Best 40 Nammakam Quotes In Telugu
సాధారణంగా మనం రోజు లేవగానే ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ మెసేజెస్ మనతో పంచుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు నమ్మక్లం పై అద్భుతమైన కొన్ని కొటేషన్స్ చూద్దాం. ఇవన్ని మన నిజ జీవితంలో ఎప్పుడో ఒకసారి వినే ఉంటాము.
మరి మీకు గనుక మీ నమ్మకం మెసేజెస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మెసేజెస్ కోసం మా తెలుగు న్యూస్ పోర్టల్ వెబ్ సైట్ ని డైలీ విజిట్ చేయండి.
1◆ ఎక్కువగా నమ్మడం
ఎక్కువగా ప్రేమించడం
ఎక్కువగా ఆశించడం
ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది
2◆ ఇద్దరు మనుషుల మధ్య
నమ్మకం ఓ అద్భుతమైన వారధి
దాన్ని నిలబెట్టుకోవడం ఆ ఇద్దరి చేతుల్లోనే ఉంటుంది
3◆ మనిషి బలం నమ్మకమే
బలహీనత నమ్మకమే
అందుకే మనల్ని నమ్మిన వాళ్ళ ఆశను ఎప్పటికి వమ్ము చేయకూడదు
4◆ నలుగురు చెప్పగానే మారిపోయేది
నలుగురిలో నిరూపించుకోవలసినది కాదు నమ్మకమంటే
అది మనసులో నుండి పుట్టి జీవితంలో సాగే నిత్య బాటసారి
5◆ నువ్వు విజయం సాధించాలి అంటే
మొదట నిన్ను నువ్వు ఆత్మవిమర్శ చేసుకుని
తప్పులను సరిదిద్దుకుంటూ సాగాలి
అంతేకానీ
నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళ మాటలు నమ్మకు
6◆ కష్టాన్ని నమ్మినవాడు
ఇతరులను గౌరవించే వాడు
ఒకరి మంచి కోరేవాడు
చెడిపోయిన సంఘటనలు లేవీ ప్రపంచంలో
7◆ నిజానికి నగ్నత్వం ఉంటుంది
అబద్దానికి అందం ఉంటుంది
నమ్మకానికి మాత్రం నీతి నిజాయితీల కవచం ఉంటుంది
సరిగా గమనించి చూడాలి
8◆ ప్రేమంటే నమ్మకం అనుకుంటారు అంతా
నమ్మకంలో నుండి పుట్టేది ప్రేమ అయితే
వైఫల్యం తరువాత నమ్మకానికి అర్థమేమిటి మరి!!
9◆ పిల్లలంటే తల్లిదండ్రులకు భరోసా కావాలి
భవిష్యత్తు గురించి బంగారు కలలు కనాలి
జీవితానికి గొప్ప నమ్మకాన్ని ఇవ్వాలి
10◆ ప్రేమించే ప్రతి వాడు నమ్మకమనే పదాన్ని ఉపయోగిస్తాడు
కానీ
నమ్మకానికి అర్థం చెప్పమంటే చెప్పలేడు
అవును మరి నమ్మకం కూడా కృత్రిమత్వం అయిపోయింది ఈ రోజుల్లో!!
11 ◆ నీకెప్పుడైనా నవ్వాలని అనిపిస్తే నవ్వేయి
ఏడవాలని అనిపిస్తే ఏడ్చేయ్యి
ఎవరో ఏదో అనుకుంటారని నమ్మి ఎమోషన్స్ ను అణుచుకోకు
12 ◆ నాన్నంటే భయం కాదు భరోసా
బాధ్యత కాదు జీవితానికి ఆశ
తన కలలను చంపుకుని రేపటి మన కలల కోసం తపించే గొప్ప నమ్మకం నాన్నంటే!!
