Top 10 Telugu Movies 2019 – తప్పక చూడాల్సిన సినిమాలు

0
Top 10 Telugu Movies 2019

Top 10 Telugu Movies 2019 : మొదటగా టాప్ టెన్ కు లిస్టులో చేరని ఓ రెండు మంచి సినిమాల గురించి మీకు తెలియజేస్తున్నాను. అవి 1 సైరా 2 మహర్షి. ఎందుకు ఈ రెండు సినిమాలు టాప్ టెన్ లో మేము పెట్టలేదు అంటే కథలో యునిక్యూ, ప్లెజెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ లేకపోవడం. కానీ ప్రేక్షకులు ఈ రెండు సినిమాలు ఎందుకు టాప్ టెన్ లో లేవని అడుగతారని ముందుగానే చెప్తున్నాను. రెండు సినిమాలు గుడ్, చాలా బాగున్నాయి.

మొదటగా సైరా లో చాలా రోజుల తర్వాత చిరంజీవి నటన చాలా బాగుంది. ఇక మహర్షి లో సీఎంగా మహేష్ బాబు పాత్ర అందరూ మెచ్చుకునేలా ఉంది.రెండు సినిమాలు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఉన్నాయి. అయితే ఇంత మంచి సినిమాల్లో కొద్దిగా ప్రజెంటేషన్ డైల్యూట్ అయింది. రెండు సినిమాలు కూడా నోటీసబుల్ సినిమాలే అందుకే రెండు సినిమాలను ప్రత్యేకంగా టాప్ 10.5 ర్యాంకు ను మొదట్లోనే తెలియజేస్తున్నాం.

Best telugu movies 2019 : చాలా సింపుల్ కాన్సెప్ట్, మరియు చాలా తక్కువ బడ్జెట్ తో ఒక మంచి డిఫరెంట్ స్టోరీతో సినిమా తీయడం జరిగింది. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి టాక్ తో సీరియస్ గా, హిల్లరియస్ గా తీసుకురావడం జరిగింది.ఈ సినిమాలో నటించిన హీరో ఎవరో కాదు బాహుబలి సినిమాలో ప్రభాస్ ఒకరి తలను నరికేస్తాడు అతనే రాకేష్.
ఈ సినిమా కొద్దిగా కైండ్ ఆఫ్ కామెడీ అని గుర్తు చేస్తుంది.

9.గ్యాంగ్ లీడర్: ఈ మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఓవర్సీస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు పెద్దగా ప్రిఫరెన్స్ ఇవ్వలేదు.ఈ సినిమాలో డైరెక్టర్ విక్రమ్ కుమార్ బ్రిలియంట్ ని, హీరో నాని సూపర్ పర్ఫార్మెన్స్ ని అప్రిషియేట్ చేయాలి. సినిమా మొత్తంలో ఎలాంటి విషయాన్ని కూడా ఓవర్ గా తీయకుండా అన్నీ సమపాళ్లలో అందించారు. లేడీస్ కు పెద్ద పీట వేసి, లేడీ క్యారెక్టర్ బాగా ప్రెజెంట్ చేసిన సినిమా ఇది.

8.చిత్రలహరి: సింపుల్, కూల్, కామ్ గోయింగ్ సినిమా.ధియేటర్ లో కూర్చుని సినిమా ఎండింగ్ వరకు చూసి ఒక మంచి సినిమా చూశాం అనే ఫీలింగ్ కలుగుతుంది. సాయిధరమ్ తేజ్ క్యారెక్టర్ కానీ, ఆయన పెర్ఫార్మెన్స్ కానీ, సునీల్ కామెడీ ఇలా అన్నీ కలిపి సినిమా చూడడానికి చాలా బాగుంది.పాటలు బాగున్నాయి.ఇలాంటి సినిమా డెఫినెట్ గా ఎంజాయ్ చేసే కథ తో ఉంది.

