ఆడవారిపై బల్లి పడిందా ? అయితే ఇవి తెలుసుకోండి.

0
balli sastram in telugu for female 2021
balli sastram in telugu for female 2021

ఆడవాళ్ళ శరీరంలో ఏ భాగంలో బల్లి పడితే  ఏమవుతుంది ??

Balli sastram in telugu for female : నమ్మకాలు, శకునాలతో ముడిపడిన మన భారతీయ సంప్రదాయంలో బల్లి కూడా ఒకటి. పిల్లి ఎదుడవడం, బల్లి మీద పడటం, బల్లి అరవడం, కుక్క అరుపులు ఇలాంటి వాటితో మన నమ్మకాలు బోలెడు. బల్లి మన మీద పడటం కూడా అలాంటి ఒక నమ్మకమే.

ఈ బల్లి నమ్మకాలను కలిపి ఒక శాస్త్రంగా రూపొందించారు. ఈ నమ్మకాలు కూడా ఆడవాళ్ళ విషయంలో వేరుగానూ, మగవాళ్ల విషయంలో వేరుగానూ ఉంటాయి. ఆడవాళ్ళ విషయంలో బలిశాస్త్రం ఏమని చెబుతోంది?? ఆడవారి శరీర భాగాల్లో ఎక్కడ బల్లి పడితే ఏమి జరుగుతుంది?? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవలసిందే.

సాధారణంగా ఆడవాళ్లు ఇంటిపనుల్లో ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా బూజు దులపడం, ఇంట్లో సామాన్లు అన్ని అందంగా సర్దడం వంటివి చేస్తుంటారు. బల్లులు కూడా ఎక్కువగా ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటాయి. బల్లి పడే ప్రాంతాలు ఎక్కువగా తలమీద, కాళ్ళ మీద, వీపు భాగంలో, చేతుల మీద, పై నుండి కింద పడ్డాక కాళ్ళ మీద పాకుతూ పోవడం వంటివి జరుగుతూ ఉంటాయి.

అలా జరిగిపోయాకా కాసింత టెన్షన్ తో పెద్దవాళ్లకు కాల్ చేసి ఏమవుతుంది?? ఏంటి?? వంటి విషయాలు అడగడం సాదారణంగా చేస్తూనే ఉంటాం. అయితే అంత శ్రమ అవసరం లేకుండా ఇదిగో ఇలా ఇక్కడ పొందుపరిచిన విషయన్ని జాగ్రత్త చేసుకుంటే ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా విషయం తెలుసుకోవచ్చు.

Balli Sastram For Female In Telugu : ఆడవాళ్ళ పై బల్లి పడితే ఏమవుతుంది ?

balli sastram in telugu for female and female 2021
balli sastram in telugu for female 2021

◆ ఆడవాళ్ళ తలమీద బల్లి పడితే ప్రాణభయం వెంటాడుతుందట. శత్రువుల నుండో లేదా ఏమైనా జరుగుతుందేమోనే భయాలు కారణం కావచ్చు.

◆ ఎడమ కన్ను మీద బల్లి పడితే ఆడవాళ్లు అసలు బెంగపడకూడదు, ఎందుకంటే ఎంతో సంతోషించాల్సిన విషయమిది. కారణం ఏమంటే ఎడమకన్ను మీద బల్లి పడితే మాములు కంటే ఎక్కువ ప్రేమను భర్త నుండి పొందుతారట.

◆ కుడి చెంప మీద బల్లి పడితే పుత్ర లాభం అంట. పిల్లల కోసం ముఖ్యంగా వారసుడు పుట్టాలని కలలు కానీ ఆడవాళ్లకు బల్లి ఇలా సంకేతం ఇస్తుందని కూడా నమ్ముతారు.

◆ పై పెదవి మీద బల్లి పడితే విరోధం కలుగుతుందట. స్నేహితులతో కావచ్చు, చుట్టాలతో కావచ్చు, ఇరుగు పొరుగుతో కావచ్చు లేక ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతో కావచ్చు మొత్తానికి గొడవలు జరిగి, శత్రువుల్లా మారిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయట.

◆ వీపు మీద బల్లి పడితే చావు కబురు వింటారట. 

◆ కుడి భుజం మీద బల్లి పడితే మాత్రం అమ్మాయిలు సిగ్గుపడిపోవలసిందే. భాగస్వామితో చాలా రొమాంటిక్ గా గడుపుతారట ఇలా జరిగితే.

◆ భుజాల మీద బల్లి పడితే ఆభరణాలు అంటే నగలు, బంగారం వంటివి సొంతమయ్యే సూచనలున్నట్టు సంకేతమట.

◆ మోకాళ్ళ మీద బల్లి పడితే కష్టాలు అమ్మాయిల వైపు వస్తున్నట్టు సంకేతమట.

ఇలా బల్లి మీద పడితే మంచి చెడు అన్ని జరుగుతుంటాయి కదా మరి మనకు చెడు కలిగించేవాటిని తప్పించుకోవడం ఎలా అనిపిస్తే సింపుల్ గా బల్లి పడిన వెంటనే తల స్నానం చేసి ఆముదం లేదా నువ్వుల నూనెతో ఇంట్లో దీపారాధన చేయడం. కుదిరిన వాళ్ళు దగ్గరలో గుడి ఉంటే గుడికెళ్లి దేవుడి దర్శనం చేసుకోవడం.

ఇది కూడా చదవండి :-  బల్లి శరీరంపై పడితే ఏమవుతుంది ?? బలిశాస్త్రం ఏమి చెబుతోంది ??