13 ◆ పక్షి ఎప్పుడూ ఆకాశం నుండి పడిపోతానని భయపడదు
దాని రెక్కల మీద దానికున్న నమ్మకం అది
మనిషి కూడా తనమీద తన శక్తి మీద నమ్మకం ఉంచుకోవాలి!!
14 ◆ నమ్మకమంటే అంగట్లో దొరికేది కాదు
అరగంటలో బలపడేది కాదు
కొన్ని సంఘటనల తాలూకూ భరోసాల సమూహమే నమ్మకమంటే!!
15 ◆ ఒక మనిషి జీవితంలోకి వెళ్ళామంటే ఎప్పుడూ తోడుంటామనే భరోసా ఇవ్వగలగాలి
లేకపోతే
తాళం చెవి పోగొట్టుకున్న గదిలా మారిపోతుంది అవతలి వ్యక్తి జీవితం!!
16 ◆ నిజానికి నీడకు ఉన్నంత తేడానే
నేరుగా చూసే విషయానికి, చెప్పుడు మాటలకు మధ్య కూడా ఉంటుంది
ఏ విషయానికి తొందరగా నిర్ణయం తీసుకుని నమ్మకం ఏర్పరచుకోకూడదు
17 ◆ చీకటి తర్వాత వెలుగు వస్తుందనే నమ్మకం ఎలాగైతే అందరికీ ఉంటుందో
కష్టం తరువాత సంతోషం కూడా వెంట వస్తుందనే నమ్మకం ఉండాలి
అప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలుగుతాము!!
18 ◆ అతి నమ్మకం అనర్థదాయకం
ఒకోసారి అది వెన్నుపోటుకు దారితీస్తుంది
జీవితంలో కోలుకోలేని దెబ్బగా మారుతుంది
19 ◆ అందరూ అంటుంటారు గెలవాలి గెలవాలి అని
కానీ గెలవాలంటే ముందు పోరాడాలని ఆ పోరాటంలో వెంట ఉండాలని ఆలోచించరు
తోడుగా ఉంటామనే నమ్మకం వాళ్ళు కలిగిస్తే గెలుపు పతాకం చేతిలో ఉన్నట్టే
20 ◆ తప్పు జరిగినపుడు మనల్ని వదిలి వెళ్లిపోయేవాళ్ళు ఎక్కువ
మనతో ఉండి మన తప్పును సరిదిద్ది తోడుండేవాళ్ళు చాలా తక్కువ
వాళ్లే అసలైన నమ్మకస్తులు
21 ◆ మనతోనే ఉంటూ
మన చెడు కోరేవాళ్ళు
మన శత్రువుల కంటే పెద్ద ప్రమాదకరమైన మనుషులు
అసలైన నమ్మకద్రోహులు వాళ్లే
22 ◆ ఎప్పుడూ కాలంతో పాటు మారుతున్న ఈ ప్రపంచంలో నమ్మకం మాత్రం స్థిరంగా ఉండాలని ఎందుకనుకుంటావ్!!
23 ◆ నమ్మకానికి కూడా దశలు ఉంటాయి
మాట ఇవ్వడం ఒక దశ
దాన్ని నిలబెట్టుకోవడం మరొక దశ
అయితే అది ఇద్దరి మధ్య బంధాన్ని బలపరిస్తే పరిపూర్ణ దశగా రూపాంతరం చెందుతుంది
24 ◆ మన మనసులో భయాలు
భావోద్వేగాలు
సందేహాలు
అన్నీ మనం ఏర్పరచుకున్న నమ్మకాలే
ఒక్కసారి వాటిని పక్కకు తోసి చూస్తే మనం ఒక తెల్లకాగితంలా ఎలాంటి గందరగోళం లేకుండా ఉండగలుగుతాం
25 ◆ నీ తప్పులను కప్పిపుచ్చి
నీవెంట నడిచేవారిని ఎప్పటికి నమ్మకు
వాళ్ళు నీ శ్రేయోభిలాషులు కాదు
నీ చెడు మార్గాన నిన్ను వదిలేసిన నమ్మకద్రోహులు!!
