పుట్టు మచ్చల శాస్త్రం ప్రకారం ఆడవారికి ఎటువైపు పుట్టు మచ్చ ఉండాలి !

0
ఆడవారికి పుట్టుమచ్చలు ఫలితాలు

ఆడవారికి పుట్టుమచ్చలు ఎటువైపు ఉండాలి | Puttumachalu Sasthram In Telugu For Female

ఆడవారికి పుట్టుమచ్చలు ఫలితాలు :- పుట్టు మచ్చలు అనేవి అమ్మాయి, అబ్బాయి అనే తేడాలేకుండా ఇద్దరకి  పుట్టుకతోనే ఏర్పడుతాయి. ఈ మచ్చలు మహిళలకి శరీరంలో ఎటువైపు ఉండాలి ఎటువైపు ఉండరాదు, ఏ భాగంలో ఉంటె ఐశ్వర్యం కలిసి వస్తుంది, ఏ భాగంలో ఉంటె జీవితంలో కష్టాలు వస్తాయి అనే విషయాలను తెలుసుకుందాం.

ఆడవారికి పుట్టుమచ్చలు ఏ భాగంలో ఉండాలి | Puttumachalu Sasthram For Female    

స్త్రీలకి శరీర భాగంలో పుట్టు మచ్చలు ఏ భాగంలో ఉండాలి ఏ భాగంలో ఉండరాదో తెలుసుకుందాం.

ఆడవారికి భుజం పై పుట్టు మచ్చ ఉంటె :- స్త్రీల భుజాలపై పుట్టుమచ్చ ఉండటం కూడా శుభసూచకంగా పరిగణించబడుతుంది. వారి జీవితంలో అన్ని భౌతిక ఆనందాలను పొందుతారు. ఖరీదైన దుస్తులను ఇష్టపడతారు.

స్త్రీలకి చేవిలోపల మచ్చ ఉంటె :- చెవిలో పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు అదృష్టవంతులు. వారు చాలా ప్రతిభావంతులు, తెలివైనవారు. వారికి నాయకత్వ సామర్థ్యాలు ఉన్నాయి. జీవిత నిర్ణయాలను చక్కగా తీసుకుంటారు.

మహిళలకి కుడి లేదా ఎడమ కనుబొమ్మ మీద మచ్చ ఉంటె :- కనుబొమ్మ మీద పుట్ట మచ్చ ఉంటె వారికి వివాహం కూడా ఒక ధనవంతుడితో అవుతుంది. అలాగే కుడి లేదా ఎడమ కనుబొమ్మపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు జీవితంలో చాలా డబ్బు, కీర్తిని పొందుతారు. వారికి చాలా అదృష్టం కూడా వస్తుంది.