How To Apply e shramik Card Online In Telugu 2021
e shram card in telugu : కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికులను ఆదుకోవడానికి ఒక కొత్త స్కీమ్ తీసుకువచ్చింది. ఈ స్కీమ్లో మీరు పాలు పంచుకోవాలి అంటే ఒక వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఉచితంగా రెండు లక్షల వరకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ మీ సొంతం చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన ఈ వెబ్సైట్ ద్వారా అసంఘటిత రంగంలోని వాళ్ళని లక్ష్యంగా చేసుకుంటూ మోదీ సర్కార్ ఈ శ్రాం ఆవిష్కరించింది. ఈ సైట్ అందుబాటులోకి వచ్చిన ఆగస్టు 26 నుండి ఇప్పటివరకు దాదాపు కోటి మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.
మరి మీరు కూడా ఈ పథకాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ శ్రామ్ పోర్టల్ ద్వారా సులభంగా మనం ఇంటి నుంచే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పి ఎం ఎస్ బి వై స్కీం కింద ఈ ప్రమాద బీమా బెనిఫిట్ మనకు లభిస్తుంది. తద్వారా ఉచితంగా రెండు లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం దాదాపు 35 కోట్ల మంది మన దేశంలో అసంఘటిత రంగంలో వీరందరిని ఒకే ప్లాట్ ఫామ్ కిందకు తీసుకురావాలని వారి వివరాలు పొందడానికి మోడీ సర్కార్ ఈ పోర్టల్ ను తయారు చేసింది.
మరి e-shram portal లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు step-by-step తెలుసుకుందాం.
How To Apply e shram Card Online In Telugu
1.ముందుగా e shram వెబ్సైట్లో వెళ్లిన తర్వాత కుడిపక్క మనకు రిజిస్టర్ ఆన్ ఈశ్రమ్ అని కనబడుతుంది. దాన్ని క్లిక్ చేయండి.
2. ఇక్కడ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. ఇందులో ఆధార్ నెంబర్ తో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే కింద ఇచ్చిన కాప్చ ని కూడా ఎంటర్ చేయండి. కింద కనబడుతున్న రెండు ఆప్షన్స్ పై నో నో అని పెట్టండి. చివరగా సెండ్ ఓటిపి ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3 . ఇప్పుడు మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ను ఎంటర్ చేయండి, వెంటనే సబ్మిట్ చేయండి.
4. ఇక ఇప్పుడు మన ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి terms and conditions బాక్స్ ను క్లిక్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి.
5. ఇప్పుడు మళ్లీ మీ మొబైల్ కి వచ్చిన ఓటిపి ఎంటర్ చేసి వాలిడేట్ చేయండి.
6. ఇప్పుడు మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం ఫీల్ చేయమని అడుగుతుంది లేదా డైరెక్ట్ గా మన ఆధార్ కార్డు నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కనబడుతుంది. అన్ని కరెక్ట్ గా ఉన్నది లేదో ఒకసారి చెక్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
7. నెక్స్ట్ కూడా మన మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి ఇలాంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. అలాగే నామిని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసేయండి.
8. నెక్స్ట్ మై గ్రేట్ వర్కర్ అని అడుగుతుంది ఇక్కడ నో అని పెట్టి సేవ్ కంటిన్యూ చేయండి.
9. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను పూర్తి చేయండి.
10. తర్వాత మీ ఆక్యుపేషన్ అండ్ స్కిల్స్ వివరాలు పూర్తి చేయండి. ఇక్కడ మీ ప్రైమరీ ఆక్యుపేషన్ ఏంటో తెలియకపోతే, పక్కన ఇచ్చిన ” i ” సింబల్ పై క్లిక్ చేసి లిస్టులో మీరు చేసే పనిని సెలెక్ట్ చేసుకోండి.
11. తర్వాత మీ ఆధార్ నెంబర్ తో లింక్ అయినటువంటి బ్యాంకు డీటెయిల్స్ వస్తాయి, అనగా అన్ని సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని సేవ్ చేయండి.
12. ఇక చివరగా సెల్ఫ్ preview / self declaration వివరాలు పూర్తిగా వస్తాయి. అన్ని ఒకసారి సరి చేసుకుని కింద ఇచ్చిన I undertake that,… మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి.
13. చివరగా ఇంకొకసారి మీ మొబైల్లో వచ్చిన ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
14. ఇప్పుడు మనకు కావాల్సిన E-SHRAM కార్డు వచ్చేస్తుంది. దీన్ని ప్రింట్ చేసుకుని వాడుకోవచ్చు.