రెడ్డి గోత్రాలు మరియు ఇంటి పేర్లు !

0
రెడ్డి గోత్రాలు

గోత్రం అంటే ఏమిటి ? | Gothram In Telugu

గోత్రం చరిత్ర ప్రకారం చాలా పురాతనమైనది. మనం దేవాలయంలోకి వెళ్ళినపుడు లేదా పూజలు జరిగే ప్రదేశాలకి హాజరు అయినపుడు గోత్రం తప్పని సరిగా అడుగుతారు. గోత్రం అడిగిన తర్వాతే పూజలు చేస్తారు. ఒక్కో కులం వారికి ఒక్కో గోత్రం ఉంటుంది. వారి గోత్రం బట్టే వారి పిల్లలకి కూడా వివాహం చేస్తారు.

హిందువులు అయితే  ఒక్కటే గోత్రం ఉంటె వారు వివాహం చేయరు, ఎందుకు అనగా ఒక్కటే గోత్రం ఉంటె వారు అన్నదమ్ములు వరుసు అవ్వడం వల్ల పెళ్లి చెయ్యరు. అదే ఒక్కటే కులంలోనే వేరు వేరు గోత్రం ఉంటె వివాహం చేస్తారు. గోత్రం వేరుగా ఉన్న కూడా వారికి మామ వరుసగా వస్తేనే వారు వివాహం చేస్తారు. లేకుంటే వివాహం చేయ్యరు.

రెడ్డి గోత్రాలు :- రెడ్డి కులంలో కొన్ని రకాల శాఖలు ఉన్నా రెడ్డి కులం అంతా ఒక్కటె. శాఖలు అనేవి కేవలం ప్రాంతాల పేర్లు మరియు వ్రుతికి సంబందిచినవి. రెడ్డి కులంలో దాదాపు పదివేల ఇంటి పేర్లు ఉన్నాయి. ఒకే ఇంటి పేరుతో వేరు వేరు ప్రాంతాల్లొ ఉన్నారు.

అయితే ఒకే వంశముకు సంబందించిన వాళ్ళే పలు ప్రాంతాలకు తరలి వెళ్ళి ఉంటారు. వేరు వేరు ఇంటి పేర్లు ఉన్నవారు ఒకే గోత్ర నామము కలిగి ఉన్నారు. వివిధ రాకముల గోత్రాలని మర్చుకోనారు. రెడ్డి గోత్రాలలో కొన్నింటిని తెలుసుకుందాం.

రెడ్డి గోత్రం మరియు ఇంటి పేర్లు | Reddy Gotra List With Surnames

  • వామనపాల గోత్రం :- కోణాల వారు, కర్రి, కావాలి,కైవల్యం, పరాగం, చిన్న రెడ్డి, వొగి రెడ్డి, నుడిగా.
  • చక్రపాల గోత్రం :- చెల్లవారు, నాళం, చిర్ల, చింత, శ్యామ, దేవరెడ్డి, ద్వారం పూడి.
  • రఘుమాల గోత్రం :- తాడివారు, రామారెడ్డి, తేతలి రెడ్డి, తమాలం పూడి.
  • పైడి పల గోత్రం :- పపువారు, పడాల, అంకి రెడ్డి, పులగం.
  • తమసాపాల :- వెలగలవారు, యిళ్ళ, జాగిరి, సబ్బెల్ల, సత్తి.
  • మహిపాల గోత్రం :- మేడపాటి వారు, కొవుర్వి, మల్లిడి.
  • శిరిపాల గోత్రం :- నల్లమిల్లివారు, నండ్ర, నాగిరెడ్డి.
  • శోభానపాల గోత్రం :- అల్లం వారు, ఆత్మకూరు.
  • కౌండిన్య :- గొలుగూవారు, గుడిమెట్ల, కట్తపు రెడ్డి.
  • ఆత్రేయ గోత్రం :- ఢంకా వారు, డామ.
  • కలికాల గోత్రం :- బేతిరెడ్డి వారు.

గమనిక :-  పైన పేర్కొన్న సమాచారం మాకి దొరికిన అంతర్జాలం Information ప్రకారం మీకు తెలియజేస్తున్నాం. ఇది కేవలం మీకు అవగాహనా కోసమే. ఈ టాపిక్ మీద ఎలాంటి సందేశాలు ఉన్న కామెంట్ పెట్టండి రిప్లై ఇస్తాం.

ఇవి కూడా చదవండి :-