మైగ్రేన్ తలనెప్పులుండే వాళ్లు ప్రశాంతంగా చీకటి గదిలో చల్లని వాతావరణంలో సేదదీరడంతో పాటు, సుమా ట్రిప్టాన్ ,ఆమ్లో ట్రిప్టాన్ , తోపాటు ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ ని చికిత్సకోసమూ,తరచూ ఎటాక్స్ రాకుండా ప్రొఫైలాక్టిక్ గానూ కూడా వాడవచ్చు.
మైగ్రేన్ తల నొప్పి తగ్గడానికి మన ఇంటి పదార్థాలతో నే మనం తగించుకోవచ్చు :
మైగ్రెయిన్ను తగ్గించే హోం రెమెడీస్
తలకు ఒక వైపు విపరీతమైన నొప్పి వచ్చే మైగ్రెయిన్ కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొందరిలో ఇది పార్శ్వ భాగానికే పరిమితమైతే.. మరికొందరిలో తలమొత్తం నొప్పి వస్తుంది. కళ్లు మూతలు పడుతుండటం, ముక్కు చుట్టూ ఏదో కదులుతున్నట్లు అనిపించడం, తలమీద సుత్తితో బాదుతున్నట్లు అనిపించడం మైగ్రెయిన్ లక్షణాలు.
ఈ బాధ నుంచి ఉపశమనానికి కొందరు పెయిన్ కిల్లర్లు వాడుతుంటారు. నొప్పి నివారణ మాత్రలు, టీ తాగడం వల్ల ఫలితం కనిపిస్తుంది. కానీ.. రెగ్యులర్‌గా టాబ్లెట్లు వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మైగ్రెయిన్ కారణంగా వచ్చే తలనొప్పిని హోం రెమెడీస్ ద్వారా నివారించవచ్చు.
ద్రాక్ష రసం: తాజా ద్రాక్ష పళ్లను తీసుకుని జ్యూస్ చేసి తాగడం వల్ల మైగ్రెయిన్ నుంచి ఉపశమనం పొందొచ్చు. ఈ జ్యూస్‌ను రోజుకు రెండుసార్లు తాగాలి.
అల్లం: ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడే అల్లం మైగ్రెయిన్ నొప్పిని కూడా తగ్గిస్తుంది. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపిగానీ లేదంటే.. టీ లో అల్లం కలిపిగానీ తీసుకోవడం వల్ల మైగ్రెయిన్ తగ్గుతుంది.
దాల్చిన చెక్క ఆహారానికి రుచిని ఇవ్వడమే కాదు.. మైగ్రెయిన్ తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాయాలి. 30 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొద్ది మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల మైగ్రెయిన్ నియంత్రణలో ఉంటుంది. కానీ అధిక మొత్తంలో కాఫీ, టీ తాగేవారికి ఇది వర్తించకపోగా.. అంతకు ముందు నొప్పి లేకున్నా కెఫిన్ తీసుకున్న తర్వాత నొప్పి ఎక్కువ అవుతుంది.
వెలుతురు ఎక్కువగా వచ్చే చోట కూర్చోవడం వల్ల కూడా అసౌకర్యానికి కారణం అవుతుంది. ఫలితంగా నొప్పి రావడం మొదలవుతుంది. కాబట్టి కాసేపు లైట్లు ఆపేసి, కిటికీలు మూసేస్తే సరి.
మైగ్రెయిన్ నొప్పిని తగ్గించే తేలిక పద్ధతి మసాజ్ చేయడం.
మెడ, తల భాగాన్ని నొక్కుతూ మెల్లగా మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి రిలాక్స్ అవుతాం. నొప్పి కూడా దూరమవుతుంది.
మైగ్రేన్ రాకుండా తీసుకోవలసిన జాగ్రతలు :
- మానసిక ఆందోళనలు తగ్గించాలి.
- అతిగా ఆలోచనలు చేయకూడదు.
- మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. దీనికోసం యోగా, ప్రాణాయామం చేయాలి.ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లక్షిస్తుంది.
- తలకు నూనెతో మసాజ్ చేసుకుంటే తలలోని నరాలు సేదతీరుతాయి.
- తలనొప్పి వచ్చినప్పుడు ప్రశాంత వాతావరణంలో, కాంతి లేనిచోట నిశ్శబ్దంగా ఉన్నచోట పడుకోబెట్టాలి.
పార్శ్వనొప్పి ఎప్పుడన్నా ఓసారి వేధిస్తుంటే, ఆ నొప్పి వచ్చినప్పుడు సాధారణ పెయిన్ కిల్లర్లు తీసుకుంటే సరిపోతుంది. వీటితో నొప్పి వెంటనే తగ్గుతుంది. అలా కాకుండా నొప్పి మరీ తరచుగా వస్తూ తీవ్రంగా వేధిస్తుంటే మాత్రం.. కొంతకాలం పాటు కొన్ని ప్రత్యేక తరహా మందులు తీసుకోవటంతో ఫలితం ఉంటుంది. ఈ ప్రత్యేక చికిత్సకు చాలా రకాల మందులున్నాయి. వీటిని వ్యక్తి లావు-సన్నం, స్త్రీలు-పురుషులు, పిల్లలు-వృద్ధులు… ఇలా రకరకాల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఇస్తారు. తలనొప్పి మరీ తీవ్రంగా రోజువారీ పనిని దెబ్బతీస్తూ, తరచూ వేధిస్తుంటేనే ఈ తరహా ప్రత్యేక మందులు ఇస్తారు. రెండు మూడు నెలలకోసారి వస్తుంటే.. అది వచ్చినప్పుడు సాధారణ పెయిన్ కిల్లర్లు సరిపోతాయి. నెలకు రెండు మూడుసార్లకంటే ఎక్కువగా వస్తున్నా, ఒక్కసారే వచ్చి మరీ ఎక్కువసేపు వేధిస్తున్నా అప్పుడీ ప్రత్యేక మందుల గురించి ఆలోచించాల్సి ఉంటది.