Deepavali importance in telugu | Rangoli images for diwali 2021
ఈ అమావాస్య దీపావళి రోజు లక్ష్మి దేవి కి ఎంతో ఇష్టమైన మరియు పవిత్రమైన రోజు. ఈ దీపావళి రోజు ఉదయం మరియు సాయంత్రం ఈ ఒక్కటి మీరు నీటిలో వేసుకుని స్నానం చేస్తే గత జన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి. పేద వారు సైతం కుబేరులు గా మారుతారు.
నరకాసురుని చంపిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన తర్వాత ప్రజలు దీపావళి చేసుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా రాముడు రావణాసురుని సంహరించి లంకకు వచ్చిన తర్వాత ప్రజలు ఆనందంగా దీపావళి జరుపుకున్నారని పురాణాల్లో ఉంది.
దీపావళి ప్రాముఖ్యత ( Importance of diwali in telugu )
ఈరోజు దీపపు నూనెలోకి లక్ష్మీదేవి వస్తుంది. ప్రత్యేకంగా నువ్వుల నూనె లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. దీపం అనగా తెల్లవారుజామున నాలుగు నాలుగున్నర మధ్యలో పెట్టినప్పుడే ఆ పవిత్రత మీకు చేరుతుంది. అప్పుడే లక్ష్మీదేవి దీపం లోకి వస్తుంది. కానీ దీనికంటే ముందు మీరు స్నానం చేసి శుద్ధి గా ఉండాలి.
దీపం పెట్టడం వల్ల ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది. మరియు పాపాలు తొలగిపోవాలంటే గంగా స్నానం చేయాలి. అయితే ప్రతి రోజు అందరికీ గంగా స్నానం చేయడానికి వీలు ఉండదు. ఎక్కడైనా తటాకంలో కానీ, బావి లో కానీ నీరు ఉంటే చేయవచ్చు.
దీపావళి రోజు మీ దరిద్రం పోవాలంటే ఒంటికి నూనె రాసుకోవాలి తలకు కూడా నూనె రాసుకోవాలి. తెల్లవారుజామునే తలస్నానం చేయాలి. తర్వాత ఎవరైతే దీపం పెడతారో వారికి పాప పరిహారం లభిస్తుంది. గంగా స్నానం చేసినంత ఫలితం వస్తుంది. దరిద్రం మొత్తం వెళ్ళిపోయి అదృష్టం పడుతుంది.
తర్వాత ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్లి నీళ్లు పోసి మట్టి వేళ్ళతో సహా ఉత్తరేణి మొక్క ఇంటికి తీసుకొచ్చి మూడుసార్లు చుట్టూ తిప్పుకోవాలి స్నానానికి ముందు. ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా తిప్పాలి. ఆ తర్వాత మొక్క ను పక్కన పడేసి ఒంటి మీద బట్టలతో స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులతో దరిద్రం తొలగిపోతుంది. యమధర్మరాజు పాపాలన్నీ తొలగి పోయే విధంగా చేస్తాడు.
దీపావళి స్నానం ( Importance of bathing on diwali )
జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం రావడం కోసం దీపావళి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో కి వేపాకు, రాళ్ల ఉప్పు వేసుకుని స్నానం చేయాలి. ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది మరియు సిరుల వర్షం కురిపిస్తుంది.
అనారోగ్య సమస్యలు పోతాయి. మీ ఒంట్లో ఉండే అనేక రకాల వ్యాధులు మీకు తెలియకుండానే నయమవుతాయి. దీపావళి అమావాస్య రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే పేద వారు కుబేరులు అవుతారు అనడంలో సందేహం లేదు.
ఆ తర్వాత దీపావళి రోజున బాణసంచా కాల్చడం తో దరిద్రం తొలగి పోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలలో తెలియజేయబడింది. ముఖ్యంగా దీపావళి అమావాస్య రోజున అంగడి నుంచి ఉప్పుకొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.
ఎందుకంటే లక్ష్మీదేవి సముద్రం నుండి పుట్టింది, ఉప్పుకూడా సముద్రం నుండే పుడుతుంది. అందుకే లక్ష్మీ దేవత కు ఉప్పు అంటే చాలా ఇష్టం. అమావాస్య తిథి నవంబర్ 4వ తేదీ ఉదయం 6:00 నుండి ఐదవ తేదీ తెల్లవారుజామున రెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది.
ఇవి కూడా చదవండి :-