ట్యూనా చేపలు ఆరోగ్య ప్రయోజనాలు మరియు దుష్ప్రభావాలు
Tuna Fish In Telugu : ట్యూనా చేప ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చేపలలో ఒకటి. ఇది సముద్రపు చేప కావడంతో దీనిని ఉప్పునీటి చేప అని కూడా పిలుస్తారు. ఇది రుచిలో మరియు పోషకాల సంపదలో ఎంతో ప్రయోజనకరమైనది.
ప్రపంచంలోని ప్రతి మహాసముద్రాలలో వివిధ జాతుల ట్యూనా చేపలు ఉన్నా, ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. వీటి రుచి కారణంగా అంతర్జాతీయ మార్కెట్ లో వీటి డిమాండ్ కూడా ఎక్కువ.
ఈ చేపలలో ఉండే విటమిన్లు, ఖనిజాలు వీటిని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని చెప్పవచ్చు. వీటిలో సోడియం ఎక్కువ లేకుండా యాంటీఆక్సిడెంట్లు మరియు ప్రోటీన్, సెలీనియం, ఫాస్పరస్, ఐరన్, మెగ్నీషియం మరియు పొటాషియం స్థాయిలు సమృద్ధిగా ఉంటాయి. ఆకట్టుకుంటుంది.
ట్యూనాలో విటమిన్ బి 12 మరియు నియాసిన్, విటమిన్ బి 6 మరియు రిబోఫ్లేవిన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో అత్యవసరమైనవి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ట్యూనా చేపలతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి :- అవిసె గింజలు – ఆరోగ్య ప్రయోజనాలు
ఈ చేప యొక్క ఆరోగ్య ప్రయోజనాలు, మరియు దుష్ప్రభావాల గురించి వివరంగా…..
Tuna Fish Benefits In Telugu : ట్యునా చేపలు ఆరోగ్య ప్రయోజనాలు
◆ ట్యూనా మాంసంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల అధిక నిష్పత్తి రక్త నాళాలకు సమతుల్యతను తీసుకువస్తుంది, ధమనుల కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందువల్ల ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ట్యూనా చేపలలోని ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల స్థాయిలు హానికరమైన చెడు కొలెస్ట్రాల్ మరియు ధమనులను అడ్డుకునే ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలను తగ్గించడంలో సహాయపడతాయి. ఒమేగా -3 ఎక్కువగా తినడం వల్ల గుండెపోటుతో సహా హృదయ సంబంధ వ్యాధుల రేటు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
◆ ఎర్ర రక్త కణాల నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించే బి-కాంప్లెక్స్ విటమిన్‌లతో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్ లేకపోతే రక్తహీనతకు తొందరగా గురవుతారు. శరీరానికి తగినంత ఆక్సిజన్ రవాణా జరగదు.
హృదయనాళ వ్యవస్థ చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కొవ్వుతో నిండిపోయి పనితీరు మందగించి రక్తకణాలు క్షీణించడం ప్రారంభమవుతుంది.
ఐరన్ మరియు విటమిన్ బి అధికంగా ఉన్న ట్యూనా తీసుకోవడం వల్ల రక్తకణాలు బలపడతాయి. ఐరన్ రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, శరీర అవయవాల ఆక్సీకరణను మెరుగుపరుస్తుంది.
◆ట్యూనాలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటును గణనీయంగా తగ్గించే ఖనిజం. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ట్యూనాలో ఉండే పొటాషియం వాసోడైలేటర్ మరియు రక్తపోటును తగ్గించడంలో చాలా మంచిది.
◆వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే కంటి శుక్లాలు,కంటి చూపు మందగించడం వంటి కంటి సమస్యలు నివారించడానికి ట్యూనా చేప ఎంతగానో సహాయపడుతుంది.
డయాబెటిక్ రెటినోపతి యొక్క అసమానతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ట్యూనా లోని శక్తివంతమైన ఒమేగా -3 ఆమ్లాలు కంటి సమస్యలు నివారించడానికి ఉపయోగపడతాయి.
◆చేపల మాంసంలో మాంగనీస్, జింక్, విటమిన్ సి మరియు సెలీనియం ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థ యొక్క బూస్టర్‌లుగా పనిచేస్తాయి.
◆ట్యూనా ఫిష్‌లోని ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మహిళల మానసిక ఆరోగ్యానికి ఈ చేప ఎంతగానో ఉపయోగపడుతుంది. ట్యూనా లో ఉండే ఒమేగా -3 బైపోలార్ డిప్రెషన్ లక్షణాలను తగ్గించగలదు.
◆ కొలెస్ట్రాల్ స్థాయిలను ట్యూనా ప్రభావితం చేస్తుంది. రక్తప్రవాహంలో పేరుకుపోయే చెడు కొవ్వులను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది.
