతి త్వరలోనే నరాల వీక్నెస్ సమస్య నుంచి బయట పడవచ్చు.

మరో రూపంలో కూడా తౌడును తీసుకోవచ్చు. పుల్కాలు చేసుకోవడానికి ఉపయోగించే పిండిలో కలుపుకుని పుల్కాలు రూపంలో తీసుకోవచ్చు. తవుడును రెండు మూడు గంటల సేపు నీటిలో నానబెట్టి ఆ నీటిని వడగట్టి ఆ నీటిలో కి నిమ్మరసం పిండుకొని తాగడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

ఈతవుడు కు మినప పిండి మరియు ఖర్జూర ముక్కలు లేదా ఆర్గానిక్ బెల్లం పొడి కలిపి అతి తక్కువ మోతాదులో నెయ్యి చేర్చుకుని సున్నుండలు తయారు చేసి ప్రతిరోజు 1 సున్నుండ ను స్నాక్స్ గా తినడం వల్ల నరాల వీక్నెస్ సమస్యను అధిగమించవచ్చు.

ఇది కూడా చదవండి :- సాల్మన్ చేపలు ఎంతగా ఉపయోగపడుతాయో తెలుసుకోండి