స్కిన్ షైన్ క్రీం ఎలా వాడాలి ? ఉపయోగం ఏంటి ?

0
స్కిన్ షైన్ క్రీమ్ ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

Skinshine cream uses in telugu : స్కిన్‌షైన్ క్రీమ్ (Skinshine Cream) అనేది ట్రెటినోయిన్, హైడ్రోక్వినోన్ మరియు మొమెటాసోన్‌లను రసాయనాలు కలిగి ఉన్న ఔషధం. దీనిని CADILA కంపెనీ తయారు చేసింది. దీని వెల 137 రుపాయలు గా ఉంది.

Skinshine Cream వివరాలు – స్కిన్ షైన్ క్రీమ్ ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

మెలస్మా అనేది మీ చర్మంపై డార్క్, రంగు మారిన పాచెస్‌ని కలిగించే ఒక సాధారణ చర్మ సమస్య.ఇది సాధారణంగా మగవారి కంటే ఆడవారిలో కనిపిస్తుంది.స్కిన్‌షైన్ క్రీమ్ సాధారణంగా గర్భవతులు, గర్భనిరోధక మాత్రలు వాడితే, లేదా హార్మోన్ ఔషధం కారణంగా ఏర్పడే చర్మంలోని డార్క్ ప్యాచెస్‌ని తేలికగా తొలగించడం లో సహాయపడుతుంది. ఇ

ది రంగు పాలిపోయే చర్మంలో, ఆ ప్రక్రియను సమర్థవంతంగా ఆపివేస్తుంది. ఇది ముఖం యొక్క చర్మంపై మచ్చలు, రంగు మారిన పాచెస్ కనిపించే పరిస్థితి ని మెలస్మా అంటారు. దీని యొక్క చికిత్స కోసం ఉపయోగించబడుతుంది.

ఈ ఔషధం చర్మాన్ని ప్రకాశవంతం చేయడం ద్వారా మరియు చర్మం యొక్క పాచెస్, వాపు మరియు చికాకు కలిగించే రసాయనాల యొక్క చర్యను తగ్గించడం ద్వారా పనిచేస్తుంది.

ఈ మందుతో చికిత్స ప్రారంభించే ముందు ఈ ఔషధం మీకు సురక్షితమైనదా మరియు అలెర్జీ కారకమా? అని చెక్ చేయడానికి మీ వైద్యుడు ప్యాచ్ పరీక్ష చేస్తాడు.

ఒకవేళ మీరు ఈ క్రీం ఉపయోగిస్తున్నప్పుడు దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఏవైనా అలెర్జీలను అనుభవిస్తే, దానిని ఉపయోగించడం ఆపివేయండి. స్కిన్‌షైన్ క్రీమ్ కేవలం బాహ్య వినియోగం కోసం మాత్రమే.

స్కిన్ షైన్ క్రీమ్ ఎలా వాడాలి

స్కిన్ షైన్ క్రీమ్ ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు

అప్లై చేయడానికి ముందు ఆ ప్రాంతం శుభ్రం మరియు పొడిగా ఉంచాలి. మీ కళ్ళు, ముక్కు మరియు నోటి భాగం లో పూయరాదు. ఒకవేళ ఈ ప్రాంతాలలో పూస్తే, వెంటనే నీటితో శుభ్రం చేసుకోండి. ఈ స్కిన్‌షైన్ క్రీమ్ మీ చర్మాన్ని సూర్యరశ్మికి సున్నితంగా మార్చవచ్చు, కాబట్టి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ని కూడా ఉపయోగించండి.

స్కిన్ షైన్ క్రీమ్ ఎంతకాలం వాడాలి

మీ ముఖం పరిస్థితిని మెరుగుపరచడానికి కొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చు. సాధారణంగా దీనిని 6-8 వారాల పాటు వాడవచ్చు. ఇంతకంటే ఎక్కువ రోజులు వాడకూడదు. మీరు గర్భవతిగా ఉన్నట్లయితే లేదా తల్లిపాలు ఇస్తున్నట్లయితే మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే స్కిన్‌షైన్ క్రీమ్ (Skinshine Cream) వాడాలి

మూడు వారాల చికిత్స తర్వాత కూడా మీ సమస్యలను క్లియర్ చేయకపోతే మీ వైద్యుడికి తెలియజేయండి.

స్కిన్ షైన్ క్రీమ్ దుష్ప్రభావాలు

 1. అప్లై చేసిన చోట బర్నింగ్ లేదా స్టింగ్ సెన్సేషన్
 2. దురద మరియు పొడి చర్మం
 3. అప్లై చేసిన చోట చర్మం వాపు
 4. చర్మం మీద పొట్టు మరియు పొక్కులు
 5. చర్మం దద్దుర్లు
 6. చర్మం యొక్క రంగు మరియు ఆకృతిలో మార్పు
 7. చర్మంపై ఎర్రటి మచ్చలు
 8. చర్మం యొక్క ఫోటోసెన్సిటివిటీ వంటివి.

స్కిన్ షైన్ క్రీమ్ ఎవరు వాడాలి

ముఖ్యంగా దీనిని 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఉపయోగించరాదు.
మిగిలిన వారు నిరభ్యంతరంగా వాడవచ్చు.

ఓవర్ డోస్ :

Skinshine Cream ను డాక్టర్ సూచించిన మోతాదు కంటే ఎక్కువ తీసుకోరాదు.

గమనిక :- అంతర్జాలం లో మాకు దొరికిన సమాచారం ప్రకారం ఈ పోస్ట్ రాయడం జరిగింది. దయచేసి ఈ టాబ్లెట్ వాడటానికి ముందు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోండి.

ఇవి కూడా తెలుసుకోండి :-

 1. డోలో 650 టాబ్లెట్ ఎలా వాడాలి ? ఉపయోగాలేంటి ?
 2. హైఫెనాక్ పి టాబ్లెట్ ఉపయోగాలేంటి ? ఎందుకు వాడాలి ?
 3. అజిత్రోమైసిన్ 500 mg టాబ్లెట్ ఉపయోగాలు
 4. Pantop-D Capsule ఉపయోగాలు
 5. సిట్రజిన్ టాబ్లెట్ ఎందుకు వాడుతారు ? ఎలా వాడుతారు ?