అల్లు అర్జున్ బర్త్ డే కానుక – పుష్ప సినిమా పోస్టర్ రిలీజ్

0

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా అభిమానులకు శుభవార్త. ఆయన నటిస్తున్న 20 వ చిత్రం ” పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్నది.

విశేషాలు:-
ఒకసారి ఈ సినిమా పోస్టర్లను గమనిస్తే , మొదటగా అల్లు అర్జున్ ను సోలో గా ఉన్న ఓ పోస్టర్ ను ఉదయం రిలీజ్ చేశారు.ఆ తర్వాత రిలీజ్ అయిన రెండో పోస్టర్ లో అల్లు అర్జున్ గంధపు చెక్కల పక్కన, పోలీసుల కాళ్ళ దగ్గర కూర్చుని ఉన్నాడు.


అల్లు అర్జున్ కాలికి ఆరవ వేలు : రెండో పోస్టర్ లో అల్లు అర్జున్ యొక్క ఎడమ కాలికి ఆరవ వేలు ఉంది. ఇది దర్శకుడు సుకుమార్ మాయాజాలమా? లేక పోస్టర్ డిజైనర్ పొరపాటా? అనే విషయం మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఇక అభిమానులే మో రెండు రకాలుగా చర్చించు కుంటున్నారు. పుష్ప సినిమాకు , అల్లు అర్జున్ కాలి ఆరవ వేలు కు ఏదైనా సంబంధం ఉందేమో అని కొంతమంది వాదన. అల్లు అర్జున్ ను గంధపు చెక్కల దొంగ గా డిజైన్ చేసిన పోస్టర్ డిజైనర్ పొరపాటు చేశాడని కొంతమంది అనుకుంటున్నారు. ఇంతవరకూ ఎప్పుడూ కూడా అల్లు అర్జున్ ఆరవ వేలు గురించి ఎవరూ మాట్లాడలేదు మరియు ఏ మీడియా కూడా ఈ విషయాన్ని చెప్ప లేదు.

ఒకవేళ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాలికి ఆరవ వేలు లక్కీ ఫింగర్ ఉన్నట్లు అల్లు అర్జున్ కు కూడా ఏమైనా లక్కీ ఫింగర్ ఉందేమో!! ఏది ఏమైనా అల్లు అర్జున్ కాలి ఆరవ వేలు గురించి సినిమా యూనిట్ వారు ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. పుష్ప సినిమా లో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లర్ గా తన పర్ పార్మెన్స్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.