క్యారెట్ వల్ల ఉపయోగాలు ! క్యారెట్ వాడడం వలన ఎలాంటి ప్రయోజనం పొందగలం !

0
క్యారెట్ వల్ల ఉపయోగాలు

క్యారెట్ వల్ల ఉపయోగాలు | Uses Of Carrot In Telugu

క్యారెట్ వల్ల ఉపయోగాలు :- క్యారెట్ అన్ని సీజన్లలో లభించే వెజిటేబుల్ ఇది. చాలామంది దీన్ని పచ్చిగా తినేందుకే ఇష్టపడతారు. కొందరు జ్యూస్ చేసుకుని మరీ తాగేస్తుంటారు. బిర్యానీ నుంచి సూప్స్, సలాడ్‌లు వరకు ప్రతి ఒక్కదానిలో క్యారెట్ ఉంటేనే అందమూ రుచి. కంటికి ఎంతో మేలు చేసే క్యారెట్‌ను రోజు తింటే ఇతర శరీర భాగాలకు కూడా ఎన్నో పోషకాలు అందుతాయి. క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య  ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

క్యారెట్ ప్రయోజనాలు | Benefits Of Carrot 

రోజూ మనం తీసుకునే కూరగాయలలో ఎన్నో విటమిన్లు మన శరీరానికి లభిస్తున్నయి,  దిని వల్లే మనం ఆరోగ్యంగా ఉండగల్గుతున్నాం. ముఖ్యంగా చెప్పాలంటే వాటిలో క్యారెట్‌ను మించింది మరొకటి లేదు. క్యారెట్‌లో ఎన్నో విటమిన్లతోపాటు మన జీవనాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్షణాలు పుష్కలంగా వున్నాయి.

విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం.

మితంగా ఉపయోగపడే పరిమాణములో క్యారెట్ విటమిన్ బి, సి, జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం చక్కటి సమతౌల్యాన్ని అద్భుతంగా ఇది ఇవ్వగలదు.

  • రోజూ ఓ క్యారెట్ తింటే కంటి చూపు  మెరుగవుతుంది
  • క్యారెట్ మన ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది, దీంతో మీరు యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది.
  • క్యారెట్‌లో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ చర్మ సమస్యలను నివారిస్తుంది.
  • దీనిలో ఉండే సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
  • తరచుగా క్యారెట్ తింటే జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
  • ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • క్యారెట్‌లో ఉండే విటమిన్లు, కార్బైడ్స్ మీ జట్టు పొడిబారకుండా చేస్తుంది.
  • తక్షణం శక్తిని అందించే వాటిలో క్యారెట్ ఒకటి. కాస్త అలసటగా అనిపించిననప్పుడు క్యారెట్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  • ఎముకలకు మరింత బలాన్ని, గట్టిదనాన్ని క్యారెట్ అందిస్తుంది
  • కొందరు బరువు తగ్గడానికి క్యారెట్ తినడం, వాటి జ్యూస్ తాగడం చేస్తుంటారు.
  • క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్-A శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి.
  • విటమిన్-ఎ లోపం వల్ల చర్మం, జుట్టు పొడిబారుతాయి. రోజు క్యారెట్ తింటే ఆ సమస్యలు దరిచేరవు.
  •  క్యారెట్‌లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్, లూటిన్‌లు గుండె వ్యాధులను నివారిస్తుంది.
  • క్యారెట్ రోజు తింటే.. లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు.
  •  క్యారెట్ చర్మాన్ని ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.
  • క్యారెట్‌లో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌, పిరిడాక్సిన్‌, థయామిన్‌ వంటివి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచుతాయి.
  •  కాలేయంలో కొవ్వులు పేరుకుపోకుండా క్యారెట్ ఉపయోగపడుతుంది.
  •  దంతాలు, చిగుళ్లకు క్యారెట్ మేలు చేస్తుంది.
  • క్యారెట్‌లో కాల్షియం, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ కూడా ఉంటాయి.
  • క్యారెట్‌లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది.
  •  క్యారెట్‌ను రోజు తీసుకుంటే బీపీ నియంత్రణలో ఉంటుంది.
  • క్యారెట్‌లో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ క్యాన్సర్‌పై పోరాడేందుకు ఉపయోగపడుతుంది.
  •  క్యారెట్లలో తక్కువ కేలరీలు ఉంటాయి. సుమారు 100 గ్రాముల క్యారెట్‌లో 40 కేలరీలు ఉంటాయి. అందువల్ల, వీటిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గవచ్చు.
  • క్యారెట్లలో ఫైబర్  కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇవి ఆరోగ్యకరమైన జీవక్రియను నిర్వహించడం, జీర్ణవ్యవస్థను మెరుగుపర్చడం వంటి వాటికి సహాయపడుతుంది.
  • శరీరంలోని చెడు కొవ్వు ను తగ్గించడానికి క్యారెట్లు సహాయపడతాయి. ఇది గుండె సబంధిత సమస్యలను దూరం చేయడానికి బాగా పనిచేస్తుంది.

క్యారెట్ రసం ప్రయోజనాలు | Carrot Juice Benefits In Telugu

  • అధిక పోషకమైనది. క్యారెట్ జ్యూస్‌లో కేలరీలు మరియు పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి, అయితే అనేక పోషకాలను ప్యాక్ చేస్తాయి.
  • కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది. .
  • క్యాన్సర్ వ్యతిరేక ప్రభావాలను అందిస్తుంది.
  • రక్తంలో చక్కెర నియంత్రణను మెరుగుపరుస్తుంది.
  • చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • గుండె ఆరోగ్యాన్ని పెంచడంలో సహయంచేస్తుంది.
  • మీ కాలేయాన్ని రక్షణగా ఉంటది.

క్యారెట్ జ్యూస్ తయారు చేయడం ఎలా| how to prepare carrot juice 

  • ముందుగా రెండు క్యారెట్లు తీసుకొని, ఆ క్యారెట్ నీ బాగా నీటి తో కడగాలి.
  • కడిగిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని జార్ లోకి వేసుకొని.
  • నున్నగా రసం వచ్చే లాగా చేసుకోవాలి ఇందులోకి కొంచెం తేనె కలిపి గ్రాండ్ పట్టాలి.
  • చివరిలో  కోధిగా చెక్కెర, పాలు వేసుకొని గ్రాండ్ చేసుకొని, ఈ జ్యూస్ ని ఒక గ్లాస్ లోకి తీసుకొని.
  • ఈ జ్యూస్ ని ఉదయం పూట లేదా సాయంత్రం పూట తీసుకోవాలి.

 ఇవి కూడా చదవండి :-