Chia Seeds In Telugu: ఆకారంలో చిన్నగా ఉండే ఈ చియా గింజలు అద్భుతమైన ఆరోగ్యాన్నిచ్చేవిగా చెప్పవచ్చు. ఇవి చూడటానికి సబ్జా గింజలవలె ఉన్నా, ఇవి పూర్తిగా భిన్నమైనవి.
రోజు ఒక స్పూ న్ చియా గింజలను తీసుకోవటం వలన అనేక లాభాలను మనం పొందవచ్చు.చియా విత్తనాలు బూడిద, గోధుమ, తెలుపు, మరియు నలుపు రంగుల విత్తనాల మిశ్రమం కలిగి దాదాపుగా మట్టి రంగులో ఉంటాయి.
ఈ చియా విత్తనాలు మింట్ అను కుటుంబానికి చెందిన సాల్వియ హిస్పానిక అనే శాస్త్రీయ నామం కలిగిన మొక్క నుండి వస్తాయి. ఇవి సెంట్రల్ అమెరికాలో ఆవిర్భవించినట్లుగా భావిస్తారు. అంతేకాకుండా ఇవి అక్కడ డైట్ కి సంబందించిన ప్రధాన ఆహారంగా పరిగనిస్తారు.
ఇది ముఖ్యముగా సౌత్మెక్సికోలో పండే పంట. కానీ మన భారత దేశానికి గల సారవంతమైన నేల మూలాన, ఇవి మన దేశంలో కూడా పండించడం మొదలు పెట్టారు.
Chia Seeds Benefits In Telugu : చియా విత్తనాలు ప్రయోజనాలు
చియా విత్తనాలు అనేవి మంచి పోషక ఆహారంగా మనకి ఎంతగానో తోడ్పడుతాయి. ఇవి “బరువు తగ్గాలి” అని బాధతో చింతించే వారికి మంచి శరీర సౌష్టవం అందించేందుకు యెంతగానో ఉపయోగపడుతాయి. ఇందులో ఒమేగా3 ఫాట్టి యాసిడ్స్ ఉంటాయి.
ఇంకా ఇందులో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ డి తోపాటు కాల్షియం, కాపర్, పొటాషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, ప్రోటీన్స్, మెగ్నీషియం, జింక్, సల్ఫర్, నియాసిన్, థయామిన్ వంటి ఖనిజాలు మరియు యాంటి-ఓక్సిడెంట్స్ కూడా ఉంటాయి.
1) ఒక్క స్పూన్ చియా విత్తనాలలో దాదాపుగా 5గ్రామ్స్ ఫైబర్ ఉంటుంది. మన శరీరంలోని కొలెస్ట్రోల్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా ఇది మన జీర్ణశక్తిని ఎంతగానో మెరుగుపరుస్తుంది.
2) ఇందులోని యాంటి-ఓక్సిడెంట్స్ మన శరీరాన్ని ఎన్నో ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతాయి.
3) వయస్సు పైబడటం వల్ల వచ్చే వృద్ధాప్య ఛాయాలను తగ్గించి శరీరాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
4) అలాగే కాన్స ర్ కారకాల వృద్ధిని నిరోధిస్తుంది.
5) ఈ చియా గింజల్లోని కాల్షియం, సల్ఫర్, మెగ్నీషియం, మాంగనీస్ అధిక రక్త పోటు సమస్య ను తగ్గించటంలో ఎంతగానో దోహదపడతాయి.
6) దీనిని ప్రతి రోజు తీసుకోవటం వల్ల మన చర్మ ము కూడా ఎంతో కాంతివంతంగా ఉంటుంది.
7) ఈ చియా విత్తనాలు మనం తీసుకోవటం వల్ల మన కడుపు కూడా నిండుగా ఉంటుంది, ఆకలి కూడా అంత తొందరగా అనిపించదు.
8) ఆరోగ్య మైన బరువు పెరిగేందుకు ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి.
9) చియా గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడంలో మంచిగా సహాయపడతాయి.
10) ఇది శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తాయి. అలాగే రక్తంలో ఇన్సులిన్ అసాధారణ స్థాయిలను నియంత్రిస్తాయి.
11) అలాగే వీటిలో లభించే కాల్షియం మీ ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతుంది.
12) ఇందులోని పోషకాలు జుట్టుని కూడా ఆరోగ్యావంతంగా ఉంచుతుంది.
13) అలాగే చియా గింజలలోని పోషకాలు ఆకలి, నిద్ర, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.
14) దీన్ని మనం ఐస్ క్రీమ్ లో కానీ జ్యూస్ లో కూడా వేసుకొని తాగవచ్చు.
15) వీటిని మనం ప్రతిరోజు ఉదయం కానీ, సాయంత్రం కానీ, ఏదో ఒక సమయంలో తీసుకోవచ్చు.
How To Eat Chia Seeds In Telugu : చియా విత్తనాలను ఎలా తీసుకోవాలో మీకు తెలుసా ?
ముందుగా ఒక గ్లాస్లో నీళ్లు తీసుకోండి. దానిలో ఒక స్పూన్ చియా విత్తనాలు తీసుకోండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని స్పూన్తో బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఒక 20 నిమిషాలు పాటు పక్కన ఉంచుకోవాలి.
తర్వాత దానిలో సగం నిమ్మకాయ బద్ధరసం వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ తేనె, దానిలో వేసి మళ్ళీ ఒకసారి ఆ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇక ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తాగవచ్చు.
ఇది కూడా చదవండి :- బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం ఇంటి చిట్కాలు
Chia Seeds Side Effects In Telugu : చియా గింజలు ఎక్కువగా తినవచ్చా?
చియా గింజలను మనం అధిక మొత్తంలో తీసుకోవటం అంత మంచిది కాదు.
1)ఇందులో ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల, వీటిని ఎక్కువ తీసుకోవటం అనేది, మనకు కొంత ఆరోగ్య సమస్య కలిగిస్తుంది.
2) వీటిని అధిక మోతాదు లో తీసుకోవటం వల్ల మలబద్దకం, పొత్తి కడుపులో నొప్పి, ఉబ్బరం, డయేరియా, గ్యాస్, బ్లీడింగ్ వంటి సమస్యలు తలెత్తుతాయి.
3) దీనికొరకు మనం నీళ్ళు కూడా ఎక్కువగా తీసుకోవాలి.
4) వీటిని మనం నీటిలో వేయకుండా గింజలనే విడిగా తీసుకున్నట్లయితే, మనం తర్వాత త్రాగు నీళ్ళకి అవి ఉబ్బి మన గొంతు మింగుడుకి కూడా అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
5) కనుక ముందుగా మనం వీటిని నీటిలో కనీసం 10 నిమిషాలు లేక 20 నిమిషాలు నానపెట్టిన తర్వాతే తీసుకోవటం చాలా మంచిది.
6) ఈ సమస్యలన్నిటిని మీరు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా చియా గింజలను తీసుకోవచ్చు.
ఈ విధంగా చియా గింజలు ( Chia Seeds In Telugu ) మనకి శారీరకంగా, మానసికంగా ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని మనం తగిన మోతాదులో తీసుకోవటం వల్ల, అవి మనకి ఎంతో లాభాన్నిస్తాయి.