రాశి ఫలాలు ఈ రోజు 15 June 2022 | Today Rasi Phalalu In Telugu
Rasi Phalalu Today In Telugu : ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకొందం. ఏ రాశివారికి ఎం జరుగుతుంది. ఈ రోజు ఎవరకి మంచి జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది. ఎవరికీ కలసి వస్తుంది అన్ని విశేషాలు ఈ రోజు మేష రాశి నుండి మీనా రాశి వరకు తెలుసుకొందం.
15 జూన్ 2022 రోజు రాశి ఫలాలు | Rasi Phalalu Telugu lo
- మేష రాశి (Aries) : మీ ఆర్థిక వ్యవహారాలపై ఓ కన్నేయాల్సిన రోజిది. అలానే నేడు మీ డాక్యుమెంట్స్ చక్కగా సర్ది పెట్టుకోవడం మంచిది. మీరు చాలా విషయాలను వాయిదా వేస్తూ ఉండవచ్చు, అవన్నీ త్వరలో మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశముంది.
- వృషభం రాశి(Taurus) : మీరు రోజులో ఒకటి లేదా రెండు విషయాల వల్ల ఆనందపడొచ్చు. ఈ ఆనందం యాంటీ స్ట్రెస్ థెరపీగా పనిచేస్తుంది. మీ సీనియర్లు మీకు ఇప్పుడేం సూచిస్తున్నారో చాలా జాగ్రత్తగా గమనించాలి, ఎందుకంటే వారిచ్చే హింట్‌కు అనుగుణంగా ఏదో ఒకటి త్వరలోనే జరగవచ్చు.
- మిధునం రాశి(Gemin) : ఈ రోజు మీకు ప్రత్యేకమైన రోజు అని చెప్పవచ్చు. మీ మనస్సులో ఏదైనా ఉంటే, దానిని వ్యక్తపరచండి. ప్రగతికి కొత్త దారులు తెరుచుకుంటాయి. మహిళలు తమ కెరీర్ గురించి మరింత లోతుగా ఆలోచించాలి. ఆస్తి కొనుగోలుకు ఈ రోజు చాలా మంచిది.
- కర్కటక రాశి (Cancer) : కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
- సింహ రాశి(Leo) : ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు, ప్రతి పనిని ఆలస్యంగా పూర్తిచేస్తారు, వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.
- కన్య రాశి(Virgo) : తెలియకుండానే ఏదో ఒక విషయంలో తీర్పు చెప్పాలని మీరు నిర్ణయించుకున్నట్లయితే, అది మిమ్మల్ని ఆశ్చర్యపరచవచ్చు. మీ ప్రస్తుత వర్క్‌ను పెంచే కొత్త అవకాశం రాబోతోంది, ఒక అభిరుచి మళ్లీ మీ జీవితంలో ప్రాధాన్యత పొందే అవకాశముంది.
- తుల రాశి(Libra) : ఈ రోజు పనిలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రోజు మీరు మీ కుటుంబ వ్యాపారంలో మీ జీవిత భాగస్వామికి విధేయత చూపవలసి ఉంటుంది. ప్రభుత్వ నిబంధనల వల్ల వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
- వృశ్చిక రాశి(Scorpio) : అనారోగ్య బాధలతో సతమతమవుతారు స్థానచలన సూచనలు ఉంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు, కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన చెందుతారు, గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
- ధనుస్సు రాశి(Sagittarius) : మీరు అనవసరంగా చాలా భావోద్వేగానికి లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలో మీ ఆఫీస్‌లో సానుకూల అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, ఎవరు మంచివారు, ఎవరు మంచి వ్యక్తిగా నటిస్తున్నారు అనేది మీరు తెలుసుకోవాల్సిన సమయం రోజు.
- మకర రాశి(Capricorn) : గొప్పవారి పరిచయం ఏర్పడుతుంది, స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉంటారు, బంధు, మిత్రులు గౌరవిస్తారు. కటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు, సత్కార్యాల్లో పాల్గొంటారు.
- కుంభ రాశి(Aquarius) : మీరు మీ నిర్ణయంపై దృఢంగా ఉండాలని మొండిగా ప్రయత్నించకూడదు. పనిలో ఉన్న సీనియర్లు మీ పనితీరును అభినందిస్తారు, అదనపు బాధ్యత మీపైకి రావచ్చు, మీ గురించి మీరు స్పష్టంగా వ్యక్తపరిస్తే మంచిది.
- మీనా రాశి(Pisces) : ఈ రోజు మీరు కొత్త పనుల పట్ల ఆసక్తిని కనబరుస్తారు. మీ శక్తి, ధైర్యం, బలంతో మీరు డబ్బు సంపాదించగలరు, యువతీ యువకులు కెరీర్‌కు సంబంధించిన కొత్త సమాచారం పొందుతారు, గతంలో జరిగిన సంఘటనల వల్ల మాత్రమే వివాదాలు తలెత్తుతాయి.
ఇవి కూడా చదవండి :-