7.ఫన్ అండ్ ఫ్రస్టేషన్ F2: 2019లో మంచి బిగ్గెస్ట్ మూవీ ఎఫ్2.ఇందులో విక్టరీ వెంకటేష్ ఫర్ఫార్మెన్స్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. సినిమా మొదటి పార్ట్ అంతా కూడా హిల్లరియస్ గా, సీరియస్ గా సాగింది. ఇక సినిమా సెకండ్ పార్ట్ లో కామెడీ కొంత మందికి నచ్చింది, కొంత మందికి నచ్చలేదు.అయితే ఓవరాల్ గా ప్రేక్షకులందరినీ సూపర్ గా నవ్వించి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ గా నిలిచింది.

6. జార్జి రెడ్డి:  అప్పటి ఆంధ్రప్రదేశ్లో పేరు పొందిన ఉస్మానియా యూనివర్సిటీ లో జరిగిన కొన్ని రియల్ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీయడం జరిగింది. ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసిన ఒక మంచి బయోపిక్ జార్జి రెడ్డి. ఫెంటాస్టిక్ సూపర్ పర్ఫార్మెన్స్ సినిమా. ప్రజెంటేషన్ అంతా కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. ఉస్మానియా స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి ని చాలా బాగా ప్రెజెంట్ చేశారు.

5. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ: ప్రేక్షకులందరినీ ఎంతో క్యూరియాసిటీ తో సినిమా యొక్క డైరెక్షన్ కళ్ళకు కట్టినట్లుగా తీయడం జరిగింది. డైలాగ్స్, మ్యూజిక్, కామెడీ, స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులు వీటన్నింటికీ అట్రాక్ట్ అయ్యారు. చిన్న సినిమా అయినప్పటికీ మంచి సబ్జెక్టు, యునిక్యూ స్టోరీ ఈ సినిమాకు మంచి విజయాన్ని అందించాయి.

4. మత్తు వదలరా : ఈ సినిమా ప్రేక్షకులందరికీ గొప్ప షాక్ ఇచ్చింది. లో – బడ్జెట్ మూవీ అయినప్పటికీ ఈ సినిమా యొక్క ప్రజెంటేషన్, స్క్రీన్ ప్లే అందరికీ చాలా బాగా నచ్చింది. హిల్లరి యస్ ఫన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేసే బయటకు వచ్చారు. ఇలాంటి యూనిక్ ప్రజెంటేషన్ ని డిఫరెంట్ గా మనకు ప్రజెంట్ చేయడం జరిగింది. అందుకే సినిమా విమర్శకులు ఈ సినిమాని బాగా అప్రిషియేట్ చేశారు. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు.

3. బ్రోచేవారెవరురా: మంచి సింపుల్ స్టోరీ తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీతో కనెక్టెడ్ క్యారెక్టర్స్ తో వచ్చింది ఈ సినిమా. డిఫరెంట్ గా ఈ సినిమా స్క్రీన్ప్లే పరంగా, పర్ఫార్మెన్స్ పరంగానూ మంచి టాక్ తెచ్చుకుంది.  శ్రీ విష్ణు యొక్క సన్నివేశాలన్నీ హిలేరియస్గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే అంతా చాలా కొత్తగా ఉన్నది. మొత్తంగా చూస్తే ఈ సినిమా ను చూసినప్పుడు ఒక మంచి pleasant స్టోరీ అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమా చూసామని ఫీలింగ్ వస్తుంది. తెలుగు లో కూడా ఇలాంటి సినిమా వచ్చిందా అని ఆశ్చర్యపోయేలా తీశారు.