◆ ఎముకల నిర్మాణానికి మరియు దృఢంగా ఉండటానికి విటమిన్ డి చాలా అవసరం. ఈ విటమిన్ కాన్సర్ ను నివారించడంలో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
ఎముకల పగుళ్లు లేకుండా బోన్ ఇమ్యూనిటీ సిస్టంను పెంచడంలో విటమిన్ డి తోడ్పడుతుంది. అలాంటి విటమిన్ డి ట్యూనా లో లభిస్తుంది.
◆ట్యూనాలో ట్రేస్ మినరల్ ఉంటుంది, ఇది మానవ శరీర రక్త కణాలకు నష్టం జరగకుండా చేస్తుంది. అలాగే ఇందులోని ఎలాస్టిన్ అనే ప్రోటీన్ చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది.
◆పొటాషియం ఖనిజం శరీరంలో ద్రవ సమతుల్యతకు మరియు మూత్రపిండాల పనితీరుకు సహాయపడుతుంది.
◆ ట్యూనా లోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలతో పోరాడతాయి. రొమ్ము క్యాన్సర్, అన్నవాహిక కాన్సర్, పేగు కాన్సర్, వంటి వాటిని ట్యూనా చేపను తినడం ద్వారా గణనీయంగా తగ్గించుకోవచ్చు.
◆ ట్యూనా ప్రోటీన్ అధికంగా ఉండే మాంసాలలో ఒకటి, ఇది కండరాల పెరుగుదల మరియు కొవ్వు తగ్గడంలో సహాయపడుతుంది. కండరాల పెరుగుదల ప్రోటీన్ల ద్వారానే సాధ్యమవుతుంది.
◆ఈ మాంసంలో కేలరీలు మరియు కొవ్వు తక్కువగా ఉన్నందువల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఆహారం తినాలనే కోర్కెను తగ్గిస్తుంది.
Tuna Fish Side Effects In Telugu : దుష్ప్రభావాలు
మెర్క్యురీ అనేది థర్మామీటర్లు, థర్మోస్టాట్లు మరియు ఆటోమోటివ్ లైట్ స్విచ్‌లలో తరచుగా ఉపయోగించే రసాయనం, అలాగే విద్యుత్ ప్లాంట్లు, సిమెంట్ ప్లాంట్లు మరియు కొన్ని రసాయన తయారీదారులు పారిశ్రామికంగా ఉపయోగిస్తారు. ఈ మెర్క్యూరి పరిశ్రమలు విడుదల చేసే రసాయనాలలో ఉంటుంది. ఈ రసాయనాలు ముఖ్యంగా సముద్రజలాలలో కలుస్తాయి.
◆సముద్రంలో పెరిగే చేపల జాతిలో ఎక్కువగా తినే ట్యూనా చేప ఈ మెర్క్యూరిని ఆహారంగా స్వీకరిస్తుంది.
◆ట్యూనా చేపలలో పాదరసం సాంద్రత ఎక్కువగా ఉంటుంది.
◆ మెర్క్యురీ వాసన మనుషులు గ్రహించలేరు. ఇది శరీరంలోకి చేరితే న్యూరోటాక్సిన్ గా పనిచేస్తుంది. మెదడు మరియు నాడి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.
◆చిన్న పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలలో ఈ పాదరసం చాలా హానికరమైన సమస్యలను తెచ్చిపెడుతుంది.
◆ పిల్లల మెదడు అభివృద్ధి చెందుతున్నప్పుడు, అది పోషకాలను వేగంగా గ్రహిస్తుంది. మెర్క్యురీ ఈ గ్రహించే ప్రక్రియకు ఇబ్బంది కలిగించి పిల్లల్లో బుద్ధిమాంద్యంకు కారణం అవుతుంది. సెరిబ్రల్ పాల్సీ, చెవిటితనం మరియు అంధత్వానికి దారితీస్తుంది.
◆ పెద్దలలో, పాదరసం సంతానోత్పత్తికి అడ్డంకిగా మారుతుంది. మరియు రక్తపోటును అస్తవ్యస్తం చేస్తుంది.
◆మెదడు, నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కారణం అవుతుంది.
◆నరాల పనితీరుకు ఆటంకం కలిగించి చేతులు మరియు కాళ్ళలో వణుకు జబ్బుకు కారణం అవుతుంది.
◆కంటి చూపుకు నష్టం కలుగచేసి అంధత్వానికి కారణం అవుతుంది.
◆శరీరంలో వివిధ అవయవాల పనితీరును, ఆయా భాగాలలో కండరాలను ప్రభావితం చేసి తిమ్మిర్లకు కారణం అవుతుంది.
ఇది కూడా చదవండి :- బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసం ఇంటి చిట్కాలు