అలర్జీ తగ్గాలంటే ఎం చేయాలి ? అలర్జీ రావడానికి కారణం ఏమిటి !

0
అలర్జీ పోవాలంటే ఏం చేయాలి

అలర్జీ తగ్గాలంటే ఏం చేయాలి | What To Do Reduce Allergies 

అలర్జీ పోవాలంటే ఏం చేయాలి :- అలర్జీ అనేది వాతావరణంలో ఉన్న హాని చేయని అలర్జెన్స్ మీద రోగనిరోధక వ్యవస్థ దాడి చేసినపుడు అలర్జీ వస్తుంది. దీనివల్ల రోగ లక్షణాలు బయటపడతాయి.

ఇలాంటి లక్షణాలలో చర్మం ఎర్రగా కందిపోవడం, దద్దుర్లు, వాపు ఉంటాయి. మరీ ప్రమాదకరమైన కేసుల్లో వాంతులవడం, విరేచనాలవడం, ఊపిరాడకపోవడం శరీరానికి సరిపడని ఇంజెక్షన్ చేయించుకున్నప్పుడు రియాక్షన్స్ కలగవచ్చు.

ప్రాణమున్న ప్రతిజీవికి ఏదో ఒక అంశం అలర్జీ కలిగించక మానదు. మనిషిలో తీసుకునే ఆహారం వల్ల కావచ్చు, పీల్చే గాలి వల్ల కావచ్చు లేదా మనం వాడే మందుల వల్ల అయినా కావచ్చు. మన రోగనిరోధక వ్యవస్థ అతిగా స్పందించి అలర్జీకి దారి తీస్తుంది.

అలర్జీపై అలసత్వం కూడదని, కొన్ని అలర్జీలు ప్రాణాంతకం కావచ్చు, అలర్జీ తగ్గాలంటే వివిధ చిట్కాలు తెలుసుకొందం.

అలర్జీ తగ్గాలంటే ఏం చేయాలి |  What To Do Reduce Allergies

ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా స్కిన్ అలెర్జీలతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. దీంతో పాటు దోమలు కుట్టినప్పుడు కూడా దద్దుర్లు వస్తుంటాయి. అలా కాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాల్సిందే.

కొన్ని సార్లు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్కిన్ అలెర్జీలు ఇబ్బందులు పెడుతుంటాయి. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. వారిని కూడా దోమలు వదలవు. అలాంటప్పుడు వారికి ఎన్ని లోషన్స్ రాసినా, ఇంట్లో దోమలు కుట్టకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు ఇంటి చిట్కాలను తెలుసుకొందం.

  • డ‌స్ట్ అల‌ర్జీని నివారించడంలో తేనె అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.అందువ‌ల్ల‌, డ‌స్ట్ అల‌ర్జీ ఉన్న వారు ప్ర‌తి రోజు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో తేనె మిక్స్ సేవించ‌డం లేదా డైరెక్ట్‌గా తేనెను ఒక స్పూన్ చ‌ప్పున తీసుకోవ‌డం చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.
  •  డ‌స్ట్ అల‌ర్జీని దూరంగా చేయ‌డంలో స్పైసీ ఫుడ్స్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.కాబ‌ట్టి, డ‌స్ట్ అల‌ర్జీ ఉన్న వారు.అల్లం, వెల్లుల్లి, న‌ల్ల మిరియాలు, ఉల్లి, చిల్లీ పెప్పర్స్, ల‌వంగాలు వంటివి త‌ర‌చూ తీసుకుంటూ ఉండాలి.
  • డ‌స్ట్ అల‌ర్జీ ఉన్న వారు పండ్లు ముఖ్యంగా క‌మలా, జామ‌, బొప్పాయి, స్ట్రాబెర్రీ, యాపిల్, కివీ వంటి ఎక్కువ‌గా తీసుకోవాలి.
  • ప‌సుపు కూడా డ‌స్ట్ అల‌ర్జీని దూరం చేయ‌గ‌ల‌దు. కాబ‌ట్టి, ఒక గ్లాస్ నీటిను ప‌సుపు బాగా మ‌రిగించి. గోరు వెచ్చ‌గా అయిన త‌ర్వాత తీసుకోవాలి. ఇలా తీసుకున్నా డ‌స్ట్ అల‌ర్జీ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.డ‌స్ట్ అల‌ర్జీ ఉన్న వారు వాట‌ర్‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి.
  • అల‌ర్జీ ఉన్న చోట అరటిపండు తొక్క తీసుకొని అక్కడ రుద్డం వలన దురద అనేది పోతుంది.
  • అల‌ర్జీని ఉన్న వారు వేపాకు నీటితో స్నానం చేయాలి.
  • అల‌ర్జీని ఉన్న వారు వేపాకు పేస్ట్ లాగా చేసుకొని శారిరని పుసుకోవడం వలన దురద అనేది పోతుంది.
  • పుదిన ఆకుల నిరు తగినకుడా అల‌ర్జీ అనేది పోతుంది.
  • ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఆపిల్ వేసుకొని అందులోకి కోధిగా వెనిగర్, తేనె వేసుకొని మూడు కలుపుకొని త్రాగడం వలన అల‌ర్జీ తగ్గుతుంది.
  • తేనె నీటిలో కలుపుకొని ప్రతి త్రాగడం వలన అల‌ర్జీ తగ్గడానికి సహాయచేస్తుంది.
  • అల‌ర్జీని తగ్గించడానికి పసుపు, మిరియాలు సహాయపడుతాయి.
  • వారానికి రెండు సార్లు కలబంద రసం త్రాగడం వలన అల‌ర్జీని తగ్గించవచ్చు.

