Table of Contents
జీవన్ ఆనంద్ పాలసీ పూర్తి వివరాలు తెలుగులో
Lic జీవన్ ఆనంద్ పాలసీ: ఫ్రెండ్స్ మన అందరికి lic గురించి తెలిసిందే.ఇది దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ భీమా సంస్థ. దీనిని 1956 సెప్టెంబరు 1 న ఏర్పాటు చేశారు. దీని యొక్క కేంద్ర కార్యాలయం ముంబైలో ఉంది. Lic అనేది అత్యంత విశ్వసనీయ సంస్థ. అందుకే ప్రజలు ఎక్కువగా ఇందులో పెట్టుబడులు పెడుతుంటారు.
ఈ Lic ప్రజల కోసం ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రవేశపెడుతుంటుంది. అందులో ఒకటే ఈ జీవన్ ఆనంద్ పాలసీ. దీనిని ఫిబ్రవరి 2, 2020 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా భీమా కొనసాగడం ఈ పాలసీ స్పెషల్. పాలసీ గురించి ఇంకొంచం వివరంగా క్రింద తెలుసుకుందాం.
జీవన్ ఆనంద్ పాలసీ పొందాలంటే ఉండాల్సిన అర్హతలు:
ఫ్రెండ్స్ మనం ఈ జీవన్ ఆనంద్ పాలసీని పొందాలి అంటే మనకి ఈ క్రింది అర్హతలు ఉండాలి.
- భారతీయ పౌరుడై ఉండాలి.
- మీ వయస్సు 18 ఏళ్ళ పైన 50 ఏళ్ళ లోపల ఉండాలి.
జీవన్ ఆనంద్ పాలసీ పొందాలి అంటే ఉండాల్సిన డాకుమెంట్స్:
మనం ఈ జీవన్ ఆనంద్ పాలసీని పొందాలి అంటే మన వద్ద ఈ క్రింది డాకుమెంట్స్ ఉండాలి.
- ఆధార్ కార్డు
- పాన్ కార్డు
- మెడికల్ రిపోట్స్
- ఏజ్ ప్రూఫ్
- రెసిడెన్సి ప్రూఫ్
జీవన్ ఆనంద్ పాలసీ వివరాలు
ఫ్రెండ్స్ ఈ జీవన్ ఆనంద్ పాలసీ యొక్క కాల వ్యవధి 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉంటుంది. Lic ప్రవేశపెట్టినటువంటి పాలసిలలో ఇది ఒక బెస్ట్ పాలసిగా చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఇందులో మనం కేవలం 1 లక్ష రూపాయల నుంచి భీమాని తీసుకోవచ్చు. 1 లక్షయేనా అంటే గరిష్టంగా ఎంత అయిన తీసుకోవచ్చు లిమిట్ అనేది లేదు. ఒక్కమాటలో చెప్పాలి అంటే మనం ఇందులో ఒక రోజుకు రూపాయలలో అమౌంట్ అంటే పాలసికట్టి లక్షలకు యజమాని అవ్వవచ్చు.
ఫ్రెండ్స్ ఈ పాలసీలో ఉన్నటువంటి ఇంకో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఒకవేళ మనకు అకాల మరణం సంభవిస్తే మనకు నామినీగా ఉన్నటువంటి వారికీ కవరేజీ అమోంట్ ఇస్తారు.అయితే ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే టర్మ్ పూర్తయ్యాక కూడా 100 ఏళ్ల వరకు కవరేజీ అనేది ఉంటుంది.
Lic జీవన్ ఆనంద్ పాలసీ అనేది లైఫ్ టైమ్ ఎండోమెంట్ ప్లాన్. ఫ్రెండ్స్ అలాగే ఈ పాలసీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనం నెలవారీ విడత కేవలం 2500 రూపాయలు జమ చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
జీవన్ ఆనంద్ పాలసీలో ప్రీమియంని ఏ విధంగా చెల్లించాలి?
ఫ్రెండ్స్ మనం ఈ పాలసీలో ప్రిమియంను చేల్లిచడానికి 4 పద్దతులు ఉన్నాయి. వాటిలో మనకి నచ్చిన దానిని సెలెక్ట్ చేసుకొని ప్రీమియంను చెల్లించవచ్చు. అవి:
- ప్రతినెలా ప్రిమియంను కట్టుకోవచ్చు.
- 3 నెలలకు ఒకసారి ప్రిమియంను కట్టుకోవచ్చు.
- 6 నెలలకు ఒకసారి ప్రిమియంను కట్టుకోవచ్చు.
- సంవత్సరానికి ఒకసారి ప్రిమియంను కట్టుకోవచ్చు.