2. మల్లేశం: మల్లేశం గారు ఎవరో ,ఆయన వీవింగ్ మెషీన్ కనిపెట్టడానికి కారణం ఏమిటి? అసలేం జరిగింది? అసలు ఆయన మిషన్ ఎలా కనిపెట్టాడు? మల్లేశం గారిని నోటీస్ చేసి జనాలు అందరికీ పరిచయం చేసేలా ఉన్నది ఈ మల్లేశం సినిమా.సినిమాలో ఎక్కడా గాని అన్వాంటెడ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని టచ్ చేయకుండా తీయడం జరిగింది.మల్లేశం గారి స్టోరీని చాలా సిన్సియర్ గా మన ముందుకు తీసుకురావడం గొప్ప విషయం. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా ఆన్లైన్ ఛానల్ లోనూ ఆన్లైన్లో నూ చూసినవాళ్లు థియేటర్లో చూడకుండా ఎంత మిస్ చేశామని ఫీలయ్యారు.మల్లేశం లాంటి సినిమాలను మనం తప్పకుండా థియేటర్లో కూర్చుని చూస్తే వీటిని ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది. ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీస్ గురించి వచ్చే సినిమాలు మనం ముందు ముందు ఇంకా చాలా చూడబోతున్నాం. అందుకే మేము మల్లేశం సినిమా ని రికగ్నిషన్ చేస్తూ దీన్ని టాప్ 2లో ఉంచడం జరిగింది.

1. జెర్సీ: వన్ ఆఫ్ ద మోస్ట్ అప్రిషియేట్ బెస్ట్ మూవీ జెర్సీ. సినిమా స్టోరీ మరియు నాని ఎక్స్ట్రాడినరీ ఫర్ఫార్మెన్స్ వల్ల ఇది టాప్ వన్ లో ఉంది.ఈ సినిమాని థియేటర్ లో చూసినప్పుడు సినిమా చూసే ప్రతి ఒక్కరూ నాని మరియు నాని క్యారెక్టర్ని ఫీల్ అవుతారు. ఫెంటాస్టిక్ బిగినింగ్ మరియు ఫెంటాస్టిక్ ఎండింగ్ లో బ్రహ్మాండంగా తీశారు. జెర్సీ లో రైల్వే స్టేషన్ సీను ఇప్పటికీ కళ్ళకు కట్టినట్లు ఉంటుంది. నాని పర్ఫార్మెన్స్ ఇందులో ఎక్సలెంట్ గా ఉంది. ఇంకా 2020 లో ఇలాంటి బెస్ట్ మూవీస్ మరెన్నో చూడాలని కోరుకుంటున్నాను. ఇది టాప్ టెన్ లిస్ట్.

2019లో కొన్ని కొత్త సినిమాలు కమర్షియల్ గా ఆడకపోయినా కొన్ని మంచి సినిమాలు కొంచెం అటు ఇటు ఆడకపోయినా సినిమా బాగా ఉంది బాగా తీశారు అని నిర్ణయం చేసిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. ఇలాంటి సినిమాల్ని మనం ఒకసారి అప్రిషియేట్ చేద్దాం.అవి

1.సాహో
2.కథానాయకుడు
3. డియర్ కామ్రేడ్

2019 బెస్ట్ రీమేక్ మూవీస్:-
1. ఓ బేబీ
2. పలక్ నామ దాస్
3. ఎవరు
4 .రాక్షసుడు
5.అర్జున్ సురవరం

స్ట్రీమింగ్ సర్వీసెస్ గురించి ఎదురు చూడకుండా ప్రేక్షకులందరూ థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసి వాటిని ఎంకరేజ్ చేసినట్లు అయితే ప్రేక్షకులు కోరుకునే మంచి మంచి సినిమాలు మరెన్నో రాబోయే కాలంలో సినీ అభిమానులకు వినోదాన్ని పంచబోతున్నాయి. ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లైతే ఇతరులకు కూడా షేర్ చెయ్యగలరు.

మరిన్ని లింక్స్ మీకోసం :

  1. కరోనా ఎఫెక్ట్ తో ” ఆ ” వీడియోల సైట్లకు పెరిగిన డిమాండ్ !!
  2. కరోనా నిర్ధారణకు కిట్ – భారత మహిళ తొలి గెలుపు