అల‌ర్జీని లక్షణాలు | Allergic Symptoms

 ఫుడ్ అలర్జీ లక్షణాలు : మనం తీసుకునే కొన్ని ఆహార పదార్ధాలు ఫుడ్‌ అలర్జీలకు దారితీస్తాయి. సాధారణంగా ఫుడ్‌ అలర్జీలు గుడ్లు, పాలు, వేరుశెనగ, చేపలు, రొయ్యలు, పీతలు, సోయా, కొన్ని రకాల నట్స్‌ఆక్రోట్స్, బాదం, బ్రెజిల్‌ నట్స్‌, గోధుమ వంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తాయి.

శరీరానికి ఈ పదార్థాలు సరిపడకపోతే దురద, చర్మంపై దద్దుర్లు, వాంతులు లేదా కడుపు తిమ్మిర్లు, శ్వాస తీసుకోలేకపోవటం, గురక, దగ్గు, గొంతునొప్పి, పల్స్‌ పడిపోవడం, చర్మం నీలం రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఫుడ్‌ అలర్జీల నిర్ధారణకు చర్మ పరీక్షతో పాటు రక్త పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది.

డస్ట్ అలర్జీ లక్షణాలు : సాధారణంగా డస్ట్‌ అలర్జీ అనేది దుమ్ము, ధూళి వల్ల, వాటిలోని సూక్ష్మజీవుల వల్ల సంభవిస్తుంది. వీటిని డస్ట్‌ మైట్స్‌ అంటారు. ఈ డస్ట్‌ మైట్స్‌ మనుషుల నుంచి రాలిన చర్మ మృతకణాలను తింటూ ఇంట్లో దుమ్ము, ధూళికి కారణమవుతాయి.

ఇవి శ్వాస తీసుకునే క్రమంలో శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళాల వాపుకు కారణమవుతాయి. దీనివల్ల తుమ్ములు, ముక్కు కారడం, కంటిలో దురద, కళ్ళలో నుంచి జిగట నీరు, ఒళ్లంతా దురద, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటె  అలర్జీ ఉన్నటే.

స్కిన్‌ అలర్జీ లక్షణాలు : ఈ రకమైన అలర్జీ సంభవించటానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, మందులు, అంటువ్యాధులు వంటి పలు కారణాల చేత ఇవి సంభవిస్తాయి. పెంపుడు జంతువులు, రసాయనాలు, సబ్బులు, నూతన వస్త్రాలు, చర్మ పరిరక్షక క్రీమ్‌లు వంటివి చర్మ అలర్జీలకు ప్రధాన కారకాలు.

స్కిన్‌ అలర్జీ అంటే కేవలం చర్మ సంబంధిత అలర్జీ అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే ఈ రకమైన అలర్జీకి ముఖ్య కారణం రోగనిరోధక వ్యవస్థలోని లోపాలే అన్న  విషయం వారికి తెలీదు. స్కిన్‌ అలర్జీతో బాధపడే వారిలో విపరీతమైన దురద, చర్మంపై దద్దుర్లు, పొడి చర్మం, మంట, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ముక్కు అలర్జీ లక్షణాలు :- దీన్నే ‘హైపర్‌ సెన్సిటివిటీ’ లేదా అలర్జీ అంటారు. గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు ఒకటో, రెండో తుమ్ములు రావడం సహజం. అయితే అలర్జీతో బాధపడేవారికి ఇక అదేపనిగా వరసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దీనినే ముక్కు అలర్జీ  అంటారు.

గొంతు అలర్జీ లక్షణాలు :- ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన అలర్జీలన్నీ ఈ కోవలోకొస్తాయి. ముక్కు నుంచి నీరు కారటం, తుమ్ములు, ముక్కు దిబ్బెడ, కళ్లలోంచి నీరు కారటం, కళ్లు ఎర్రబడటం, ముక్కు, గొంతు, కళ్లు, చెవుల్లో దురద ఈ అలర్జీ ప్రధాన లక్షణాలు.

అలర్జీ తగ్గడానికి ఏమి తినాలి | What To Eat To Reduce Allergies

అలర్జీ రాకుండా ఉండడానికి తినవలసిన ఆహార పదార్థాలు.

  • తాజా కూరగాయలు తినాలి
  • తాజా పండ్లు తినాలి.
  • తాజా పండ్లతో ఫ్రెష్ జ్యూస్ చేసుకొని స్వీకరించాలి.
  •  నూనె లేకుండా తయారుచేసిన ఆహార పద్ధార్థాలు తినాలి.

అలర్జీ తగ్గడానికి ఏమి తినకూడదు |  What Not To Eat To Reduce Allergies

  • పాలు
  • గుడ్లు
  • వేరుసెనగ
  • గింజలు ఆక్రోట్, బాదం, పైన్ గింజలు, బ్రెజిల్ నట్స్, పెకాన్సు వంటివి.
  • నువ్వులు
  • చేపలు
  • షెల్ ఫిష్, రొయ్యలు, పీతలు వంటివి.
  • నూనె పదార్థాలతో తయారుచేసినవి తినరాదు.
  • బయట ఫుడ్ తినరాదు.

అలర్జీ టాబ్లెట్ | Allergies Tablets

  • Cetirizine, Zyrtec, Zyrtec అలెర్జీ
  • డెస్లోరాటాడిన్, క్లారినెక్స్
  • ఫెక్సోఫెనాడిన్, అల్లెగ్రా, అల్లెగ్రా అలెర్జీ
  • లెవోసెటిరిజైన్, Xyzal, Xyzal అలెర్జీ
  • లోరాటాడిన్, అలావర్ట్, క్లారిటిన్

గమనిక :- ఈ టాబ్లెట్స్ మీరు ఉపయోగించే ముందు డాక్టర్ ని సంప్రదించండి.

ఇవి కూడా చదవండి :-