ఫ్రెండ్స్ మనం ఈ ప్రిమియంను బ్రాంచ్ కి వెళ్లి కట్టవచ్చు.లేదంటే ఫోనేపే, గూగుల్ పే,ద్వారా కూడా కట్టవచ్చు.
జీవన్ ఆనంద్ పాలసీలో చెల్లించే ప్రీమియంపై డిస్కౌంట్ వస్తుందా? ఎంత వస్తుంది.? ఎవరికి వస్తుంది?
మనకి జీవన్ ఆనంద్ పాలసీలో ప్రీమియం చెల్లిస్తే కొంత మొత్తంలో డిస్కౌంట్ కూడా వస్తుంది. అది మనం ప్రీమియం చెల్లించే పద్దతిని బట్టి ఉంటుంది. అది ఎలా అంటే:
- ప్రతి నెల ప్రీమియం చెల్లించే వారికీ డిస్కౌంట్ ఉండదు.
- 3 నెలలు ఒకసారి ప్రీమియం చెల్లించే వారికీ కూడా డిస్కౌంట్ ఉండదు.
- 6 నెలలు ఒకసారి ప్రీమియం చెల్లించే వారికీ 1% డిస్కౌంట్ ఉంటుంది.
- 1 సంవత్సరానికి నెలలు ఒకసారి ప్రీమియం చెల్లించే వారికీ 2% డిస్కౌంట్ ఉంటుంది.
జీవన్ ఆనంద్ పాలసీ ప్రయోజనాలు:
ఫ్రెండ్స్ మనం పైన ఇప్పటివరకు ఈ పాలిసిలో చేరాలంటే ఉండాల్సిన అర్హతలు, డాకుమెంట్స్ అలాగే ఈ పాలసీలో ఉన్న ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ పాలసీలో ఉన్నటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
- ఫ్రాఫిట్‌లో షేరు: ఫ్రెండ్స్ మనం ఈ పాలసీని తీసుకున్నట్లయితే మనకు Lic కి వచ్చే లాభాల్లో కూడా వాటా లభిస్తుంది.
- డెత్ బెనిఫిట్ : దీని గురించి మనం పైన తెలిపాము. ఒకవేళ పాలసీదారుడు అంటే పాలసీ తీసుకున్న మనకు అకాల మరణం సంభవిస్తే మనకు నామినీగా ఉన్నటువంటి వారికీ కవరేజీ అమోంట్ ఇస్తారు.
- పన్ను మినహాయింపు : ఈ జీవన్ ఆనంద్ పాలసీకి ఉన్నటువంటి ప్రయోజనాలలో ఇది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మనకి పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను ను అదా చేసుకోవాలి అనుకునేవారికి ఇది ఒక మంచి అవకాశం.
- మెచ్యూరిటీ బెనిఫిట్: ఫ్రెండ్స్ ఈ పాలసీకి ఉన్న ప్రయోజనాలలో ఇది కూడా ఒకటి. ఈ పాలసీలో పాలసీ టర్మ్ ముగిసే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్‌తో పాటు ప్రీమియం మొత్తం లభిస్తుంది.
- తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం: ఈ పాలసీలో మనం రోజుకు కోన్ని రూపాయలు కట్టి లక్షలు పొందవచ్చు ఎలా అంటే ఉదాహరణకు ఈ జీవన్ ఆనంద్ పాలసీ తీసుకున్నట్లయితే మినిమమ్ సమ్ అష్యూర్డ్ రూ.5 లక్షలుగా ఉంటుంది. ఈ ఆప్షన్ మనం ఎంచుకున్నట్లయితే 35 ఏళ్ల మెచ్యూరిటీ టర్మ్ తీసుకుంటే మన చేతికి 25 లక్షలు వస్తాయి .ఎలా అంటే ఈ 35 ఏళ్ల పాటు ఒక సంవత్సరానికి 16,300 రూ.. చెల్లించాల్సి ఉంటుంది. అంటే మనంనెలకు 1,358రూ… చెల్లించాలి. దీని ప్రకారం మనకు రోజుకు కేవలం 45 రూ. మాత్రమే పడుతుంది. మీకు మెచ్యూరిటీ సమయంలో చేతికి దాదాపు రూ.25 లక్షలు వస్తాయి. అందులో బీమా మొత్తం 5 లక్షలు, బోనస్ 8 లక్షలు, ఎఫ్‌ఏబీ రూ.11.5 లక్షలు కలిసి ఉంటాయి.
గమనిక: పైన తెలిపిన సమాచారంను ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఇంకా ఇంకా ఏవైనా సందేహాలు ఉంటె మెయిన్ వెబ్సైట్ ని ఒకసారి చదవండి.
ఇవి కూడా చదవండి: