Table of Contents
కంటి కింద నలుపు పోవడానికి | Dark Circles Under Eyes
కంటి కింద నలుపు పోవడానికి :- ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ల మార్పులు, జీవన శైలిలో మార్పులు.. ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి, ప్రారంభంలోనే వీటిని గుర్తించి తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలి.
లేదంటే కళ్ల కింద నల్లటి మచ్చలు అలాగే ఉండిపోవడంతోపాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. సౌందర్య ఉత్పత్తులను వాడటం ద్వారా వాటిని తగ్గించుకోవచ్చు, కానీ వాటిలోని రసాయనాలు హానికరం. ఈ వలయాలను తగ్గించడానికి సహజ మార్గాలు అనేకం అందుబాటులో ఉన్నాయి.
మనిషి అందానికి వన్నె తెచ్చేవి కళ్లు మాత్రమే, ఆ కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడటం ఇటీవల కాలంలో అధికమౌతున్న సమస్య. నిద్రలేమి కావచ్చు విపరీతమైన అలసట కావచ్చు పని కారణంగా మానసిక ఒత్తిడికావచ్చు.
కారణం ఏమైనప్పటికీ నల్లటి వలయాలు అందవికారంగా కన్పిస్తుంటాయి. వీటిని తగ్గించుకునేందుకు వివిధ రకాల క్రీమ్స్ రాయడం, ఐస్‌క్యూబ్స్ , ఖీరా వంటివి పెట్టుకోవడం చాలానే చేస్తుంటాం.
అయ్యితే బయట దొరికే క్రీంస్ వాడడం వలన ఉన్న అందమైన ముఖం ని కూడా పడుచేసుకొంటం, అందుకంటే మన ఇంటిలో ఉండే పదార్థాలతోనే how to remove dark circles at home naturally in Telugu మనకి ఉన్న సమస్యని మనం తిగ్గించుకోవచ్చు. హోంలో ఉండే వస్తువుల ద్వారా కొన్ని చిట్కాలు తెలుసుకొందo.
కంటి కింద నలుపు పోవాలంటే ఏం చేయాలి | How To Remove Dark Spots In Telugu
- మీరు రోజూ ఒక ముక్క పుచ్చకాయ తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి కింద నల్లటి వలయాలున్నవారు తింటే మరీ మంచిది. అలాగే న్లల్లటి వలయాలు కూడా పోతాయి.
- మరో ముఖ్యమైంది నల్ల ద్రాక్ష ఇందులో ఉండే ఒమేగా 3 లాంటివి డార్క్ సర్కిల్స్‌ను తగ్గిస్తాయి. విటమిన్ ఇ ఎక్కువగా ఉండే బాదం, పీనట్స్, పొద్దు తిరుగుడు గింజలు తినడం ద్వారా కూడా కంటి కింద వలయాలను తగ్గించుకోవచ్చు.
- మీరు తినే ఆహారంలో ఏదో రంగా ఆకుకూరల్ని చేరిస్తే..కంటి చూపు మెరుగు పడటంతో పాటు కంటి చుట్టూ ఉండే బ్లాక్ సర్కిల్స్ తగ్గిపోతాయి.
- నారింజలో ఉంటే విటమిన్ సి, విటమిన్ ఎ కారణం వలన కూడా డార్క్ సర్కిల్స్ పోగొట్టుకోవచ్చు.
- బీట్‌రూట్ తరచూ తినడం ద్వారా బెటాలిన్ యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డీటాక్సిఫై చేసి..కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మరీ ముఖ్యంగా కంటి కింద ఉండే బ్లాక్ సర్కిల్స్ దూరం చేసే లక్షణాల బీట్‌రూట్‌లో ఉన్నాయి.
కంటి కింద ముడతలు | Eye Wrinkles Remove
సాధారణంగా కొందరికి కళ్ల కింద ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, గంటలు తరబడి ఫోన్లు. ల్యాప్‌టాప్లు చూడడం వలన పోషకాల లోపం, నిద్రను నిర్లక్ష్యం చేయడం, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ల కింద ముడతలు వస్తుంటాయి.
ఈ ముడతలు అందాన్ని తగ్గించడంతో పాటు వయసు పైబడిన వారిలా చూపిస్తాయి. అందుకే ఈ ముడతలను నివారించుకునేందుకు ఖరీదైన క్రీములు, లోషన్లు కొనుగోలు చేసి వాడతారు.కానీ, ఇంట్లో remove eye wrinkles home remedies న్యాచురల్‌గానే కళ్ల కింద ఏర్పడిన ముడతలు రాకుండా చేసుకోవచ్చు.
- ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు నువ్వుల నూనెను కళ్ల కింది ముడతలపై మర్ధన చేసి నిద్రించాలి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తుంటే కళ్ల కింది ముడతలు పోయి చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది.
