మీ కళ్ళ క్రింద ఎంత నల్లగా ఉన్న సరే 7 రోజులలో ఇలా చేయండి చాలు పూర్తిగా పోతాయ్

0
కళ్ళ కింద నలుపు పోవాలంటే ఏం చేయాలి
కళ్ళ కింద నలుపు పోవాలంటే ఏం చేయాలి

అందమైన మీ ముఖంలో కళ్ళ కింద నల్లటి చారలు ఉన్నాయా?
అయితే ఆ నల్లటి చారలు 7 రోజులలో తొలగించుకోండి.

ప్రస్తుత రోజుల్లో ఒబేసిటీ సమస్యతో బాధపడుతున్న వారికి, అందమైన ముఖం కలిగిన ఆడవారిలో కళ్ళ కింది నల్లటి చారలు అసహ్యంగా దర్శనమిస్తుంటాయి. మరి కొంత మంది బరువు తక్కువగా ఉన్న ఆడవారిలో కూడా కళ్ళ కింద నల్లటి చారలు వస్తూ ఉంటాయి. వీటి వల్ల వారి యొక్క ముఖం అందవిహీనంగా మారుతుంది.

ఇందుకోసం మీరు ఒక పదార్థాన్ని తయారు చేసుకుని ఏడు రోజులు దీన్ని వాడినట్లయితే ఆ నల్లటి చారలు తొలగించుకోవచ్చు.

కావలసిన పదార్థాలు:-

మెడికల్ షాప్ లో దొరికే స్వచ్ఛమైన గ్లిజరిన్ మరియు
విటమిన్ E క్యాప్సిల్స్.

ఈ గ్లిజరిన్ ని అర చెంచా తీసుకుని ఒక కప్పు లో వేసుకోవాలి. ఇందులోకి ఒక విటమిన్ E క్యాప్సిల్ వేసుకోవాలి. ఈ రెండింటినీ మిశ్రమంగా మాదే అంతవరకు కప్పులో బాగా కలియతిప్పాలి.

ఈ రెండూ కలిసిపోయి బాగా మిశ్రమంగా తయారు అయిన తర్వాత, దీనిని గాలి దూరని గాజు సీసాలో భద్రపరుచుకుని ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమం మిగిలిపోతే ఫ్రిజ్ లో కూడా ఉంచుకొని వాడుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని కళ్లచుట్టూ రాసుకోవాలి.

ఈ మిశ్రమంతో కళ్ళ చుట్టూ మసాజ్ లాగా చేయాలి. అయితే ఎట్టి పరిస్థితిలో కళ్ళకు మాత్రం తగలనివ్వకూడదు.

ప్రతిరోజు రాత్రిపూట రాసుకోవాలి. నిద్రపోయే ముందు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. ఇలా వరుసగా ఏడు రోజులు చేస్తే తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. మీ కళ్ళ కింద నల్లటి చారలు తొలగిపోతాయి.

ఇది కూడా చదవండి :- 4 రోజుల్లో నరాల బలహీనత, వాత రోగాలు పూర్తిగా తగ్గిపోతాయి