మన డబ్బు తింటూ మన కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టని బడా కంపెనీలు

0

Donations for corona in india

భారతీయులారా ఒక్క నిమిషం ఇది చదవండి. కరోనా మనకు రాకుండా ఏం చేయాలో అని నేను చెప్పడం లేదు.కరోనా వైరస్ వ్యాధి వచ్చినప్పుడు భారత దేశంలోని బడా బడా కంపెనీలు మన దేశానికి ఏం చేశాయో అని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను.ఈ ఆర్టికల్ పూర్తిగా చదివిన తర్వాత మీరు కొనే వస్తువులు ఏ కంపెనీలవి కొనాలో అనేది మీరే నిర్ణయించుకోవాలి. దయచేసి భారతీయులుగా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను.

చైనా నుండి భారతదేశానికి ప్రబలిన కరోనా వైరస్ వ్యాధిని నియంత్రణ చేయడానికి పెద్ద పెద్ద కంపెనీలు, సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఎవరెవరు ఎంత డబ్బులు విరాళంగా ఇచ్చారో తెలియజేస్తున్నాను.సామాన్య ప్రజలు తో పాటు సెలబ్రిటీ ల దగ్గర్నుంచి వారి యొక్క డబ్బులు అన్నీ కొల్లగొడుతున్న పెద్ద పెద్ద కంపెనీలు కరోనా వైరస్ తో పోరాటం చేయడానికి భారత దేశానికి ఎంత డబ్బులు విరాళంగా ఇచ్చినారో చూడండి.

  1. జొమాటో 0
  2. సబ్వే 0
  3. పిజ్జా హట్ 0
  4. డామినో 0
  5. మెక్ డోనాల్డ్ 0
  6. బర్గర్ కింగ్ 0
  7. KFC 0
  8. అమెజాన్ 0
  9. స్నాప్ డీల్ 0
  10. మంత్ర 0
  11. Flipkart 0

వంటి విదేశీ కంపెనీలు మన భారతీయులు కరోనా కు భయపడి చస్తున్నా వీళ్ళందరూ కనీసం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.మధ్యతరగతి వారి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకూ ఎంతోమంది ఎన్నో డబ్బులు ఈ కంపెనీల కోసం మనం ఖర్చు పెట్టాం.మీరు ఒకసారి ఆలోచించండి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ఇలాంటి పరిస్థితుల్లో కూడా కనీసం దయ, జాలి, కరుణ, మానవతా దృక్పథం అనేవి కూడా లేకుండా ఒక్క రూపాయి కూడా ప్రధానికి విరాళంగా ఇవ్వలేదు, కానీ వీరి వ్యాపారాలు మాత్రం దిగ్విజయంగా చేసుకుంటున్నాయి.అమెరికా లాంటి పెద్ద దేశాల్లో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించలేదు. వాళ్లు ఎందుకు ప్రకటించలేదు అంటే అమెరికాలో ఆరోగ్యం కంటే డబ్బు సంపాదన ముఖ్యం. వారికి ఆరోగ్య వ్యవస్థ కన్నా ఆర్థిక వ్యవస్థ చాలా ముఖ్యమైనది అందుకే వాళ్ళు పాటించలేదు.

కానీ భారత దేశం ముందు జాగ్రత్తగా, ముందుచూపుతో లాక్ డౌన్ ప్రకటించింది. ఎలాంటి వ్యాపారాలు జరుగక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది.ఇలాంటి పరిస్థితుల్లో మనం ఇంతవరకు మన అవసరాలకు ఖర్చుపెట్టిన మన డబ్బులు పెద్ద పెద్ద కంపెనీల అకౌంట్లోకి చేరిపోయాయి, కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక్క రూపాయి కూడా మనకు విరాళంగా ప్రకటించలేదు. కాబట్టి ఆలోచించండి ఏదైనా వస్తువు కొనేముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి.ఇలాంటి భయంకర పరిస్థితిలో కూడా వాళ్ళు విరాళం ఇవ్వలేదు. మనమెందుకు వారి వస్తువులను, ఉత్పత్తులు కొనాలి? విదేశీ కంపెనీలను బతికించాలి?

ప్రస్తుతం కుప్పకూలిపోయిన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొద్దిగానైనా మెరుగుపడాలంటే,ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి.మనం అందరూ ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇంట్లో ఉంటున్నాం కనుక ఇది మంచి సందర్భం. ఇప్పుడు బాగా ఆలోచించి స్వదేశీ ఉద్యమాన్ని తీసుకురావాలి అంటే మీరు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు. కేవలం స్వదేశీ వస్తువులు కొంటే చాలు మన దేశానికి ఎంతో మేలు చేసినట్లే. అది ఎలా అనేది చూద్దాం. మనం స్వదేశీ వస్తువులు కొన్నట్లయితే మనం ఇచ్చిన డబ్బులు మన దేశంలోనే మన దేశసంపద రూపంలో ఉంటుంది. ఎప్పుడైనా ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆయా పెద్ద కంపెనీలు మనదేశంలోనే ఖర్చుపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఉదాహరణకు టాటా, రిలయన్స్, విప్రో, ఎల్ఐసి వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే దాదాపు వందల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. అందుకే మనం స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలి స్వదేశీ వస్తువులను కొనే లాగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి.

భారత దేశ ప్రజల నుంచి కేవలం వందల కోట్ల రూపాయలు వ్యాపారం నిర్వహించిన మన స్వదేశీ కంపెనీలు వేల కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. కానీ ఇదే భారత దేశ ప్రజల నుంచి వేల కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహించి మన భారతీయులు కష్టంలో ఉన్నప్పుడు మన భారత దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయినా కూడా మన డబ్బులతో అభివృద్ధి చెందిన కొన్ని విదేశీ కంపెనీలు అమెజాన్,పెప్సీ, కోకో కోల, సోనీ, శాంసంగ్, ఒప్పో, వివో, కోల్గేట్, నెస్లే, pepsodent, క్లోజప్, ఫేస్బుక్ వంటి బడా సంస్థలు ఇంతవరకు విరాళాన్ని ప్రకటించలేదు!! దయచేసి ఆలోచించండి. స్వదేశీ వస్తువులను కొనండి. భారత దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడండి.దయచేసి ఈ సమాచారాన్ని ఇతరులకు షేర్ చేయండి.మీకు ఉపయోగపడే ఇతర లింక్స్.

  1. కరోనా నిర్ధారణకు కిట్ – భారత మహిళ తొలి గెలుపు
  2. మీకు జన్ధన్ అకౌంట్ ఉందా? అయితే మీరు డబ్బులు డ్రా చేయలేరు?