- ఆముదం, కొబ్బరి నూనెలు కూడా కంటి కింద ముడతలకు చెక్ పెడతాయి. కొబ్బరినూనెను నిద్రించే ముందు కళ్ల కింద రాయాలి. ఉదయాన్నే లేచి గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. దీని వల్ల కళ్ల కింద ముడతలు త్వరగా తగ్గిపోతాయి. చర్మంపై కొబ్బరి నూనెతో మర్ధన చేసుకుంటే చర్మం
మృదువుగా తయారవటంతో పాటు మచ్చలు తొలగిపోతాయి. - పైనాపిల్ నుంచి రసం తీసుకుని అందులో చిటికెడు పసుపు మరియు కొద్దిగా తేనె వేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేసి. పావు గంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తూ ఉంటే ముడతలు మటుమాయం అవుతాయి.
- దోసకాయ కూడా కళ్ల కింద ఏర్పడిన ముడతలను తగ్గించగలదు.దోసకాయ తొక్క మరియు లోపల ఉండే గింజలు తీసేసి .మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు వేసి కలిపి కళ్ల కింద అప్లై చేయాలి. పది, ఇరవై నిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేసినా మంచి ఫలితం ఉంటుంది.
కంటి కింద నలుపు రావడానికి కారణం ఏమిటి | What Is Cause Of Dark Circles Under Eyes
కళ్ల కింద, కంటి చుట్టూ ఉన్న చర్మంపై నల్లటి మచ్చలు లేదా వలయాలు రావడం, ప్రస్తుతం కాలంలో ఎంతోమందిని వేధిస్తోన్న సమస్య. ఎంత అందంగా ఉన్నా ఈ మచ్చలు అందాన్ని దెబ్బతీస్తున్నాయని నేటి యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది.
పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా సహజంగానే ఇవి ఏర్పడుతున్నాయి. ఈ బ్లాక్ స్పాట్స్‌తో మీరు వయసులో పెద్దవారిగా కనిపిస్తారు. ఫలితంగా నిరాశ నిస్పృహలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. మరి వీటిని తొలగించడానికి కొన్ని ఇంటి చిట్కాలుdark circle remover home tips తెలుసుకొందం.
అలర్జీ :- కళ్లు పొడిబారడం, కళ్ల అలెర్జీలు లాంటి కారణాల వల్ల నల్లటి వలయాలు ఏర్పడతాయి. మీ శరీరం హానికరమైన బ్యాక్టీరియాకు ప్రతిస్పందనగా హిస్టామిన్‌లను విడుదల చేస్తుంది. దురద, ఎరుపు, ఉబ్బిన కళ్లతో సహా అసౌకర్య లక్షణాలను కలిగించవచ్చు, అలర్జీలు మీ కళ్ల చుట్టూ ఉండే చర్మానికి దురదను కలిగిస్తాయి. ఇది డార్క్ సర్కిల్స్‌కు కారణమవుతుంది.
వయసు:- సహజ వృద్ధాప్యం మీ కళ్ల కింద ఏర్పడే నల్లటి మచ్చలకు గల మరోక కారణం. వయసు పెరిగే కొద్దీ చర్మం పలుచగా మారుతుంది, మీ శరీర స్థితిస్థాపకతను నిర్వహించడానికి అవసరమయ్యే కొవ్వులు, కొల్లాజెన్‌ను కోల్పోతారు. దీంతో చర్మం కింద ఉండే నలుపు రంగు రక్తనాళాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఫలితంగా ఆ ప్రాంతం వరకు నల్లగా మారుతుంది.
కంటి పై భారం :- టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్ వైపు ఎక్కువగా చూడటం వల్ల మీ కళ్లపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా మీ కళ్ల చుట్టూ ఉండే రక్తనాళాల విస్తరణకు కారణమవుతుంది, చివరకు నల్లగా మారుతుంది.
Dark Circle Removal Cream List
- The Moms Co.
- Mamaearth Bye Bye Dark Circles.
- RE’ EQUIL Under Eye Cream.
- MCaffeine Coffee Under Eye Cream with Free Eye Roller.
- O3+ Eye Circle Cream.
- The Derma Co 5% Caffeine Undereye Serum.
- Pilgrim Red Vine, Retinol & Vitamin C Under Eye Cream.
మీకు గాని కంటి కింద నలుపు పోవడానికి క్రీం కావాలి అనుకొంటే కింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆర్డర్ చేసుకొని పొందవచ్చు.
Dark Circle Removal Cream Online List
గమనిక :- ఇక్కడ ఇచ్చిన క్రీంలు మీరు ఉపయోగించే ముందుగా డాక్టర్ ని సంప్రదించండి.
ఇవి కూడా చదవండి :-
- బరువు తగ్గాలంటే ఏం చేయాలి ! బరువు పెరగడానికి కారణాలు !
- ఆయాసం పోవాలంటే ఎం చేయాలి ? ఆయాసం రావడానికి గల కారణం ఏమిటి !
- అలర్జీ తగ్గాలంటే ఎం చేయాలి ? అలర్జీ రావడానికి కారణం ఏమిటి !\
- జుట్టు పెరగాలంటే ఎం చేయాలి ? జుట్టు రాలిపోవడానికి కారణాలు ఏమిటి !