26 ◆ నిజమైన స్నేహంలో
నమ్మకమైన బంధంలో బాధ్యత ఉంటుంది
ఏదైనా కారణం వల్ల మన నుండి దూరంగా వెళ్లినా తిరిగి మనదగ్గరకు వచ్చి తీరుతుంది
27 ◆ మీరు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతారు
బలహీనులం అనుకుంటే బలహీనులవుతారు
బలవంతులం అనుకుంటే బలవంతులవుతారు
ఏదైనా మీరు మనసులో ఏర్పరచుకునే నమ్మకంలోనే ఉంది.
28 ◆ ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు మనిషి బికారిగా మారిపొడు
పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోగలను అనే నమ్మకాన్ని కోల్పోయినప్పుడు నిజమైన బికారిగా మరిపోతాడు
29 ◆ నీ తప్పు నిన్ను శిక్షిస్తుందనే నమ్మకాన్ని నీ మనసులో ఉంచుకుంటే
నువ్వెప్పటికి తప్పు చేయవు
తప్పు దారిలో వెళ్లవు
30◆ చీకట్లో దీపం లాంటిది
బాధలో చిరునవ్వు లాంటిది
కష్టంలో తొడులాంటిది
కన్నీళ్లను తుడిచే ఆప్తహస్తం లాంటిది నమ్మకమంటే
ఎవ్వరి దగ్గరా దాన్ని పోగొట్టుకోకు!!
31. నమ్మితే మోసపోతాం,నమ్మకపోతే ఒంటరౌతాం…నమ్మి మోసపోవడం కంటేనమ్మకపోవడమే మంచిదేమో
32. నమ్మకం అనేది ఒక బలం.. ఆ బలం పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు
33. నమ్మకం ఉంటె మౌనం కూడా అర్థమౌతుందన్నావు,మరి నా మౌనానికి అర్థం ఏంటో చెప్పగలవా
34. నమ్మిన మనిషి కంటే,నమ్మకంగా ఉండేవి జంతువులే.
35. ఒక అబద్దం వలన కోల్పోయిన నమ్మకం, వెయ్యి నిజాలు చెప్పినా రాదు
36. మాట ఇవ్వడానికి తొందరపడకు,ఇచ్చిన మాట నెరవేర్చడానికి వెనుకాడకు.
37. నమ్మకాన్ని గెలుచుకోవడం చాలా కష్టంఆ నమ్మకాన్ని వమ్ము చేయడం తేలిక
38. ఎవరినో ఎందుకు నమ్మడం ? అన్నీ తెలిసి.. మన అనుకున్న వాళ్ళే మోసం చేస్తుంటే..!!
39. నమ్మించి మోసం చేయడం నీ తప్పు కాకపోవచ్చు.కానీ మోసం చేసేంతలా నమ్మడం మాత్రం నా తప్పే.
40. అందరినీ నమ్మడం, ఎవ్వరినీ నమ్మకపోవడం.. రెండూ ప్రమాదకరమే
41.కొందరి మనుషుల కంటే జంతువులే నయం అంటారు.. ఎందుకంటే అవి మనమీద నమ్మకంగా ఉంటాయి..
42.నమ్మకంతో మొదలైన బంధాలు శాశ్వతంగా నిలుస్తాయి.. భయంతో మొదలయ్యే బంధాలు మధ్యలోనే ఆగిపోతాయి..
43.నీ మీద నమ్మకం ఉంచిన వాళ్లకు అన్యాయం చేయకు..
44.చీకటి, వెలుగులు నమ్మకాన్ని తెలుపుతాయి. ఒకచోట నమ్మకం ఉంటే అక్కడ వెలుగు ప్రకాశిస్తుంది.. లేని చోట అంతా చీకటిమయం అవుతుంది.
45.నమ్మకం అంటే.. మాటల్లో వినబడడం కాదు.. చేతల్లో చూపించడం..
ఇది కూడా చదవండి :-