144 కోట్లకు చేరిన భారతదేశ జనాభా.. నిజమా కాదా?

0
india papulation 2024 telugu

India Population 144 Crores Telugu

హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ఆర్టికల్ లో మనం  భారత దేశ జనాభా గురించి తెలుసుకుందాం.మన దేశంలో జనాభా గణన 2011లో జరిగింది. అప్పుడు ఇండియా యొక్క జనాభా 121 కోట్లు గా నమోదు అయింది. 2021లో కరోనా కారణంగా జనాభా గణన జరగలేదు. 2011 లో చైనా జనాభా పరంగా మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానంలో మన ఇండియా ఉంది.

ప్రస్తుతం ఇది మారింది. ప్రస్తుతం భారత జనాభా 144 కోట్లు అని ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (UNFPA) తన రిపోర్టులో తెలిపింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. 142 కోట్ల మందితో చైనా రెండో స్థానంలో ఉంది. రాబోయే 77ఏళ్లలో భారతదేశ జనాభా రెట్టింపు అవుతుందని కూడా ఈ నివేదికలో అంచనా వేశారు.

144 కోట్ల జనభాలో ఎవ్వరు ఎక్కువగా ఉన్నారు?

UNFPA నివేదిక ప్రకారం భారత జనాభాలో 24% మంది 0-14 ఏళ్ల మధ్య వారు ఉన్నారు. 17% మంది 10-19 ఏళ్ల వారు ఉన్నారు. 68% మంది 10-24 ఏళ్ల మధ్య వయస్సు వారు ఉన్నారు. 65 ఏళ్లు దాటిన వారి జనాభా 7% ఉంది. 77 ఏళ్లలో భారత జనాభా రెట్టింపు అయ్యింది. ఈ రకంగా చూస్తే ఇండియాలో యువ జనాభా ఎక్కువగా ఉన్నారు. ఇది దేశ అభివృద్ధికి అనుకూలమైన అంశంగా చెప్పుకోవచ్చు.

ఫ్రెండ్స్ మన దేశంలో సరాసరి జీవన కాలం స్త్రీలకు 74 సంవత్సరాలుగాను , పురుషులకు 71 సంవత్సరాలుగాను ఉంది. అలాగే మాతాశిశు మరణాలు కూడా భారీగా తగ్గుముఖం పట్టాయని కూడా నివేదికలో చెప్పబడింది.2006 నుంచి 2023 మధ్య కాలంలో ఇక్కడ 23% బాల్య వివాహాలు జరిగాయని నివేదికలో వెల్లడించడం జరిగింది.

గమనిక: పైన తెలిపిన సమాచారం మొత్తం ఇంటర్నెట్ లో దొరికిన సమాచారంను ఆధారంగా చేసుకొని తెలిపాము. మీకు ఏవైనా సందేహాలు ఉంటె కామెంట్ చేయండి